News


సానుకూల ఓపెనింగ్‌ చాన్స్‌!

Friday 20th March 2020
Markets_main1584673730.png-32583

కోలుకున్న ప్రపంచ మార్కెట్లు
అమెరికా, యూరప్‌ ఇండెక్సులు 1-2% అప్‌
ఆసియా మార్కెట్లు 1-3 శాతం లాభాల్లో
నామమాత్ర నష్టంతో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 

నేడు(శుక్రవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు కొంతమేర సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో నామమాత్ర నష్టంతో 8,207 వద్ద ట్రేడవుతోంది. గురువారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 8,211 పాయింట్ల వద్ద  ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. మూడు వారాలుగా కరోనా ప్రభావంతో కుప్పకూలుతున్న ప్రపంచ స్టాక్‌ మార్కెట్లలో గురువారం కొంతమేర రికవరీ వచ్చింది. అమెరికా, యూరోపియన్‌ మార్కెట్లు 1-2 శాతం మధ్య పుంజుకోగా.. ఆసియాలోనూ ప్రస్తుతం కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. పలు మార్కెట్లు 1-3 శాతం మధ్య లాభాలతో కదులుతున్నాయి. దీంతో నేడు దేశీయంగానూ అమ్మకాలకు చెక్‌ పడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలపడటంతో ఇన్వెస్టర్లు ఎంపిక చేసిన కౌంటర్లలో కొనుగోళ్లకు దిగవచ్చని తెలియజేశారు. ట్రేడర్లు సైతం షార్ట్‌ కవరింగ్‌ చేపడితే మార్కెట్లు లాభపడే వీలున్నట్లు అంచనా వేస్తున్నారు. కాగా.. పట్టు వీడకుండా ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా వైరస్‌ షాక్‌కు గురువారం మరోసారి దేశీ స్టాక్‌ మార్కెట్లు దెబ్బతిన్నాయి. సెన్సెక్స్‌ 581 పాయింట్లు పతనమై 28,288 వద్ద నిలవగా.. నిఫ్టీ 205 పాయింట్లు కోల్పోయి 8,263 వద్ద ముగిసింది. 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 7,872 పాయింట్ల వద్ద, తదుపరి 7,481 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు   భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 8,615 పాయింట్ల వద్ద, ఆపై 8,967 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు.  ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 18,828 పాయింట్ల వద్ద, తదుపరి 17,572 వద్దపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత  21,187 పాయింట్ల వద్ద, తదుపరి 22,291 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు. 

విక్రయాల బాటలోనే
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 4623 కోట్ల అమ్మకాలు చేపట్టగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 4367 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేశాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 5085 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌ రూ. 3636 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. ఇక మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 4045 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టగా.. డీఐఐలు రూ. 3422 కోట్లను ఇన్వెస్ట్‌  చేశాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 3810 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 2615  కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.   



You may be interested

యస్ బ్యాంక్‌కు ఆర్‌బీఐ రుణ సదుపాయం

Friday 20th March 2020

-అత్యవసరాల కోసం అందుబాటులో రూ. 60వేల కోట్లు - డిపాజిట్లపై ఖాతాదారులకు అడ్మినిస్ట్రేటర్ భరోసా  - చెల్లింపులకు తగినన్ని నిధులు ఉన్నాయని వెల్లడి మారటోరియంపరమైన ఆంక్షలు తొలగి, పూర్తి స్థాయి సర్వీసులు ప్రారంభించిన యస్ బ్యాంక్‌కు అత్యవసరంగా నిధులు అవసరమైన పక్షంలో తోడ్పాటునిచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ చర్యలు తీసుకుంది. సుమారు రూ. 59,000 కోట్ల మేర రుణ సదుపాయం అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. డిపాజిట్‌దారులకు చెల్లింపులు జరపడంలో సమస్యలు తలెత్తకుండా యస్‌ బ్యాంక్‌కు ఇది

ట్రేడింగ్‌ అకౌంట్‌ తెరిచేందుకు పెరిగిన ఆసక్తి

Friday 20th March 2020

మార్కెట్‌ పతనం కోసం ఎదురు చూస్తున్న వారు.. ఆ అవకాశం రావడంతో ట్రేడింగ్‌ ఖాతాలు తెరిచేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలు నెల రోజుల్లోనే 33 శాతం వరకు పతనం అయ్యాయి. కానీ, విడిగా స్టాక్స్‌ను చూస్తే వాటి ధరలు ఇంతకంటే ఎక్కువే క్షీణించాయి. కోవిడ్‌ పరిణామంతో మార్కెట్లు రోజురోజుకీ నూతన కనిష్టాలకు పడిపోతున్నాయి. ఇన్వెస్ట్‌మెంట్‌కు ఇది మంచి అనుకూల సమయమని, కాకపోతే ఒకేసారి ఏకమొత్తంలో కాకుండా విడతల

Most from this category