News


చివరికి పతనమే- ఆగని అమ్మకాలు

Tuesday 17th March 2020
Markets_main1584441953.png-32536

సెన్సెక్స్‌ 811 పాయింట్లు డౌన్‌
230 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ

మూడేళ్ల తదుపరి నిఫ్టీ 9,000 దిగువకు
ప్రయివేట్‌ బ్యాంక్స్‌, మీడియా బోర్లా
59 శాతం దూసుకెళ్లిన యస్‌ బ్యాంక్‌ 

ప్రపంచ మహమ్మారిగా అవతారమెత్తిన కోవిడ్‌-19 ధాటికి మరోసారి దేశీ స్టాక్‌ మార్కెట్లు కుదేలయ్యాయి. సెన్సెక్స్‌ 811 పాయింట్లు పతనమై 30,579 వద్ద నిలవగా.. నిఫ్టీ 230 పాయింట్లు కోల్పోయి 8.967 వద్ద ముగిసింది. వెరసి మూడేళ్ల తదుపరి నిఫ్టీ 9,000 పాయింట్ల మైలురాయి దిగువన ముగిసింది. చైనాలో పుట్టి అమెరికా, యూరోపియన్‌, ఇరాన్‌ తదితర దేశాలను చుట్టిముట్టిన కరోనా తాజాగా దేశీయంగానూ తలెత్తుతుండటంతో ఇన్వెస్టర్లు ఆందోళనకు లోనవుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు అమెరికా, ఆసియా, యూరోపియన్‌ మార్కెట్లలోనూ అమ్మకాలు కొనసాగుతుండటంతో సెంటిమెంటు బలహీనపడినట్లు తెలియజేశారు. అయితే ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌కు దిగడంతో తొలుత మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. తదుపరి ఆటుపోట్లను ఎదుర్కొన్నాయి. చివర్లో అమ్మకాలు పెరగడంతో డీలాపడ్డాయి. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 31,945 వద్ద గరిష్టాన్ని తాకగా.. 30,745 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. ఈ బాటలో నిఫ్టీ 9,404- 8,916 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల తగ్గింపు, బిలియన్లకొద్దీ నిధుల వెచ్చింపు ద్వారా ఆర్థిక వ్యవస్థలకు దన్నునిచ్చే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సఫలంకాకపోవచ్చన్న అంచనాలు మార్కెట్లు, బంగారం, చమురు ధరలను పడగొడుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

జీ డౌన్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మీడియా, ప్రయివేట్‌ రంగ బ్యాంక్‌ ఇండెక్సులు 5-4 శాతం చొప్పున పతనంకాగా.. ఐటీ, రియల్టీ, మెటల్‌ 3-1 శాతం మధ్య వెనకడుగు వేశాయి. అయితే ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా రంగాలు 1 శాతం స్థాయిలో బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో జీ 20 శాతం కుప్పకూలగా.. ఇండస్‌ఇండ్‌, ఐసీఐసీఐ, ఇన్‌ఫ్రాటెల్‌, యూపీఎల్‌, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫిన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, గెయిల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 9-5.4 శాతం మధ్య నీరసించాయి. ఇతర బ్లూచిప్స్‌లో యస్‌ బ్యాంక్‌ 59 శాతం దూసుకెళ్లగా.. హెచ్‌యూఎల్‌, ఐషర్‌, హీరో మోటో, కోల్‌ ఇండియా, మారుతీ, ఏషియన్‌ పెయింట్స్‌, సిప్లా, పవర్‌గ్రిడ్‌, అదానీ పోర్ట్స్‌ 3-2 శాతం మధ్య పుంజుకున్నాయి.

మణప్పురం వీక్‌
డెరివేటివ్స్‌లో మణప్పురం, సెంచురీ టెక్స్‌, ఐడియా, ఉజ్జీవన్‌, ఈక్విటాస్‌, ముత్తూట్‌, ఫెడరల్‌ బ్యాంక్‌ 16-8.5 శాతం మధ్య పడిపోయాయి. కాగా.. మరోపక్క బీఈఎల్‌, హెచ్‌పీసీఎల్‌, పిడిలైట్‌, కేడిలా హెల్త్‌, ఐబీ హౌసింగ్‌, ఎన్‌సీసీ, బెర్జర్‌ పెయింట్స్‌, మైండ్‌ట్రీ, అరబిందో 7-4 శాతం మధ్య జంప్‌చేశాయి. రియల్టీ కౌంటర్లలో శోభా, ఇండియాబుల్స్‌, బ్రిగేడ్‌, సన్‌టెక్‌, ఫీనిక్స్‌, మహీంద్రా లైఫ్‌, డీఎల్‌ఎఫ్‌, ఒబెరాయ్‌ 6.5-2 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1.4-0.6 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 779 మాత్రమే లాభపడగా.. 1650  నష్టపోయాయి. 

విక్రయాల బాటలోనే..
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 3810 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌ (డీఐఐలు) రూ. 2615 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. కాగా.. వారాంతాన ఎఫ్‌పీఐలు రూ. 6028 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టగా.. దేశీ ఫండ్స్‌ రూ. 5868 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.   
 You may be interested

ఈ స్థాయి నుంచి రికవరీ..: గౌరవ్‌గార్గ్‌

Wednesday 18th March 2020

స్టాక్‌ మార్కెట్లు ఇంత తీవ్ర స్థాయిలో పడిపోవడానికి మన దేశంలో వ్యాపారాలు ఏమీ దెబ్బతినలేదని.. లేదా ఆర్థిక వ్యవస్థకు వచ్చిన తీవ్రమైన సమస్య ఏమీ లేదన్నారు క్యాపిటల్‌వయా గ్లోబల్‌ రీసెర్చ్‌ లిమిటెడ్‌కు చెందిన గౌరగ్‌గార్గ్‌. నిఫ్టీ-50 ఈ స్థాయి నుంచి కోలుకునేందుకు చక్కని అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. సమీప కాలానికి మార్కెట్‌ ఆకర్షణీయంగా ఉందన్నారు. 10,500 నిరోధం ఎదురుకావచ్చని అంచనా వ్యక్తం చేశారు. నిఫ్టీ, సెన్సెక్స్‌ ఇప్పటికే 25 శాతం వరకు

కుప్పకూలిన జీ, జెట్‌, డెల్టా కార్ప్‌, దివాన్‌

Tuesday 17th March 2020

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు యస్‌ బ్యాంక్‌ కేసు ఎఫెక్ట్‌   సిక్కింలో కేసినో మూతతో డెల్టా కార్ప్‌నకు దెబ్బ ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న యస్‌ బ్యాంక్‌ నుంచి రుణాలు పొందిన సంస్థలు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌ కంపెనీల ప్రమోటర్లను ఈ నెల 18న హాజరుకావలసిందిగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తాజాగా ఆదేశాలు జారీ చేసింది. యస్‌ బ్యాంక్‌ ప్రమోటర్‌ రాణాకపూర్‌పై నమోదైన మనీలాండరింగ్‌ కేసు విషయంలో తాజా ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. ఇదే

Most from this category