News


రికార్డుల ర్యాలీ కొనసాగేనా..?

Monday 23rd December 2019
Markets_main1577070334.png-30362

  • ఈ వారంలోనే డిసెంబర్‌ సిరీస్‌ ఎఫ్‌ అండ్‌ ఓ ముగింపు
  • సోమవారం సెన్సెక్స్‌ సూచీ నుంచి టాటా మోటార్స్, టాటా మోటార్స్ డీవీఆర్, యస్‌ బ్యాంక్, వేదాంత బయటకు-
  • ఇండెక్స్‌లోకి చేరనున్న అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్, నెస్లే ఇండియా-
  • సూచీలో మార్పులు, ఏడాది చివరి రోజుల కారణంగా కన్సాలిడేషన్‌కు అవకాశం..!-
  • ట్రేడింగ్‌ 4 రోజులకే పరిమితం-
  • క్రిస్మస్‌ సందర్భంగా బుధవారం మార్కెట్‌కు సెలవు

న్యూఢిల్లీ: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ గతవారం వరుస రికార్డులతో దూసుకెళ్లింది. మొత్తం ఐదు ట్రేడింగ్‌ రోజుల్లో.. ఏకంగా నాలుగు రోజులు సెన్సెక్స్‌, నిఫ్టీలు కొత్త శిఖరాలకు ఎగబాకాయి. వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ)లో వడ్డనలు లేకపోవడం, అమెరికా-చైనాల మధ్య కుదిరిన తొలి దశ వాణిజ్య ఒప్పందం, యూరోపియన్ యూనియన్‌తో బ్రిటన్ ఒప్పందానికి ప్రధాని బోరిస్ జాన్సన్ అంగీకారం తెలపడం వంటి సానుకూల అంశాల నేపథ్యంలో గడిచిన వారంలో సెన్సెక్స్‌ 672 పాయింట్లు, నిఫ్టీ 185 పాయింట్ల మేర పెరిగాయి. శుక్రవారం 12,294 పాయింట్లకు చేరుకుని ఇంట్రాడే గరిష్టస్థాయిని నమోదుచేసిన నిఫ్టీ చివరకు 12,272 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 41,810 పాయింట్లకు చేరుకుని.. చివరకు 41,682 వద్ద నిలిచింది. ఈ స్థాయి రికార్డులతో జోరుమీదున్న మన మార్కెట్‌.. ఈవారంలో ఏ విధంగా ఉండనుందనే అంశానికి, ప్రధానంగా అంతర్జాతీయ అంశాలే కీలకంగా ఉండనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ పండితులు అంచనావేస్తున్నారు. 

కన్సాలిడేషన్‌కు చాన్స్‌..!
వరుసగా రెండు వారాల పాటు ర్యాలీ కొనసాగించిన దేశీ మార్కెట్‌ ఈ వారంలో దిద్దుబాటుకు గురయ్యే అవకాశం ఉందని అంచనా. వాల్యుయేషన్స్‌ ప్రియంగా మారడమే ఇందుకు కారణంగా మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఫండమెంటల్‌గా బలంగా ఉన్న కంపెనీల షేర్లను మాత్రమే ఈ వారంలో కొనుగోలు చేయడం వివేకవంతమైన విధానమని, మార్కెట్‌ బాగా పెరిగినందున కన్సాలిడేషన్‌కు అవకాశం ఉందని రెలిగేర్ బ్రోకింగ్ పరిశోధన విభాగం వీపీ అజిత్ మిశ్రా అన్నారు. బాగా పెరిగిన షేర్ల నుంచి ప్రాఫిట్‌ బుకింగ్‌ జరిగి వ్యాల్యూ పిక్స్‌ వైపునకు పెట్టుబడులు మారే అవకాశం ఉన్నందున తాను కూడా కన్సాలిడేషన్‌ జరగవచ్చని భావిస్తున్నట్లు జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పరిశోధనా విభాగం చీఫ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. ఏడాది చివరి రోజులు కావడంతో స్టాక్‌ స్పెసిఫిక్‌ ర్యాలీకి మాత్రమే అవకాశం ఉందని సామ్కో సెక్యూరిటీస్‌ సీఈఓ జిమీత్‌ మోడీ విశ్లేషిశించారు.

సెన్సెక్స్‌ 30 సూచీ నుంచి యస్‌ బ్యాంక్‌ అవుట్‌
బొంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (బీఎస్‌ఈ) బెంచ్‌మార్క్‌ సూచీ (సెన్సెక్స్‌)లోని 30 షేర్ల జాబితాలో ఈ వారంలోనే భారీ మార్పులు జరగనున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి టాటా మోటార్స్, టాటా మోటార్స్ డీవీఆర్, యస్‌ బ్యాంక్, వేదాంత షేర్లను ఇండెక్స్‌ నుంచి తొలగించి.. వీటి స్థానంలో అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్, నెస్లే ఇండియా షేర్లను బీఎస్‌ఈ చేర్చనుంది. ఇదే విధంగా బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ వంటి పలు సూచీల్లో కూడా మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ మార్పుల కారణంగా ఫండ్‌ మేనేజర్లు వారి పోర్టిఫోలియోలో భారీ మార్పులను చేయనున్నారని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇక డిసెంబర్‌ సిరీస్‌ ఎఫ్‌ అండ్‌ ఓ ముగింపు ఉండడం వల్ల రికార్డుల ర్యాలీ కొనసాగేందుకు అవకాశాలు తక్కువని అంచనావేస్తున్నారు.

ఈ వారంలో ట్రేడింగ్‌ నాలుగు రోజులే...
క్రిస్మస్‌ సందర్భంగా బుధవారం (25న) దేశీ స్టాక్‌ ఎక్ఛేంజీలు సెలవు ప్రకటించాయి. దీంతో ఈ వారంలో ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితమైంది. గురువారం (26న) ఉదయం మార్కెట్‌ యథావిధిగా ప్రారంభమవుతుంది. 



You may be interested

41,850పైన సెన్సెక్స్‌ ర్యాలీ కొనసాగింపు

Monday 23rd December 2019

దేశీయ ఆర్థిక ప్రతికూలాంశాల్ని సైతం లెక్కచేయకుండా... ప్రపంచ సానుకూల పరిణామాల ప్రభావం, విదేశీ నిధుల వెల్లువ కారణంగా స్టాక్‌ సూచీలు కొత్త రికార్డుల్ని నెలకొల్పుతున్నాయి. అయినప్పటికీ, ప్రపంచంలో ఇతర దేశాల మార్కెట్లతో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటివరకూ ఇండియా సూచీలు పెరిగింది తక్కువే. అమెరికా ఎస్‌ అండ్‌ పీ500 సూచి 30 శాతం, 50 దేశాలతో కూడి ఎంఎస్‌సీఐ సూచి 24 శాతం చొప్పున ర్యాలీ సాగించగా, నిఫ్టీ–50 సూచి

ఎఫ్‌ఐఐల వాటాలు పెరిగిన స్టాక్స్‌..?

Monday 23rd December 2019

విదేశీ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) 2019 మొదటి మూడు త్రైమాసికాల్లో భారత ఈక్విటీ మార్కెట్లలో రూ.30,000 కోట్ల పెట్టుబడులు కుమ్మరించి, 141 కంపెనీల్లో వాటాలు పెంచుకున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ 141 స్టాక్స్‌ల్లో కేవలం 18 స్టాక్స్‌ ఈ ఏడాది 50 శాతం వరకు ర్యాలీ చేశాయి. టెలికం, ఫైనాన్స్‌, హెల్త్‌కేర్‌, ఐటీ, ఇన్సూరెన్స్‌, ఎఫ్‌ఎంసీజీ, అగ్రి స్టాక్స్‌లో పెట్టుబడుల అవకాశాలను ముందుగా గుర్తించి వీరు ఇన్వెస్ట్‌ చేయడం

Most from this category