News


అన్ని మంచి శకునాలే..!

Monday 16th December 2019
Markets_main1576465774.png-30233

  • అమెరికా-చైనా వాణిజ్య ఒప్పంద చర్చల్లో పురోగతి
  • బ్రిటన్ ఈయూ నుంచి బయటకు వచ్చేందుకు మార్గం సుగమం 
  • అంతర్జాతీయ అంశాలు మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయంటున్న నిపుణులు
  • 12,200 - 12,250 స్థాయిలో నిఫ్టీకి ప్రధాన నిరోధం: ఎపిక్‌ రీసెర్చ్‌
  • బుధవారం జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం, ఆర్‌బీఐ మినిట్స్‌ వెల్లడి

న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఆందోళనకరంగా మారిన రెండు కీలక అంశాలకు సంబంధించి గతవారంలో ఒకే సారి సానుకూల పరిణామాలు చోటుచేసుకున్నాయి. అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి అంగీకారం కుదరడం, యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ బయటకు వచ్చేందుకు మార్గం సుగమం కావడం వంటి అనుకూల అంశాలతో గత వారాంతాన దేశీ స్టాక్‌ సూచీలు భారీ లాభాలను నమోదుచేశాయి. అమెరికా దిగుమతి చేసుకుంటున్న చైనా ఉత్పత్తుల విషయంలో తొలి దశ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు చైనా శుక్రవారం ప్రకటించింది. వాణిజ్య, ఆర్థిక అంశాల పరంగా మొదటి దశ ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు ప్రకటించింది. ఈ సానుకూల అంశం నేపథ్యంలో దేశీ మార్కెట్‌ మరింత ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా విశ్లేషించారు. ట్రేడ్‌ డీల్‌ ఒక కొలిక్కి రావడం, బ్రిటన్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకువడం వంటి మార్కెట్‌ అంశాలు బుల్స్‌కు అనుకూలంగా ఉన్నాయని ఎపిక్‌ రీసెర్చ్‌ సీఈఓ ముస్తఫా నదీమ్‌ తెలిపారు. నిఫ్టీకి 12,200 - 12,250 స్థాయిలో ప్రధాన నిరోధం ఎదురుకావచ్చని అంచనావేశారు. ఇక తాజా పరిణామాలు మార్కెట్‌కు సానుకూలంగా ఉన్నందున ర్యాలీకి ఆస్కారం ఉందని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అజిత్ మిశ్రా అన్నారు.

జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం ఈవారంలోనే...
పరోక్ష పన్నుల విధానంలో ఆదాయాన్ని పెంచేందుకు ఈవారంలోనే వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) కౌన్సిల్‌ సమావేశం కానుంది. బుధవారం జరిగే 38వ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వాల నష్టపరిహారం అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇదే విధంగా మినహాయింపు అంశాలపై సమీక్ష, రేట్లలో మార్పులు ఉండేందుకు ఆస్కారం ఉందని ప్రభుత్వ ఉన్నత అధికారు ఒకరు మీడియాకు చెప్పారు. వీటికి ప్రభావితం అయ్యే రంగాలపై మార్కెట్‌ వర్గాలు దృష్టిసారించాయి.

ఆర్‌బీఐ మినిట్స్‌ వెల్లడి...
ఈ నెల మొదటి వారంలో జరిగిన ద్రవ్య విధాన కమిటీ సమావేశ మినిట్స్‌ను ఆర్‌బీఐ బుధవారం విడుదలచేయనుంది. ఇక నవంబర్‌ నెల టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం సోమవారం వెల్లడికానుంది. 



You may be interested

సెన్సెక్స్‌ 41,164స్థాయిని అధిగమిస్తే...

Monday 16th December 2019

సెన్సెక్స్‌ 41,164స్థాయిని అధిగమిస్తే... ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, ఫైనాన్షియల్‌ మార్కెట్లను నెలల తరబడి ఆందోళన పరుస్తున్న రెండు అంశాలు ఒక కొలిక్కి వచ్చాయి. అమెరికా–చైనాల మధ్య తొలిదశ వాణిజ్య ఒప్పందం కుదిరిందన్న ప్రకటన వెలువడటం, యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ సజావుగా వైదొలగడానికి (సాఫ్ట్‌ బ్రెగ్జిట్‌) అవసరమైన మెజారిటీని ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ, ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సాధించడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, మార్కెట్లకు పెద్ద ఊరటనిచ్చే అంశాలు. మన దేశ

వచ్చే 3-5వారాల్లో 11శాతం రాబడులిచ్చే షేర్లివే...!

Saturday 14th December 2019

హిందాల్కో, ఎన్‌ఎండీసీ షేర్లు బ్రేక్‌ అవుట్‌కు సిద్ధంగా ఉన్నాయని కోటక్‌ సెక్యూరిటీస్‌ సాంకేతిక నిపుణుడు నాగరాజ్ శెట్టి అభిప్రాయపడ్డారు. ఒక ఆంగ్లఛానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ రాబోయే 3-5వారాల్లో 11శాతం రాబడుల్ని ఇన్వెస్టర్లకు పంచే సత్తా ఈ రెండు షేర్లకు ఉందని తెలిపారు.  షేరు:- ఎన్‌ఎండీసీ రేటింగ్‌:- బై టార్గెట్‌ ధర: రూ.127 స్టాప్‌ లాస్‌: రూ.103 అప్‌సైడ్‌:- 11శాతం  విశ్లేషణ:- గత కొన్నివారాలుగా ఎన్‌ఎండీసీ డైలీ, వీక్లీ టైమ్‌ఫ్రైస్‌ చార్టులు అప్‌ ట్రెండ్‌ను కనబరుస్తున్నాయి. వీక్లీ

Most from this category