News


నేడు మార్కెట్లు మళ్లీ కుప్పకూలతాయా?

Monday 16th March 2020
Markets_main1584329103.png-32493

భారీ గ్యాప్‌ డౌన్‌తో ఓపెనింగ్‌ నేడు!
ప్రపంచ మార్కెట్లలో కరోనా విలయం
410 పాయింట్లు కోల్పోయిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 

వడ్డీ రేట్లను సున్నాకు చేర్చిన ఫెడరల్‌ రిజర్వ్‌
యూఎస్‌ ఫ్యూచర్స్‌ 4.5 శాతం డౌన్‌
అటూఇటుగా ఆసియా మార్కెట్లు


నేడు(సోమవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి పతనం(గ్యాప్‌ డౌన్‌)తో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం  8.30 ప్రాంతం‍లో 410 పాయింట్లు పడిపోయి 9,574 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 9,984 పాయింట్ల వద్ద  ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. చైనాలో పుట్టి ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా.. గత వారమంతా ప్రపంచ స్టాక్‌ మార్కెట్లలో నష్టాల సునామీ సృష్టించింది. ప్రెసిడెంట్‌ ట్రంప్‌ జాతీయ అత్యయిక పరిస్థితి(నేషనల్‌ ఎమర్జెన్సీ)ని ప్రకటించడంతో వారాంతాన అమెరికా స్టాక్‌ మార్కెట్లు హైజంప్‌ చేశాయి. అయితే ఆ దేశ కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ సమీక్షకంటే ముందుగానే వడ్డీ రేట్లను మరోసారి సవరించింది. దాదాపు వడ్డీ రేట్లులేని(సున్నా) పరిస్థితులు కల్పించడంతోపాటు.. 700 బిలియన్‌ డాలర్ల భారీ సహాయక ప్యాకేజీని ప్రకటించింది. కోవిడ్‌-19 ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేయనున్న అంచనాలు ఫెడ్‌ చర్యలకు కారణంకాగా.. దీంతో మరోసారి ఇన్వెస్టర్లలో ఆందోళనలు చెలరేగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో నేడు దేశీయంగానూ ప్రతికూల వాతావరణం కనిపించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

తొలుత పతనం.. ఆపై జూమ్‌
శుక్రవారం తొలుత దేశీ స్టాక్‌ మార్కెట్లు వెల్లువెత్తిన అమ్మకాలతో 10 శాతం కుప్పకూలాయి. 12ఏళ్ల తదుపరి డౌన్‌ సర్క్యూట్‌ను తాకి ట్రేడింగ్‌ నిలిచిపోయింది. 45 నిముషాల తరువాత ప్రారంభమైన ట్రేడింగ్‌లో ఉన్నట్టుండి మార్కెట్లు యూటర్న్‌ తీసుకున్నాయి. చివరికి సెన్సెక్స్‌ ఏకంగా 1325 పాయింట్ల నికర లాభాన్ని ఆర్జించింది. వెరసి 34,103 వద్ద నిలిచింది. ఈ ప్రయాణంలో సెన్సెక్స్‌ తొలుత 29,389 పాయింట్లకు పడిపోయింది. తదుపరి జోరందుకుని ఏకంగా 34,769ను అధిగమించింది. అంటే ఒకే రోజులో 5,380 పాయింట్ల రికవరీ! ఇక సెన్సెక్స్‌ బాటలో నిఫ్టీ సైతం తీవ్ర ఒడిదొడుకులను చవిచూసింది. తొలుత 10 శాతం కుప్పకూలింది. 8,555 పాయింట్లను తాకింది. ట్రేడింగ్‌ తిరిగి ప్రారంభమయ్యాక దూకుడు చూపుతూ 10,159కు చేరింది. అంటే కనిష్టం నుంచీ ఏకంగా 1604 పాయింట్ల రికవరీని సాధించింది. ఈ ప్రయాణంలో చివరికి నిఫ్టీ 365 పాయింట్లు పెరిగి 9,955 వద్ద స్థిరపడింది.
 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 8,954 పాయింట్ల వద్ద, తదుపరి 7,952 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు  భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 10,558 పాయింట్ల వద్ద, ఆపై 11,161 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని  తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 22.455 పాయింట్ల వద్ద, తదుపరి 19,744 వద్దపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా  బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 26,774 పాయింట్ల వద్ద, తదుపరి 28,382 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు. 

ఎఫ్‌పీఐల భారీ విక్రయాలు
నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 6028 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టారు. అయితే దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 5868 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. ఇక గురువారం ఎఫ్‌పీఐలు రూ. 3475 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 3918 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. ఇదే విధంగా బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 3515 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌ రూ. 2835 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.   You may be interested

రిటైర్మెంట్‌కు వీపీఎఫ్‌ ఆయుధం!

Monday 16th March 2020

రిటైర్మెంట్‌కు వీపీఎఫ్‌ ఆయుధం! ఈపీఎఫ్‌కు అదనంగా జమ చేసుకోవచ్చు తద్వారా రిటైర్మెంట్‌ నాటికి అధిక మొత్తం రాబడి రేటు ఈపీఎఫ్‌లో మాదిరే ఈపీఎఫ్‌ నిబంధనలే అమలవుతాయి పీపీఎఫ్‌, ఇతర స్థిరాదాయ సాధనాల కంటే అధిక రాబడి అత్యవసరాల్లో ఉపసంహరణకు వీలు రిటైర్మెంట్‌ తర్వాత జీవితానికి సంబంధించి చాలా మందిలో ప్రణాళిక కనిపించదు. ఎన్నో ఏళ్ల తర్వాత అవసరాల కంటే ప్రస్తుత జీవన అవసరాలే వారికి ప్రాధాన్యంగా ఉంటుంటాయి. ఎక్కువగా మధ్యతరగతి, దిగువ ఆదాయ వర్గాల్లో ఇది చూడొచ్చు. కానీ, 60

'యస్‌'పై 18న మారటోరియం ఎత్తివేత

Monday 16th March 2020

అమల్లోకి వచ్చిన పునరుద్ధరణ ప్రణాళిక నెలాఖరుకు కొత్త బోర్డు ఏర్పాటు సీఈవో, ఎండీగా ప్రశాంత్ కుమార్‌ న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్‌ బ్యాంక్‌ పునరుద్ధరణ ప్రణాళిక అమల్లోకి రావడంతో మార్చి 18న బ్యాంకుపై మారటోరియం తొలగిపోనుంది. ప్రస్తుతం ఆర్‌బీఐ నియమిత అడ్మినిస్ట్రేటరుగా ఉన్న ప్రశాంత్ కుమార్‌ ఆ తర్వాత సీఈవో, ఎండీగా బాధ్యతలు చేపడతారు. ఆయన సారథ్యంలో కొత్త బోర్డు ఏర్పాటవుతుంది. పునర్‌వ్యవస్థీకరించిన బోర్డులో సునీల్ మెహతా (పంజాబ్ నేషనల్ బ్యాంక్

Most from this category