News


నేడు లాభాల ఓపెనింగ్‌ చాన్స్‌!

Wednesday 18th March 2020
Markets_main1584501881.png-32544

5 శాతం జంప్‌చేసిన యూఎస్‌ మార్కెట్లు
54 పాయింట్లు బలపడిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 
అమెరికా మార్కెట్లకు ట్రంప్‌, ఫెడ్‌ బూస్ట్‌
అటూఇటుగా ఆసియా స్టాక్‌ మార్కెట్లు

దేశీ స్టాక్‌ మార్కెట్ల పతనాలకు నేడు(బుధవారం) ఇన్వెస్టర్లు చెక్‌ పెట్టే అవకాశముంది. మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యే చాన్స్‌​కనిపిస్తోంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ  ఉదయం 8.30 ప్రాంతం‍లో 54 పాయింట్లు పుంజుకుని 9,044 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 8,900 పాయింట్ల వద్ద  ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనాను అడ్డుకునేందుకు అటు కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌, ఇటు ప్రెసిడెంట్‌ ట్రంప్‌ పలు చర్యలు ప్రకటించడంతో మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు లాభాల యూటర్న్‌ తీసుకున్నాయి. ఏకంగా 5 శాతం జంప్‌చేశాయి. దీంతో నేడు దేశీయంగానూ సెంటిమెంటు బలపడి మార్కెట్లు పుంజుకునే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. దీనికితోడు ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌ చేపట్టే వీలున్నదని, దీంతో మార్కెట్లు లాభాలతో జంప్‌చేయవచ్చని పేర్కొంటున్నారు.   

మంగళవారం బోర్లా
ప్రపంచ మహమ్మారిగా అవతారమెత్తిన కోవిడ్‌-19 ధాటికి మరోసారి దేశీ స్టాక్‌ మార్కెట్లు కుదేలయ్యాయి. మంగళవారం సెన్సెక్స్‌ 811 పాయింట్లు పతనమై 30,579 వద్ద నిలవగా.. నిఫ్టీ 230 పాయింట్లు కోల్పోయి 8.967 వద్ద ముగిసింది. వెరసి మూడేళ్ల తదుపరి నిఫ్టీ 9,000 పాయింట్ల మైలురాయి దిగువన ముగిసింది. 
 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 8,787 పాయింట్ల వద్ద, తదుపరి 8,607 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు  భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 9,275 పాయింట్ల వద్ద, ఆపై 9,584 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 21,621 పాయింట్ల వద్ద, తదుపరి 21,088 వద్దపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 23,069 పాయింట్ల వద్ద, తదుపరి 23,983 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు. 

విక్రయాల బాటలోనే..
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 4045 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టగా.. దేశీ ఫండ్స్‌ (డీఐఐలు) రూ. 3422 కోట్లను ఇన్వెస్ట్‌  చేశాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 3810 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 2615 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.   You may be interested

హీరో ఎలక్ట్రానిక్స్‌​ చేతికి టీ అండ్‌ వీఎస్‌ కంపెనీ

Wednesday 18th March 2020

న్యూఢిల్లీ: ఇంగ్లాండ్‌కు చెందిన చిప్‌ డిజైన్‌ సర్వీసెస్‌ సంస్థ టెస్ట్‌ అండ్‌ వెరిఫికేషన్‌ సొల్యూషన్స్‌(టీ అండ్‌ వీఎస్‌)ను హీరో ఎలక్ట్రానిక్స్‌ కొనుగోలు చేసింది. టీ అండ్‌ వీఎస్‌ను తమ గ్రూప్‌ కంపెనీ టెస్సాల్వ్‌ కొనుగోలు చేసిందని హీరో ఎలక్ట్రానిక్స్‌ సీఈఓ నిఖిల్‌ రాజ్‌పాల్‌ పేర్కొన్నారు. కొనుగోలు వివరాలను ఆయన వెల్లడించలేదు. టీ అండ్‌ వీఎస్‌ కొనుగోలుతో టెస్సాల్వ్‌ చిప్‌ డిజైన్‌ సామర్థ్యాలు మరింతగా మెరుగుపడుతాయని వివరించారు. టెస్వాల్వ్‌లో పనిచేసే ఇంజినీర్ల

మార్కెట్లోకి ‘ఇన్నోవా క్రిస్టా’ లిమిటెడ్‌ ఎడిషన్‌

Wednesday 18th March 2020

- ధర రూ. 21.21 లక్షలు  న్యూఢిల్లీ: వాహన తయారీ కంపెనీ టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (టీకేఎం) తన పాపులర్‌ మల్టీ-పర్పస్ వెహికల్ (ఎంపీవీ) ‘ఇన్నోవా క్రిస్టా’లో లిమిటెడ్‌ ఎడిషన్‌ను మంగళవారం మార్కెట్లోకి విడుదలచేసింది. భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌)-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఈ వాహనం ధర రూ. 21.21 లక్షలుగా ప్రకటించింది. 2.4 లీటర్ల డీజిల్‌, 5 స్పీడ్‌ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వంటి ఫీచర్లతో లీడర్‌షిప్‌ ఎడిషన్‌ పేరిట

Most from this category