News


11,300పైన నిఫ్టీ ప్రారంభం...కొద్ది నిముషాల్లో నష్టాల్లోకి

Monday 29th July 2019
Markets_main1564371587.png-27363

-ఐసీఐసీఐ బ్యాంక్‌ 4 శాతం జంప్‌

ఆసియా మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నా, సోమవారం భారత్‌ సూచీలు గ్యాప్‌అప్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 160 పాయింట్ల లాభంతో 38,043 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,300పైన 23 పాయింట్ల లాభంతో 11,307 వద్ద ఆరంభమయ్యింది. అయితే ట్రేడింగ్‌ ప్రారంభమైన కొద్ది నిముషాల్లోనే సూచీలు నష్టాల్లోకి జారిపోయాయి. 9.35 గంటల సమయానికి నిఫ్టీ 40 పాయింట్ల నష్టంతో 11,243 పాయింట్ల స్థాయికి పడిపోగా, సెన్సెక్స్‌ 75 పాయింట్ల నష్టంతో 37,800 పాయింట్ల వద్దకు తగ్గింది.   ఐసీఐసీఐ బ్యాంక్‌ శనివారం వెల్లడించిన క్యూ4 ఫలితాలు..మార్కెట్‌ అంచనాల్ని మించడంతో ఆ షేరు 4 శాతం గ్యాప్‌అప్‌తో రూ. 433 వద్ద మొదలయ్యింది. బజాజ్‌ ఫైనాన్స్‌, టైటాన్‌, టీసీఎస్‌ షేర్లు ట్రేడింగ్‌ ప్రారంభంలో స్వల్పలాభాల్ని ఆర్జించగా, మరోవైపు ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 6 శాతం పతనమయ్యింది. హీరో మోటో, బజాజ్‌ ఆటో, ఐషర్‌ మోటార్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌లు 2-4 శాతం మధ్య నష్టపోయాయి. 

ఆసియా డౌన్‌...

అమెరికా-చైనాల మధ్య వాణిజ్య చర్చలు నేడు ప్రారంభంకానున్నప్పటికీ, ఆసియా సూచీలు ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి. రాజకీయ అనిశ్చితి కారణంగా హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ సూచీ 1.2 శాతం పతనంకాగా, ఉత్తర కొరియా తిరిగి క్షిపణులు ప్రయోగించిన నేపథ్యంలో దక్షిణ కొరియా సూచీ కోస్పి 1.8 శాతం నష్టపోయింది. జపాన్‌, చైనా, సింగపూర్‌, తైవాన్‌ సూచీలు సైతం 0.2-0.5 శాతం మధ్య నష్టాలతో ట్రేడవుతున్నాయి. 



You may be interested

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 29th July 2019

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  టాటాస్టీల్‌ స్పాంజ్‌ ఐరన్‌:- ఇండియ రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థ ‘‘స్థిరత్వం’’ అవుట్‌లుక్‌ రేటింగ్‌ కేటాయించింది.  ఉషా మార్టిన్‌:- బ్యాంకు రుణ సదుపాయ సౌకర్యాలపై  ఇండియ రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ రేటింగ్‌ను బిబి(+)నుంచి బిబిబి(+)కు పెంచింది.  నవనీత్‌ ఎడ్యుకేషన్‌:- క్రిసెల్‌ రేటింగ్‌ సంస్థ రూ.300 కోట్ల కమర్షియల్‌ పేపర్ల ఇష్యూకు ఎ1(+) రేటింగ్‌ను కేటాయించింది.  ఆర్తి డ్రగ్స్‌:- కంపెనీ ధీర్ఘకాలిక రేటింగ్‌ను క్రిసెల్‌ రేటింగ్‌ సంస్థ

ఐసీఐసీఐ క్యూ1 ఫలితాలు అదుర్స్‌!

Saturday 27th July 2019

ఐసీఐసీఐ బ్యాంక్‌ జూన్‌ త్రైమాసికంలో రూ.1,908 కోట్ల నికర లాభాన్ని శనివారం ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 120 కోట్ల నష్టాన్ని నమోదుచేసింది. ఈ బ్యాంక్‌ లాభాలు రూ.1,350 కోట్లు-రూ.2,150 కోట్ల మధ్య ఉంటుందని విశ్లేషకులు అంచనా వేసిన విషయం తెలిసిందే. నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 27 శాతం (ఏడాది నుంచి ఏడాదికి) పెరిగి రూ.7,737 కోట్లుగా నమోదయ్యింది. ఈ ఎన్‌ఐఐలో ఆదాయపు పన్ను వాపసుపై

Most from this category