News


గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌

Thursday 1st August 2019
Markets_main1564631608.png-27457

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పొవెల్‌ చేసిన నిరుత్సాహకర వ్యాఖ్యలతో ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వెలువడటంతో భారత్‌ స్టాక్‌ సూచీలు గురువారం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 150 పాయింట్ల నష్టంతో 37,330 పాయింట్ల సమీపంలోనూ, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 60 పాయింట్ల గ్యాప్‌డౌన్‌తో 11,060 పాయింట్ల సమీపంలోనూ మొదలయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో వేదాంత, జీ టెలిఫిల్మ్‌, యస్‌బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌లు 1-2 శాతం మధ్య నష్టాల్ని చవిచూసాయి. మరోవైపు విప్రో, ఇన్‌ఫ్రాటెల్‌, పవర్‌గ్రిడ్‌, గెయిల్‌ షేర్లు 1-2 శాతం మధ్య లాభాలతో మొదలయ్యాయి. 



You may be interested

గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 1st August 2019

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  పంజాజ్‌ నేషనల్‌ బ్యాంకు:- సవరించిన మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్‌) నేటి(ఆగస్ట్‌ 01) నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ సారి ఎంసీఎల్‌ఆర్‌ రేట్లను 10 బేసిస్‌పాయింట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. సన్‌ ఫార్మా:- జపాన్‌ స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్ట్‌ అయినట్లు తెలిపింది. విప్రో:- షేర్ల బై బ్యాక్‌ను సెబీ ఆమోదం తెలిపింది. బై బ్యాక్‌ ఇష్యూ ఆగస్ట్‌ 14న ప్రారంభమై,

సీసీడీ తాత్కాలిక చైర్మన్‌గా రంగనాథ్‌

Thursday 1st August 2019

తాత్కాలిక సీవోవోగా నితిన్‌ కాఫీ డే ఎ౾ంటర్‌ప్రైజెస్ బోర్డు నిర్ణయాలు న్యూఢిల్లీ: కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ (సీసీడీ) వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ మరణం నేపథ్యంలో తాత్కాలిక చైర్మన్‌గా స్వతంత్ర డైరెక్టర్ ఎస్‌వీ రంగనాథ్‌ నియమితులయ్యారు. నితిన్ బాగ్మానే తాత్కాలిక చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌ (సీవోవో)గా నియమితులయ్యారు. సిద్ధార్థ భార్య మాళవిక హెగ్డే డైరెక్టరుగా ఉన్న సీసీడీ బోర్డు బుధవారం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రంగనాథ్‌, నితిన్ బాగ్మానే, సీఎఫ్‌వో ఆర్‌

Most from this category