News


ఈ వారంలోనూ అస్థిరతలు కొనసాగొచ్చు..

Monday 24th February 2020
Markets_main1582511483.png-32016

  • ఎఫ్‌అండ్‌వో ఎక్స్‌పైరీ
  • ట్రంప్‌ పర్యటనల ప్రభావం
  • ఈ వారం మార్కెట్‌పై అంచనాలు

న్యూఢిల్లీ: డెరివేటివ్స్‌ (ఎఫ్‌అండ్‌వో) ఫిబ్రవరి సిరీస్‌ ఈ వారంలోనే ముగియనుండడంతో మార్కెట్లో అస్థిరతలు ఉంటాయని విశ్లేషకుల అంచనా. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ 24, 25వ తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రక్షణ రంగానికి సంబంధించి ఒప్పందాలకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ సమయంలో కుదిరే డీల్స్‌ కూడా మార్కెట్‌పై ప్రభావం చూపించనున్నాయి. శుక్రవారం విడుదల అయ్యే జీడీపీ అంచనాలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ గణాంకాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించొచ్చు. ‘‘ఎఫ్‌అండ్‌వో గురువారం ముగియనుండడం వల్ల సమీప కాలంలో ఒడిదుడుకులు పెరిగే అవకాశం ఉంటుంది. డోనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటనలో కుదిరే వ్యాపార, వాణిజ్య ఒప్పంద వార్తలు కూడా ప్రభావం చూపిస్తాయి’’ అని బీఎన్‌పీ పారిబాస్‌ క్యాపిటల్‌ మార్కెట్‌ స్ట్రాటజీ హెడ్‌ గౌరవ్‌దువా తెలిపారు. మెటల్స్‌, అంతర్జాతీయంగా కమోడిటీలు పేలవ ప్రదర్శన చూపించొచ్చన్నారు. దేశీయ ఇనిస్టిట్యూషన్ల నుంచి కొనుగోళ్ల మద్దతుతో ప్రధాన సూచీలతో పోలిస్తే మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ మంచి పనితీరు చూపించే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా. చైనాలో పరిస్థితులు తిరిగి క్రమంగా సాధారణ స్థితికి వచ్చేస్తున్నాయని, మరిన్ని ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి ప్రారంభమవుతోందని, దీంతో సరఫరా పరంగా ఇబ్బందులు తగ్గిపోవచ్చని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌నాయర్‌ పేర్కొన్నారు. చైనా ఆర్థిక ఉద్దీపనలు ఈ ఏడాది రెండో త్రైమాసిక కాలంలో (ఏప్రిల్‌-జూన్‌) ఆర్థిక వృద్ధికి తోడ్పడతాయని మార్కెట్లు క్రమంగా అంచనాకు రావచ్చని యస్‌ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ అమర్‌ అంబానీ తెలిపారు. 
ఎఫ్‌పీఐలు బుల్లిష్‌...
భారత మార్కెట్ల పట్ల విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లలో (ఎఫ్‌పీఐలు) బుల్లిష్‌ ధోరణి కొనసాగుతోంది. బడ్జెట్‌ తర్వాత వీరు పెట్టుబడులను కొనసాగిస్తూనే ఉన్నారు. ఫిబ్రవరిలో ఇప్పటి వరకు నికరంగా రూ.23,102 కోట్లను ఇన్వెస్ట్‌ చేశారు. ఇందులో రూ.10,750 కోట్లు ఈక్విటీల్లో, రూ.12,352 కోట్లు డెట్‌ విభాగంలో పెట్టుబడులు పెట్టారు. గతేడాది సెప్టెంబర్‌ నుంచి ఎఫ్‌ఫీఐలు భారత మార్కెట్లో నికర పెట్టుబడిదారులుగానే ఉన్నట్టు డేటా తెలియజేస్తోంది. You may be interested

సెన్సెక్స్‌ కీలక శ్రేణి 41,420-40,610

Monday 24th February 2020

కరోనావైరస్‌ వ్యాప్తి పట్ల మార్కెట్‌ శక్తుల్లో నెలకొన్న అయోమయం కారణంగా ఫైనాన్షియల్‌ మార్కెట్లు గతంలో ఎన్నడూ లేని కొత్త ట్రెండ్‌ను ఆవిష్కరిస్తున్నాయి. ఈక్విటీ మార్కెట్లు, బంగారం, అమెరికా బాండ్లు, డాలరు- ఈ నాలుగూ మూకుమ్మడిగా పెరగడం ఇప్పటివరకూ ఏ సంక్షోభ సమయంలోనూ, మరే సానుకూల ఆర్థిక వాతావరణలోనూ జరగలేదు. మరోవైపు విపత్తుల సందర్భంగా ఇన్వెస్టర్లు సురక్షితంగా భావించే జపాన్‌ కరెన్సీ యెన్‌, ఆ దేశపు బాండ్లు ఈ దఫా క్షీణించడం

ఐపీవోలో షేర్లు అలాట్‌ అవడం లేదా..?

Sunday 23rd February 2020

ఇటీవల వచ్చిన ఐఆర్‌సీటీసీ, ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు, సీఎస్‌బీ బ్యాంకు ఐపీవోలు ఎన్నో రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్‌ అయ్యాయి. ఎస్‌బీఐ ఐపీవో మార్చి 2న ప్రారంభం కానుంది. ఐపీవోలకు దరఖాస్తు చేసుకునే రిటైల్‌ ఇన్వెస్టర్లు సంఖ్య ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. దీంతో రిటైల్‌ ఇన్వెస్టర్ల కోటాకు డిమాండ్‌ పెరిగిపోయింది. ఫలితంగా అందరికీ షేర్లు అలాట్‌ అయ్యే పరిస్థితి ఉండడం లేదు. దీంతో అంతా మోసం అన్న

Most from this category