STOCKS

News


సెన్సెక్స్‌.. సెంచరీతో షురూ

Thursday 6th February 2020
Markets_main1580961621.png-31544

సెన్సెక్స్‌ 132 పాయింట్లు ప్లస్‌
42 పాయింట్లు ఎగసిన నిఫ్టీ
మెటల్‌, ఫార్మా, ఐటీ ప్లస్‌లో

ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన ప్రోత్సాహంతో వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ లాభాల సెంచరీ చేసింది. 132 పాయింట్లు బలపడి 41,275కు చేరింది. నిఫ్టీ సైతం 42 పాయింట్లు పుంజుకుని 12,131 వద్ద ట్రేడవుతోంది. బుధవారం అమెరికా ఇండెక్సులు వరుసగా రెండో రోజు సరికొత్త గరిష్ట రికార్డులను సాధించగా.. దేశీయంగానూ మార్కెట్లు లాభపడ్డ సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆసియాలోనూ జపాన్‌, చైనా తదితర మార్కెట్లు 2-1 శాతం మధ్య పెరిగి ట్రేడవుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే మిడ్‌సెషన్‌కల్లా ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగే వీలున్నట్లు అంచనా వేశారు. దీంతో మార్కెట్లు కొంతమేర ఒడిదొడుకులను ఎదుర్కొనే అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డారు.

రియల్టీ వెనకడుగు
ఎన్‌ఎస్‌ఈలో దాదాపు అన్ని రంగాలూ బలపడగా.. రియల్టీ 0.6 శాతం నీరసించింది. మెటల్‌, ఫార్మా, మీడియా, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్స్‌ 1-0.5 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో జీ, యస్‌ బ్యాంక్‌, ఐవోసీ, వేదాంతా, సిప్లా, హెచ్‌సీఎల్‌ టెక్‌, హీరో మోటో, విప్రో, టెక్‌ మహీంద్రా, అదానీ పోర్ట్స్‌ 3-1 శాతం మధ్య ఎగశాయి. అయితే టాటా మోటార్స్‌, ఇన్‌ఫ్రాటెల్‌, యూపీఎల్‌, హిందాల్కో, 1.4-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి.

కేడిలా జోరు
డెరివేటివ్స్‌లో కేడిలా హెల్త్‌, ఐబీ హౌసింగ్‌, నాల్కో, శ్రీరామ్‌ ట్రాన్స్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, మైండ్‌ట్రీ, భారత్‌ ఫోర్జ్‌ 4-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క చోళమండలం, బెర్జర్‌ పెయింట్స్‌, డీఎల్‌ఎఫ్‌, పిడిలైట్‌, వోల్టాస్‌, ఎన్‌ఎండీసీ, అదానీ పవర్‌, ఈక్విటాస్‌ 1.7-0.6 శాతం మధ్య బలహీనపడ్డాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.5 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 797 షేర్లు లాభపడగా.. 341 నష్టాలతో కదులుతున్నాయి.You may be interested

హావెల్స్‌ నూతన శ్రేణి వాటర్‌ ప్యూరిఫయర్లు

Thursday 6th February 2020

హైదరాబాద్‌: ఫాస్ట్‌ మూవింగ్‌ ఎలక్ట్రికల్‌ గూడ్స్‌ కంపెనీ హావెల్స్‌ ఇండియా నూతన శ్రేణి ఆల్కలైన్‌ వాటర్‌ ప్యూరిఫయర్లను విడుదల చేసింది. మార్కెట్లో చాలా ఆర్‌వో ప్యూరిఫయర్లు 70 శాతం నీటిని వృధా చేస్తాయని, రికవరీ 30 శాతమే ఉంటుందని కంపెనీ సీరియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సురేష్‌ సిసోడియా తెలిపారు. వైస్‌ ప్రెసిడెంట్లు శశాంక్‌ శ్రీవాస్తవ్‌, అనిల్‌ శర్మ, బిజినెస్‌ హెడ్‌ వి.మహేందర్‌తో కలిసి బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. హావెల్స్‌ రూపొందించిన డిలైట్‌

బీపీసీఎల్‌పై రష్యా రాస్‌నెఫ్ట్ ఆసక్తి

Thursday 6th February 2020

కేంద్ర చమురు శాఖ మంత్రితో కంపెనీ సీఈవో భేటీ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్‌) కొనుగోలుపై రష్యాకు చెందిన చమురు దిగ్గజం రాస్‌నెఫ్ట్ కూడా ఆసక్తిగా ఉంది. బుధవారం కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేం‍ద్ర ప్రధాన్‌తో సమావేశంలోనూ, ఆ తర్వాత ఇతర ఉన్నతాధికారులతో భేటీలోను రాస్‌నెఫ్ట్ సీఈవో ఇగోర్‌ సెషిన్‌ ఈ డీల్‌పై ఆసక్తి వ్యక్తం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీర్ఘకాలిక ప్రాతిపదికన ముడిచమురు

Most from this category