News


నష్టాల ప్రారంభం...వెనువెంటనే లాభాల్లోకి

Monday 27th May 2019
Markets_main1558928648.png-25937

లోక్‌సభ ఎన్నికల్లో మార్కెట్‌ అంచనాల్ని మించి బీజేపీ విజయం సాధించడంతో గతవారం భారీ లాభాల్ని ఆర్జించిన స్టాక్‌ సూచీలు ఈ సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. తొలుత 100 పాయింట్లకుపైగా నష్టపోయి 39,323 పాయింట్ల వద్ద ప్రారంభమైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌..వెనువెంటనే 90 పాయింట్లు జంప్‌చేసి 39,525 పాయింట్ల వద్దకు చేరింది. అలాగే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ట్రేడింగ్‌ ప్రారంభంలో 23 పాయింట్లు నష్టపోయి 11,812 పాయింట్ల వద్దకు క్షీణించిన అనంతరం వేగంగా 20 పాయింట్ల లాభాల్లోకి మళ్లి 11,865 పాయింట్ల స్థాయిని అందుకుంది. ఎన్‌టీపీసీ 3 శాతంపైగా జంప్‌చేసి రూ. 134 వద్ద ప్రారంభంకాగా, యస్‌ బ్యాంక్‌ 2 శాతంపైగా లాభపడింది. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, గ్రాసిమ్‌, టాటా స్టీల్‌, ఎస్‌బీఐలు 1-2 శాతం మధ్య పెరిగాయి. మరోవైపు టెక్‌ మహింద్రా, జీ టెలి, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లుల 2 శాతం నష్టాలతో ప్రారంభంకాగా, భారతి ఎయిర్‌టెల్‌ 1 శాతంపైగా క్షీణించింది. 



You may be interested

11600 పాయింట్ల పైన ఉన్నంత వరకు ఫర్వాలేదు!

Monday 27th May 2019

నిఫ్టీపై నిపుణుల అంచనా ఎన్నికల్లో ఎన్‌డీఏ భారీ విజయం సాధించడం సూచీల్లో కొనుగోళ్లకు కారణమైంది. నిఫ్టీ దీర్ఘకాలిక నిరోధ వాలు రేఖ(11700 పాయింట్ల వద్ద) పైవైపుగా ఛేదించింది. అనంతరం ఆల్‌టైమ్‌ హై 12041 పాయింట్ల వరకు పరుగు తీసింది. ఈ క్రమంలో 11657- 11712 పాయింట్ల మధ్య ఉన్న బేరిష్‌ గ్యాప్‌ను కవర్‌ చేసింది. ఈ క్రమంలో బలమైన కొనుగోళ్లు వచ్చాయి. ఫలితాల రోజు ఆల్‌టైమ్‌ హై నించి కిందకు వచ్చినా

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 32  పాయింట్లు డౌన్‌

Monday 27th May 2019

ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాల కారణంగా భారత్‌ మార్కెట్‌ బుధవారం నెగిటివ్‌గా ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఈ ఉదయం 8.50 గంటలకు 32  పాయింట్ల నష్టంతో 11,837 పాయింట్ల వద్ద కదులుతోంది. శుక్రవారం ఇక్కడ నిఫ్టీ మే ఫ్యూచర్‌ 11,869  పాయింట్ల వద్ద ముగిసింది.  తాజాగా ఆసియా మార్కెట్లలో  జపాన్‌ నికాయ్‌ మినహా సింగపూర్‌ స్ర్టయిట్‌ టైమ్స్‌, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌, తైవాన్‌ వెయిటెడ్‌  చైనా షాంఘై, కొరియా కోస్పి

Most from this category