STOCKS

News


మార్కెట్‌ ట్రెండ్‌ రివర్స్‌ అవుతుంది

Saturday 24th August 2019
Markets_main1566638637.png-27992

-విశ్లేషకుల అంచనా
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం ప్రకటించిన ఆర్థిక చర్యలపై మార్కెట్‌ వర్గాలు సంతృప్తిగా ఉన్నాయి. ఇది దేశ ఆర్థిక మందగమనాన్ని నిలువరించగలదని అభిప్రాయపడ్డాయి. ఈ ఉద్దీపన చర్యల కారణాన సోమవారం మార్కెట్‌ పెద్ద గ్యాప్‌ అప్‌తో ప్రారంభమవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎఫ్‌పీఐ, డీఐఐలపై అదనపు సర్‌చార్జీని ఉపసంహరించడం, తక్షణమే ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధనాన్ని సమకూర్చడం వంటి ప్రతిపాదనలను శుక్రవారం ఆర్థిక మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా వడ్డీ రేట్ల కోత ఫలితాలను వినియోగదారులకు బదిలీ చేయాలని బ్యాంకులు ఆమె కోరారు. బ్యాంకులు రెపో-లింక్డ్‌ రుణ సదుపాయాన్ని ప్రారంబించనున్నాయిని అన్నారు. కాగా రేట్ల కోత బదిలీ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడానికి ఉపయోగపడుతుందని విశ్లేషకులు తెలిపారు. 
   ‘ ప్రభుత్వరంగ బ్యాంకులకు మూలధనాన్ని అందించడం, వాహనాల కొనుగోళ్లపై తరుగుదలను రెట్టింపు చేయడం ప్రభుత్వం తీసుకున్న తెలివైన నిర్ణయాలలో ముఖ్యమైనవి’ అని ప్రభుదాస్ లిలాధర్ బ్రోకరేజ్ సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ అమీషా వోరా అన్నారు. ‘ఇప్పుడు ట్యాక్స్‌ డిపార్టమెంట్‌ నుంచి ఎటువంటి ఒత్తిడి ఉండదు. ట్యాక్స్‌లను ఉపసంహరించుకోవడం చాలా మంచి నిర్ణయం’ అని ఆమె అన్నారు.  ‘ఎఫ్‌పీఐలపై అదనపు సర్‌చార్జిని ఉపసంహరించుకోవడం భారత మార్కెట్‌కు పెద్ద సానుకూలత. దీని వలన బడ్జెట్ నుంచి నిధుల ఔట్‌ ఫ్లోను కట్టడి చేయవచ్చు. ఫలితంగా రూపీ కూడా బలపడుతుంది. మొత్తంమీద, భారత ఆర్థిక వ్యవస్థకు ఇది మంచి సెంటిమెంట్ బూస్టర్’ అని కోటక్ సెక్యూరిటీ, ఫండ్‌మెంటల్‌ రిసెర్చ్‌ హెడ్‌ రుస్మిక్ ఓజా అన్నారు. ఇన్వెస్టర్ల అంచనాలను కాపాడడానికి, వినియోగదారుల విశ్వాసాన్ని మెరుగుపర్చడానికి ఈ చర్యలు ఉపయోగపడతాయని సాంక్టమ్ వెల్త్ మేనేజ్‌మెంట్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ సునీల్ శర్మ అన్నారు. ‘ మార్కెట్‌లు సోమవారం ఉదయం గ్యాప్‌ అప్‌తో ప్రారంభమవుతుందని అంచనావేస్తున్నాం. అంతేకాకుండా సంస్కరణల ద్వారా వృద్ధిని పునరుద్ధరించే ప్రక్రియ మొదలు కాబోతున్నాయని ఆశిస్తున్నా’ అని ఆయన అన్నారు. 
   కాగా ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం రూ. 2-5 కోట్ల ఆదాయం ఉన్నవారిపై సర్‌చార్జీని 15 శాతం నుంచి 25 శాతానికి, రూ .5 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం కలిగిన వారిపై సర్‌చార్జిని 15 శాతం నుంచి 37 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. దీని ఫలితంగా ట్రస్టులుగా లేదా వ్యక్తుల సంఘంగా పనిచేసే ఎఫ్‌పీఐలపై  తీవ్ర ప్రభావం పడింది. జూలై ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మొత్తంగా 310 కోట్ల డాలర్లను ఇండియా మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐలు తరలించడం గమనార్హం.You may be interested

సోమవారం జలాన్‌ కమిటి నివేదిక సమర్పణ

Saturday 24th August 2019

 జలాన్‌ ప్యానెల్‌ సోమవారం తన నివేదికను ఆర్‌బీకి సమర్పించనుంది. ఆర్‌బీఐ బోర్డు కూడా అదే రోజూ నుంచి పరిగణలోకి తీసుకోంది. ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం ప్రస్తుతం ఆర్‌బీఐ వద్ద స్థూల ఆస్తుల్లో 28 శాతానికి సమానమైన (రూ.9 లక్షల కోట్లు) మిగులు నిధులున్నాయి. ఆర్‌బీఐ వద్ద ఉన్న మొత్తం ఈ రూ.9లక్షల కోట్ల నిధుల్లో రూ.3లక్షల కోట్లను తమకు బదలాయించుకోవాలని కేంద్రం పట్టుపట్టింది. అయితే నాటి ఆర్‌బీఐ గవర్నర్‌

మళ్లీ మొదలైన పసిడి పరుగులు

Saturday 24th August 2019

అగ్రరాజ్యాల మధ్య వాణిజ్యయుద్ధ ఉద్రికత్తలు  రాజుకోవడంతో ప్రపంచమార్కెట్లో పసిడి పరుగులు మళ్లీ మొదలయ్యాయి. అమెరికాలో శుక్రవారం​రాత్రి  29డాలర్లు లాభపడి 1,537.60డాలర్ల వద్ద స్థిరపడింది. గడిచిన 3వారాల్లో పసిడి ఒకరోజులో ఇంతస్థాయిలో ర్యాలీ చేయడం ఇదే తొలిసారి. ఈ వారం మొత్తంగా పసిడి ధర 13డాలర్లు పెరిగింది. అమెరికాకు చెందిన 75 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులపై అదనంగా 10శాతం సుంకాలను విధిస్తున్నట్లు చైనా శుక్రవారం ప్రకటించింది. సెప్టెంబర్‌ 1 నుంచి కొన్ని

Most from this category