News


గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌

Wednesday 31st July 2019
Markets_main1564545114.png-27424

క్రితం రోజు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనై భారీగా క్షీణించిన భారత్‌ స్టాక్‌ సూచీలు బుధవారం సైతం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 139 పాయింట్ల క్షీణతతో 37,259 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 51 పాయింట్ల నష్టంతో 11,034 పాయింట్ల వద్ద ఆరంభమయ్యింది. బడ్జెట్‌లో ప్రతిపాదించిన పన్నులతో కొద్దిరోజుల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల నుంచి అమ్మకాల తాకిడిని చవిచూస్తున్న సూచీలకు తాజాగా అంతరర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు ఎదురవ్వడంతో మరింత నష్టాలతో మార్కెట్‌ మొదలయ్యింది. చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ రెండు దేశాల మధ్య కుదురుతుందని భావిస్తున్న వాణిజ్య ఒప్పందంపై తిరిగి సందేహాలు తెలెత్తడంతో బుధవారం ఉదయం ఆసియా స్టాక్‌సూచీలు పడిపోయాయి. ఆసియా ప్రధాన సూచీలన్నీ 0.5-1 శాతం మధ్య నష్టాలకు లోనయ్యాయి. ఇక మన మార్కెట్లో ట్రేడింగ్‌ ప్రారంభంలో టెక్‌ మహింద్రా, యాక్సిస్‌బ్యాంక్‌, బీపీసీఎల్‌, ఓఎన్‌జీసీలు 2-4 శాతం మధ్య నష్టపోయాయి. హీరో మోటో 2 శాతం లాభపడగా, మారుతి, భారతి ఎయిర్‌టెల్‌, సన్‌ఫార్మాలు స్వల్పంగా పెరిగాయి. 



You may be interested

దేశీ కాఫీ కింగ్‌ సిద్ధార్థ ..

Wednesday 31st July 2019

దాదాపు 140 ఏళ్లుగా కాఫీ వ్యాపారంలో ఉన్న కుటుంబం నుంచి వచ్చిన సిద్ధార్థ జీవితంలో పలు మలుపులు ఉన్నాయి. ఆయన ముందుగా భారతీయ ఆర్మీలో చేరాలనుకున్నారు. కానీ ఎకనమిక్స్‌లో మాస్టర్స్ పట్టా తీసుకున్న తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకరుగా మారారు. 1984లో సొంతంగా శివన్‌ సెక్యూరిటీస్ పేరిట ఇన్వెస్ట్‌మెంట్‌, వెంచర్ క్యాపిటల్ సంస్థను ప్రారంభించారు. దాన్నుంచి వచ్చిన లాభాలతో కర్ణాటకలోని చిక్‌మగళూర్‌ జిల్లాలో కాఫీ తోటలను కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. అదే

మైండ్‌ట్రీ డీల్‌ తర్వాత ఏమైంది..?

Wednesday 31st July 2019

సోమవారం అదృశ్యమైన ప్రముఖ వ్యాపారవేత్త, కేఫ్‌ కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్ధార్థ నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తీవ్ర గాలింపు చర్చల తరువాత ఈరోజు ఉదయం సిద్ధార్థ మృతదేహం నదిలో లభ్యమైంది. ఆయన మృతిపై పలు సందేహాలు తలెత్తుతున్న నేపథ్యంలో సిద్ధార్థ వ్యాపార లావాదేవీల వివరాలు..... కాఫీ దగ్గరే ఆగిపోకుండా సిద్ధార్థ కొంగొత్త వ్యాపారాల్లోకి కూడా అడుగుపెట్టారు. ఇటు ఆర్థిక సేవల నుంచి అటు ఐటీ దాకా వివిధ రంగాల్లో

Most from this category