News


రెండో రోజూ లాభాల ఓపెనింగ్‌?!

Wednesday 12th February 2020
Markets_main1581478064.png-31711

గ్యాపప్‌ ఓపెనింగ్‌ చాన్స్‌ నేడు?!
ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 35 పాయింట్లు ప్లస్‌
మంగళవారం యూఎస్‌ మార్కెట్ల రికార్డ్స్‌

నేడు(బుధవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాల(గ్యాపప్‌)తో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 35 పాయింట్లు ఎగసి 12,163 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫిబ్రవరి ఫ్యూచర్‌ 12,128 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. వరుసగా రెండో రోజు మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు సరికొత్త రికార్డుల వద్ద ముగిశాయి. డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ స్వల్పంగా బలపడ్డాయి. ఆసియాలో ప్రస్తుతం చైనా మినహా మిగిలిన మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. కాగా.. విదేశీ సానుకూల సంకేతాలతో మంగళవారం హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 237 పాయింట్లు ఎగసి 41,216 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 76 పాయింట్లు పుంజుకుని 12,108 వద్ద స్థిరపడింది. ప్రపంచ మార్కెట్లు పుంజుకోవడంతో నేడు దేశీ స్టాక్‌ మార్కెట్లలోనూ సానుకూల ట్రెండ్‌ కనిపించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో నేడు మార్కెట్లు మరోసారి హుషారుగా కదిలే వీలున్నట్లు భావిస్తున్నారు.

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 12,080 పాయింట్ల వద్ద, తదుపరి 12,053 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు  పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 12,154 వద్ద, ఆపై 12,200 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 31,182 పాయింట్ల వద్ద, తదుపరి 31,064 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 31,462 పాయింట్ల వద్ద, తదుపరి 31,624 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

అమ్మకాలవైపు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 209 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 345 కోట్లవరకూ ఇన్వెస్ట్‌ చేశాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 184 కోట్లు, దేశీ ఫండ్స్‌ దాదాపు రూ. 736 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.



You may be interested

పసిడి ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడుల ప్రవాహం

Wednesday 12th February 2020

జనవరిలో రూ. 200 కోట్లు ఏడేళ్లలో ఇదే అత్యధికం న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక, రాజకీయపరమైన అనిశ్చితి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు.. పసిడి వంటి సురక్షితమైన పెట్టుబడి సాధనాల వైపు మళ్లుతున్నారు. దేశీయంగా ఇదే ధోరణి ప్రతిబింబిస్తూ.. గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌)లో వరుసగా మూడో నెలా పెట్టుబడుల రాక కొనసాగింది. జనవరిలో గోల్డ్ ఈటీఎఫ్‌లలో రూ. 200 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి. ఇది ఏడేళ్ళ గరిష్టం. 2012 డిసెంబర్ తర్వాత

రూ.999లకే విమాన టికెట్‌

Wednesday 12th February 2020

ఇండిగో వాలెంటైన్స్‌ డే ఆఫర్‌ న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ ఇంటర్‌ గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో).. రూ. 999కే దేశీ రూట్లలో టికెట్ అందిస్తోంది. వాలెంటైన్స్‌ డే సందర్భంగా ఈ ఆఫర్‌ను అందుబాటులో ఉంచింది. నాలుగు రోజులపాటు కొనసాగే ఈ చౌక చార్జీల ఆఫర్‌ మంగళవారం (11న) ప్రారంభమైంది. ఫిబ్రవరి 14 వరకు కొనసాగే ప్రేమికుల రోజు డిస్కౌంట్‌లో భాగంగా మొత్తం 10 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నట్లు కంపెనీ

Most from this category