News


లాభాల బాటలో మార్కెట్లు

Friday 10th January 2020
Markets_main1578629266.png-30821

సెన్సెక్స్‌ లాభాల సెంచరీ
నిఫ్టీ 37 పాయింట్లు ప్లస్‌

స్వల్ప ఊగిసలాట మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి జోరందుకున్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభమైన వెంటనే ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగడంతో వరుసగా మూడో రోజు మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ఉదయం 9.20 ప్రాంతంలో సెన్సెక్స్‌ 131 పాయింట్లు పెరిగి 41,553కు చేరగా.. నిఫ్టీ 37 పాయింట్లు పుంజుకుని 12,253 వద్ద ట్రేడవుతోంది. ఇరాన్‌, అమెరికా మధ్య గత వారం నెలకొన్న ఉద్రిక్త వాతావరణం చల్లబడటంతో గురువారం అమెరికా మార్కెట్లు రికార్డ్‌ గరిష్టాలను అందుకున్నాయి. ఫలితంగా చమురు, బంగారం ధరలు దిగిరాగా.. రూపాయి బలపడింది. దీంతో దేశీయంగానూ ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. సెన్సెక్స్‌ 41,648 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకగా.. నిఫ్టీ 12,272ను అధిగమించింది. కాగా.. నేడు స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య మార్కెట్లు కన్సాలిడేట్‌ కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఫార్మా జోరు
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఫార్మా రంగం 1.5 శాతం పుంజుకోగా.. ఐటీ, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ 0.6 శాతం చొప్పున బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో డాక్టర్‌ రెడ్డీస్‌, ఇన్ఫ్రాటెల్‌, సన్‌ ఫార్మా, కొటక్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, కోల్‌ ఇండియా, ఇన్ఫోసిస్‌, హీరో మోటో, టెక్‌ మహీం‍ద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2.7-0.7 శాతం మధ్య ఎగశాయి. అయితే జీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఐసీఐసీఐ, పవర్‌గ్రిడ్‌, యూపీఎల్‌, గ్రాసిమ్‌, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌, బజాజ్‌ ఫిన్‌ 1.4-0.4 శాతం మధ్య నీరసించాయి. 

ఎఫ్‌అండ్‌వో ఇలా
డెరివేటివ్‌ కౌంటర్లలో టాటా గ్లోబల్‌, సన్‌ టీవీ, లుపిన్‌, టాటా కెమ్‌, ఇండిగో, టొరంట్‌ ఫార్మా, దివీస్‌ 2.6-1.4 శాతం మధ్య లాభపడ్డాయి. కాగా.. మరోపక్క మహానగర్‌ గ్యాస్‌, మదర్‌సన్‌, జస్ట్‌ డయల్‌, ఐడియా, శ్రీరామ్‌ ట్రాన్స్‌, డిష్‌ టీవీ, డీఎల్‌ఎఫ్‌ 2.2-0.7 శాతం మధ్య నష్టపోయాయి. You may be interested

తగ్గనున్న ఈ-వెరిటో ధర..!

Friday 10th January 2020

రూ. లక్ష వరకు తగ్గే అవకాశం వచ్చే ఏడాదిలో ఎలక్ట్రిక్‌ ఎక్స్‌యూవీ 300 మహీంద్ర ఎండీ పవన్‌ గోయెంకా వ్యాఖ్య న్యూఢిల్లీ: భారత ఎలక్ట్రిక్‌ వాహనాల డిమాండ్‌కు తగిన సప్లైని చేరుకోవడానికి మరెంతో సమయం పట్టదని మహీంద్రా అండ్‌ మహీంద్ర (ఎం అండ్‌ ఎం) మేనేజింగ్‌ డైరెక్టర్‌ పవన్‌ గోయెంకా అన్నారు. ఈ పరిశ్రమను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంత వరకు చేయగలదో అంతా చేసిందని, వీటితో పాటు మరిన్ని ప్రయోజనాలు

భారత్‌ బ్యాంకింగ్‌ రుణ వృద్ధి అంతంతే!

Friday 10th January 2020

2019-2020లో వృద్ధిరేటు కేవలం 5 శాతం ప్రపంచబ్యాంక్‌ అంచనా 2020-21లో 5.8 శాతానికి పెరిగే అవకాశం 2020లో ప్రపంచ ఆర్థికవృద్ధి 2.5 శాతమే! వాషింగ్టన్‌: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019 ఏప్రిల్‌-2020 మార్చి) 5 శాతానికి పడిపోయే అవకాశం ఉందని ప్రపంచబ్యాంక్‌ అంచనావేసింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-2021)లో వృద్ధిరేటు 5.8 శాతానికి రికవరీ అయ్యే అవకాశం ఉందని కూడా విశ్లేషించింది. ‘‘బ్యాంకింగ్‌, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌

Most from this category