News


లాభాలతో షురూ- 9,100ను దాటిన నిఫ్టీ

Wednesday 18th March 2020
Markets_main1584506817.png-32553

31,000 పాయింట్లను అధిగమించిన సెన్సెక్స్‌
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభాల్లోనే

ఎట్టకేలకు దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో వెనువెంటనే జోరందుకున్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే నిఫ్టీ 130 పాయింట్లు, సెన్సెక్స్‌ 425 పాయింట్లు చొప్పున ఎగశాయి. 9.20కల్లా సెన్సెక్స్‌ 436 పాయింట్లు పురోగమించి 31,015ను తాకింది. ఈ బాటలో నిఫ్టీ 136 పాయింట్లు జంప్‌చేసి 9,103కు చేరింది. వెరసి సెన్సెక్స్‌ 31,000 పాయింట్ల మైలురాయిని అధిగమించగా.. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 9,000 స్థాయిని సులభంగా దాటేసింది. మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు 6 శాతం స్థాయిలో జంప్‌చేయడంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌ను చేపట్టడం మార్కెట్లకు జోష్‌నిస్తున్నట్లు తెలియజేశారు.

యస్‌ బ్యాంక్‌ జోరు
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడగా.. మెటల్‌, ఫార్మా, ఐటీ, మీడియా 2 శాతం చొప్పున పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో యస్‌ బ్యాంక్‌ 20 శాతం దూసుకెళ్లగా.. జీ, సన్‌ ఫార్మా, వేదాంతా, ఇన్ఫోసిస్‌, యూపీఎల్‌, విప్రో, కోల్‌ ఇండియా, హెచ్‌సీఎల్‌ టెక్‌, టాటా మోటార్స్‌ 7-1.5 శాతం మధ్య ఎగశాయి. అయితే ఐసీఐసీఐ, యాక్సిస్‌, కొటక్‌, గ్రాసిమ్‌, నెస్లే, డాక్టర్‌ రెడ్డీస్‌, పవర్‌గ్రిడ్‌, గెయిల్‌, ఇండస్‌ఇండ్‌, బజాజ్‌ ఫిన్‌ 2.5-0.8 శాతం మధ్య డీలాపడ్డాయి.

గ్లెన్‌మార్క్‌ అప్‌
డెరివేటివ్స్‌లో ఐడియా, గ్లెన్‌మార్క్‌, జస్ట్‌ డయల్‌, అరబిందో, పిరమల్‌ 6-3.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క ఈక్విటాస్‌, కంకర్‌, జూబిలెంట్‌ ఫుడ్‌, పీవీఆర్‌, మ్యాక్స్‌ ఫైనాన్స్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, అపోలో హాస్పిటల్స్‌, ఇండిగో, శ్రీరామ్‌ ట్రాన్స్‌ 12-3 శాతం మధ్య పతనమయ్యాయి.You may be interested

రూ.40,000పైకి బంగారం

Wednesday 18th March 2020

గత కొన్నిరోజులుగా భారీగా రూ.5000 వరకు పెరిగిన బంగారం గతవారం అమాంతం తగ్గి రూ.40,000 దిగువకు చేరినప్పటికీ.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడంతో ఇన్వెస్టర్లు రక్షణాత్మక పెట్టుబడులపై దృష్టిపెట్టడంతో బుధవారం బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే రూ.1470 పెరిగి 10 గ్రాముల పసిడి రూ.40,260.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో భారీగా తగ్గినప్పటికి  నిన్నటితో పోలిస్తే  4డాలర్లు

1484 శాతం ఎగసిన యస్‌ బ్యాంక్‌

Wednesday 18th March 2020

తాజాగా 23 శాతం హైజంప్‌ రూ. 72ను అధిగమించిన షేరు ఇంట్రాడేలో రూ. 87ను దాటేసింది నేటి సాయంత్రం నుంచి పూర్తి కార్యకలాపాలు ఖాతాదారులు మొత్తం రూ. 50,000కు మించి ఉపసంహరించుకునే వీలులేకుండా యస్‌ బ్యాంకుపై రిజర్వ్‌ బ్యాంక్‌ విధించిన నిషేధం నేటి(బుధవారం) సాయంత్రం 6 తదుపరి తొలగిపోనుంది. దీంతో ఖాతాదారులకు యస్‌ బ్యాంక్‌ పూర్తిస్థాయి కార్యకలాపాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ అంశంపై యస్‌ బ్యాంక్‌ సీఈవో, ఎండీగా బాధ్యతలు చేపట్టనున్న ఎస్‌బీఐ మాజీ అధికారి

Most from this category