News


ఆటుపోట్ల మధ్య తప్పని పతనం

Thursday 19th March 2020
Markets_main1584614108.png-32580

600 పాయింట్లు పడిన సెన్సెక్స్‌
నిఫ్టీకి 200 పాయింట్లు లాస్‌
75కంటే దిగువకు జారిన రూపాయి
మధ్యాహ్నానికల్లా లాభాల్లోకి మార్కెట్‌

3000 పాయింట్ల పరిధిలో ఊగిసలాట
 

పట్టువొదలకుండా ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా వైరస్‌ షాక్‌కు మరోసారి దేశీ స్టాక్‌ మార్కెట్లు దెబ్బతిన్నాయి. సెన్సెక్స్‌ 581 పాయింట్లు పతనమై 28,288 వద్ద నిలవగా.. నిఫ్టీ  205 పాయింట్లు కోల్పోయి 8,263 వద్ద ముగిసింది. బుధవారం అమెరికా, యూరోపియన్‌ మార్కెట్లు 6 శాతం పడిపోవడంతో కుదేలైన ఇన్వెస్టర్లు తొలి నుంచీ అమ్మకాలకు ఎగబడ్డారు. దీంతో తొలుత ఒక దశలో సెన్సెక్స్‌ 26,714కు దిగిపోయింది. ఇది 2,150 పాయింట్ల నష్టంకాగా.. తదుపరి మధ్యాహ్నం రెండుకల్లా లాభాల్లోకి ప్రవేశించింది. 29,370 పాయింట్లను అధిగమించింది. వెరసి 500 పాయింట్లు జంప్‌చేసింది. ట్రేడర్లు షార్ట్‌కవరింగ్‌ చేపట్టడంతో మార్కెట్లకు జోష్‌వచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. తదుపరి చివర్లో అమ్మకాలు ఊపందుకోవడంతో మార్కెట్లు వెనకడుగుతో ముగిశాయి. ఇక నిఫ్టీ సైతం 8575 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకగా.. 7833 దిగువన కనిష్టాన్నీ చవిచూసింది. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే రూపాయి చరిత్రాత్మక కనిష్టానికి చేరడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. తొలి దశలోనే రూపాయి 78.08కు చేరింది. అయితే యూరోపియన్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభంకావడంతో ఇన్వెస్టర్లకు కొంతమేర ఉపశమనం లభించినట్లు విశ్లేషకులు తెలియజేశారు.

అన్ని రంగాలూ డౌన్‌
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ నీరసించగా.. ఆటో, మెటల్‌, మీడియా, రియల్టీ, ఐటీ, బ్యాంక్‌ నిఫ్టీ 6-3 శాతం మధ్య పతనమయ్యాయి. ఎన్‌ఎస్‌ఈలో ఆటో ఇండెక్స్‌ ఆరేళ్ల కనిష్టానికి చేరింది. నిఫ్టీ దిగ్గజాలలో ఇన్‌ఫ్రాటెల్‌ 18 శాతం కుప్పకూలగా.. జీ, శ్రీ సిమెంట్‌, ఓఎన్‌జీసీ, బీపీసీఎల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, యాక్సిస్‌, హిందాల్కో, మారుతీ, ఎంఅండ్‌ఎం 14-9 శాతం మధ్య పడిపోయాయి. అయితే ఐటీసీ 7 శాతం జంప్‌చేయగా.. ఎయిర్‌టెల్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, కొటక్‌ బ్యాంక్‌, హీరో మోటో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, బజాజ్‌ ఆటో 4.5-1 శాతం మధ్య లాభపడ్డాయి.

ఐబీ హౌసింగ్‌ బేర్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో ఐబీ హౌసింగ్‌ 36 శాతం కుప్పకూలగా.. అశోక్‌ లేలాండ్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌, జస్ట్‌డయల్‌, బీఈఎల్‌, చోళమండలం, శ్రీ సిమెంట్‌, భారత్‌ ఫోర్జ్‌ 25-12 శాతం మధ్య తిరోగమించాయి. కాగా.. మరోవైపు ఐడియా, ఎక్సైడ్‌, గ్లెన్‌మార్క్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, లుపిన్‌, మదర్‌సన్‌, మ్యాక్స్‌ ఫైనాన్స్‌ 8-3.3 శాతం మధ్య జంప్‌చేశాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 4.5-3.7 శాతం చొప్పున బోర్లా పడ్డాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1829 నష్టపోగా.. 573 మాత్రమే లాభపడ్డాయి.

భారీ విక్రయాలు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 5085 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌  (డీఐఐలు) రూ. 3636 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 4045 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టగా.. డీఐఐలు రూ. 3422 కోట్లను ఇన్వెస్ట్‌  చేశాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 3810 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 2615  కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.  You may be interested

ధరల పతనమే.. విలువ మారలేదు: రామ్‌దేవ్‌ అగర్వాల్‌

Friday 20th March 2020

అమెరికాలో మాదిరే ప్రపంచం అంతా ప్యాసివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కు మారుతోందని, కొత్తగా వచ్చే సబ్‌స్క్రిప్షన్లు ప్యాసివ్‌ ఫండ్స్‌లోనే ఉంటున్నాయని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ వ్యవస్థాపకుడు రామ్‌దేవ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం అమ్మకాలు కూడా ప్యాసివ్‌ ఫండ్స్‌ (ఇండెక్స్‌ ఫండ్స్‌/ఈటీఎఫ్‌) చేస్తున్నాయని చెప్పారు. మార్కెట్‌ పతనం, సంక్షోభంపై ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడారు.    కరోనా సంక్షోభంపై మాట్లాడుతూ.. ‘‘ప్రతీ ఒక్కరికీ ఇది ఒకటి రెండు నెలలే అని తెలిసినప్పటికీ.. మార్కెట్‌

52 వారాల కనిష్టానికి 870 షేర్లు

Thursday 19th March 2020

 గురువారం ఎన్‌ఎస్‌ఈలో 870 షేర్లు ఏడాది కనిష్టానికి పతనమయ్యాయి. వీటిలో 21ఫస్ట్‌ సెంచురీ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌, 3ఐ ఇన్ఫోటెక్‌, 3ఎం ఇండియా, 3పీ ల్యాండ్‌ హోల్డింగ్స్‌, 5పైసా క్యాపిటల్‌, 63 మూన్స్‌ టెక్నాలజీస్‌, ఏ2జెడ్‌ ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్‌, ఆర్తి డ్రగ్స్‌, ఆర్వీ డెనిమ్స్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్స్‌, అబాన్‌ ఆఫ్‌షోర్‌, ఆదిత్యా బిర్లా క్యాపిటల్‌, ఆదిత్యా బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రీటైల్‌, ఏసీసీ, యాక‌్షన్‌ కన్‌స్ట్రక‌్షన్‌ ఎక్విప్‌మెంట్‌, ఏడీఎఫ్‌ ఫుడ్స్‌, ఆధునిక్‌

Most from this category