లాభాల ప్రారంభం
By Sakshi

అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ బుధవారం పాలసీ నిర్ణయాన్ని వెల్లడించనున్న నేపథ్యంలో ఆసియా మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో మంగళవారం భారత్ స్టాక్ సూచీలు పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 49 పాయింంట్ల లాభంతో 37,735 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 25 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 11,215 పాయింట్ల వద్ద ఆరంభమయ్యింది. ఐసీఐసీఐ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఓఎన్జీసీ, ఐఓసీ, టాటా స్టీల్‌లు స్వల్పలాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మరోవైపు క్రితం రోజు భారీ పతనాన్ని చవిచూసిన ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 2.5 శాతం గ్యాప్‌డౌన్‌తో మొదలయ్యింది. గెయిల్, డాక్టర్ రెడ్డీస్‌లాబ్, హీరో మోటోలు స్వల్ప నష్టాలతో ఆరంభమయ్యాయి. ఆసియా ప్రధాన సూచీల్లో తైవాన్ వెయిటెడ్ ఇండెక్స్ మినహా మిగిలివన్నీ 0.2-0.6 శాతం మేర లాభాలతో ట్రేడవుతున్నాయి.
You may be interested
‘కేఫ్ కాఫీ డే’ సిద్ధార్థ మిస్సింగ్
Tuesday 30th July 2019ప్రసిద్ధ కాఫీ పార్లర్ చైన్ కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వి.జి సిద్ధార్థ ఆచూకీ నిన్న రాత్రి నుంచి తెలియడం లేదు. గత రాత్రి మంగళూరు సమీపంలోని నేత్రావతి నది వద్ద ఉన్న వంతెన దగ్గర సిద్ధార్థ దిగాడని కారు డ్రైవర్ వివరించాడు. కారు దిగే సమయంలో సిద్ధార్థ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నడని, కారు దిగిన గంట సేపయినప్పటికి తిరిగి రాకపోయేసరికి కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పి అప్రమత్తం చేశానని
ప్రమోటర్లు ‘చాన్స్’ తీసుకున్నారు...!
Tuesday 30th July 2019స్టాక్ మార్కెట్లో జూన్ త్రైమాసికం ఇన్వెస్టర్ల సంపదకు తూట్లు పొడించిందనే చెప్పుకోవాలి. కానీ, ఇదే కాలంలో బీఎస్ఈ500 కంపెనీల్లో (పీఎస్‌యూ బ్యాంకులు మినహా) 43 కంపెనీల ప్రమోటర్లు మాత్రం అవకాశం తీసుకుని, పడిపోయిన తమ కంపెనీల షేర్లలో వాటాలు కొనుగోలు చేసినట్టు గణాంకాలు పరిశీలిస్తే తెలుస్తోంది. ప్రమోటర్లు వాటా పెంచుకోవడం అన్నది కొంత సౌకర్యవంతమైన విషయమేనని మార్కెట్ పరిశీలకులు భావిస్తుంటారు. అయితే, స్టాక్స్ కొనుగోలు విషయంలో దీన్ని కేవలం ఒక