STOCKS

News


ప్రారంభంలోనే సూచీలు కొత్త రికార్డు

Thursday 16th January 2020
Markets_main1579148141.png-30958

సూచీలు గురువారం ఫ్లాట్‌గా మొదలైనప్పటికీ.., ప్రారంభంలోనే కొత్త రికార్డులను అధిగమించాయి. ప్రపంచమార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న  సూచీలు ఫ్లాట్‌ ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 42 పాయింట్లు లాభంతో  41,924.74 వద్ద నిఫ్టీ 5 పాయింట్లు పెరిగి 12,347 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ ఆరంభంలోనే కొనుగోళ్లు విరివిరిగా జరగడంతో సూచీలు కొంత సేపటికే రికార్డు స్థాయిని అందుకున్నాయి. ఉదయం గం.9:30ని.కు సెన్సెక్స్‌ క్రితం ముగింపు(41,872)తో పోలిస్తే 133 పాయింట్ల లాభంతో 42వేల పైన 42005 వద్ద, నిఫ్టీ మునుపటి ముగింపు(12,343.30)తో పోలిస్తే 21 పాయింట్లు పెరిగి 12,364.30 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. అమెరికా చైనాల మధ్య మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అధికారికంగా సంతకం చేయడంతో ప్రపంచమార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొంది. ఫలితంగా నిన్నరాత్రి అమెరికా మార్కెట్ల లాభంతో ముగియగా, నేడు ఆసియాలోని ప్రధాన మార్కెట్లన్నీ లాభాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలపడటం కూడా సెటిమెంట్‌ను బలపరించింది. ఒక్క మెటల్‌ తప్ప అన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. బ్యాంకింగ్‌ రంగ షేర్ల లాభాల్లో ట్రేడ్‌ అవుతున్న తరుణంలో ఎన్‌ఎస్‌ఈలో మరోకీలమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 100 పాయింట్ల లాభంతో 31,942.80 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

హిందుస్థాన్‌యూనిలివర్‌, కోటక్‌బ్యాంక్‌, నెస్లే ఇండియా, బ్రిటానియా, యస్‌ బ్యాంక్‌ షేర్లు 1.15శాతం నుంచి 2.50శాతం వరకు లాభపడ్డాయి. టాటాస్టీల్‌, ఇండస్‌ ఇండ్‌, హీరోమోటోకార్ప్‌, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, వేదాంత షేర్లు 1శాతం నుంచి 1.50శాతం నష్టపోయాయి. 


 



You may be interested

యూఎస్‌-చైనా ట్రేడ్‌ డీల్‌-ఉపయోగమేంటి?

Thursday 16th January 2020

అమలు కష్టమేనంటున్న నిపుణులు సుమారు ఏడాదిన్నర కాలంగా అమెరికా, చైనా మధ్య కొన’..సాగుతున్న వాణిజ్య వివాదాలకు ఎట్టకేలకు తాత్కాలికంగా చెక్‌ పడింది. బుధవారం రెండు దేశాల మధ్య వాణిజ్య మైత్రికి తెరలేచింది. వెరసి రెండు దేశాలూ తొలి దశ వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీంతో రెండో దశ డీల్‌ను కుదుర్చుకునేందుకు త్వరలోనే చర్చలు ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. కాగా.. ఈ ఒప్పందాలను మరింత విస్తరించుకునే

ట్రేడ్‌ డీల్‌పై అమెరికా-చైనాల సంతకాలు

Thursday 16th January 2020

అమెరికా, చైనా మధ్య తొలి దశ డీల్‌ ఎస్‌అండ్‌పీ, డోజోన్స్‌ సరికొత్త రికార్డ్స్‌ ఎట్టకేలకు అమెరికా, చైనా మధ్య వాణిజ్య మైత్రి కుదిరింది.​ ఏడాదిన్నర కాలంగా నలుగుతున్న వాణిజ్య వివాద పరిష్కారంలో భాగంగా బుధవారం రెండు దేశాలూ తొలి దశ డీల్‌పై సంతకాలు చేశాయి. దీంతో బుధవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు తొలుత రివ్వుమన్నాయి. మార్కెట్ల చరిత్రలో తొలిసారి డోజోన్స్‌ 29,000 పాయింట్లను తాకగా.. ఎస్‌అండ్‌పీ సైతం రికార్డ్‌ సృష్టించింది. డోజోన్స్‌ 0.3

Most from this category