News


లాభాల ఓపెనింగ్‌ నేడు?!

Wednesday 29th January 2020
Markets_main1580268411.png-31279

రెండు రోజుల వరుస నష్టాలకు చెక్‌?
ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 34 పాయింట్లు ప్లస్‌
లాభాల్లో అమెరికా, ఆసియా మార్కెట్లు
కరోనా భయాల నుంచి బయటపడ్డ ఇన్వెస్టర్లు 

నేడు(బుధవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 34 పాయింట్లు పుంజుకుని 12,109  వద్ద ట్రేడవుతోంది. సోమవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,075 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి  తెలిసిందే. కొద్ది రోజులుగా ప్రపంచ మార్కెట్లను వణికిస్తున్న కరోనా వైరస్‌ భయాల నుంచి బయటపడిన ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు లాభపడ్డాయి. ఈ బాటలో ప్రస్తుతం ఆసియాలోనూ సానుకూల వాతావరణం నెలకొంది. దీంతో దేశీయంగానూ మార్కెట్లు లాభాలతో ప్రారంభంకావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ట్రేడర్లు షార్ట్‌కవరింగ్‌ చేపట్టవచ్చని, తద్వారా రెండు రోజుల వరుస నష్టాలకు చెక్‌ పడేవీలున్నదని భావిస్తున్నారు. కాగా.. మంగళవారం చివరి రెండు గంటల్లో పెరిగిన అమ్మకాలు దేశీ మార్కెట్లకు షాకిచ్చాయి. వెరసి సెన్సెక్స్‌ 41,000 పాయింట్ల మార్క్‌ దిగువకు చేరింది. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 188 పాయింట్లు క్షీణించి 40,967 వద్ద నిలిచింది. ఇక నిఫ్టీ 63 పాయింట్ల వెనకడుగుతో 12,056 వద్ద స్థిరపడింది. 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,999 పాయింట్ల వద్ద, తదుపరి 11,942 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు  పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 12,138 వద్ద, ఆపై 12,220 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 30,596 పాయింట్ల వద్ద, తదుపరి 30,430 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 30,988 పాయింట్ల వద్ద, తదుపరి 31,214 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు)  దాదాపు రూ. 1358 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 712 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. కాగా.. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 439 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు నామమాత్రంగా రూ. 10.5 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన విషయం విదితమే.  



You may be interested

నేడు క్యూ3 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు

Wednesday 29th January 2020

బజాజ్‌ ఫిన్‌సర్వీసెన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ణ, భారత్‌ గేర్స్‌, బిర్లా కార్పోరేషన్‌, చోళమండలం ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌, క్రాం‍ప్టన్‌ గ్రావీస్‌ కన్జూ‍్యమర్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎస్కార్ట్స్‌, గేర్‌వేర్‌ పాలీస్టర్‌, గోద్రేజ్‌ కన్జూ‍్యమర్‌ ప్రోడెక్ట్స్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బాయంక్‌, జుబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్‌, టాటా పవర్‌, ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌, కేపీఐటీ టెక్నాలజీస్‌ కంపెనీలతో పాటు సుమారు 68 కంపెనీలు తమ మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. 

ఎనానమీపై ‘కరోనా’ ఎటాక్‌!

Wednesday 29th January 2020

ప్రపంచాన్ని వణికిస్తున్న చైనా వైరస్‌ ఆర్థిక వ్యవస్థలకు మరింత ముప్పు వృద్ధి భయాలతో కుప్పకూలుతున్న స్టాక్‌ మార్కెట్లు సురక్షిత పెట్టుబడి సాధనాలవైపు ఇన్వెస్టర్ల చూపు ఎగబాకుతున్న పుత్తడి... చల్లారుతున్న చమురు తక్షణం వ్యాక్సిన్‌ కనుగొనకపోతే తంటాలేనంటున్న ఆర్థికవేత్తలు మన ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం చూపే అవకాశం (సాక్షి, బిజినెస్‌ విభాగం): అమెరికాకు జలుబు చేస్తే ప్రపంచమంతటికీ తుమ్ములొస్తాయన్నది నానుడి!! అయితే, ఇప్పుడు చైనాకు వచ్చిన ‘కరోనా’ జలుబుకు ప్రపంచదేశాలన్నీ గజగజ వణుకుతున్నాయి. చైనా ‘వూహాన్‌’ నగరంలో మొదలైన కరోనా వైరస్‌ ముసలం..

Most from this category