News


భారీ గ్యాప్‌ డౌన్‌తో ఓపెనింగ్‌ నేడు!

Thursday 12th March 2020
Markets_main1583983173.png-32416

మళ్లీ ప్రపంచ మార్కెట్లలో కరోనా సునామీ
470 పాయింట్లు కుప్పకూలిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 
బుధవారం యూఎస్‌ మార్కెట్ల పతనం
ఆసియా మార్కెట్లలోనూ అమ్మకాల జోరు

నేడు(గురువారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల(గ్యాప్‌ డౌన్‌)తో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 470 పాయింట్లు పడిపోయి 9,986 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 10,455 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కరోనా ఆందోళనలు తగ్గించే బాటలో ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ఇచ్చిన హామీలు ఇన్వెస్టర్లను మెప్పించకపోవడంతో బుధవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు మరోసారి అమ్మకాలతో కుప్పకూలాయి. డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ 6-5 శాతం మధ్య తిరోగమించాయి. ఈ బాటలో ప్రస్తుతం ఆసియా మార్కెట్లలోనూ అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. ఓవైపు ప్రపంచ మార్కెట్ల పతనం.. మరోపక్క యస్‌ బ్యాంక్‌ సంక్షోభం వంటి ప్రతికూల వార్తలతో నేడు దేశీ స్టాక్‌ మార్కెట్లు సైతం భారీ నష్టాలతో ప్రారంభమయ్యే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా. బుధవారం సానుకూల ప్రపంచ మార్కెట్ల సంకేతాల నడుమ హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి.  సెన్సెక్స్‌ 62 పాయింట్లు పుంజుకుని 35,697 వద్ద నిలవగా.. నిఫ్టీ 7 పాయింట్ల నామమాత్ర లాభంతో 10,458 వద్ద ముగిసింది. అయితే మార్కెట్లు  రోజంతా పలుమార్లు ఆటుపోట్లకు లోనుకావడం గమనార్హం!

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 10,346 పాయింట్ల వద్ద, తదుపరి 10,235 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 10,558 పాయింట్ల వద్ద, ఆపై 10,656 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 26,212 పాయింట్ల వద్ద, తదుపరి 25,947 వద్దపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 26,774 పాయింట్ల వద్ద, తదుపరి 27,062 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు. 

ఎఫ్‌పీఐల విక్రయాలు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 3515 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 2835 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. మంగళవారం హోలీ పండుగ సందర్భంగా మార్కెట్లకు సెలవుకాగా.. సోమవారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 6,596 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ  ఫండ్స్‌ రూ. 4,975 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల తొలి వారంలో ఎఫ్‌పీఐలు రూ. 17,316 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించడం గమనార్హం! 



You may be interested

ఖాతాల్లో కనీస బ్యాలన్స్‌కు చెల్లు..!

Thursday 12th March 2020

ఎటువంటి చార్జీలు ఇకపై ఉండవు ఎస్‌ఎంఎస్‌ చార్జీలూ ఎత్తివేత ఖాతాదారులకు ఎస్‌బీఐ శుభవార్త సేవింగ్స్‌ బ్యాంకుపై 3 శాతమే వడ్డీ న్యూఢిల్లీ: ఎస్‌బీఐ ఖాతాదారులకు పెద్ద ఉపశమనం లభించింది. ఖాతాల్లో కనీస బ్యాలన్స్‌ ఉంచాలన్న నిబంధనను ఎత్తివేస్తున్నట్టు బ్యాంకు ప్రకటించింది. ప్రస్తుతానికి గ్రామీణ శాఖల నుంచి పట్టణ శాఖల వరకు సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాల్లో కనీస బ్యాలన్స్‌ రూ.1,000-3,000 మధ్య ఉన్నది. అంటే ఈ మేరకు ఖాతాదారులు నెలవారీగా కనీస బ్యాలన్స్‌ను తప్పకుండా నిర్వహించాల్సి ఉంటుంది.

చివరికి స్వల్ప లాభాలతో సరి

Wednesday 11th March 2020

ఆటుపోట్ల మధ్య మార్కెట్లు సెన్సెక్స్‌ 62 పాయింట్లు ప్లస్‌ 7 పాయింట్లు బలపడిన నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్స్‌, రియల్టీ వీక్‌ సానుకూల ప్రపంచ మార్కెట్ల సంకేతాల నడుమ హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. సెన్సెక్స్‌ 62 పాయింట్లు పుంజుకుని 35,697 వద్ద నిలవగా.. నిఫ్టీ 7 పాయింట్ల నామమాత్ర లాభంతో 10,458 వద్ద ముగిసింది. అయితే మార్కెట్లు రోజంతా పలుమార్లు ఆటుపోట్లకు లోనయ్యాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 36,021కు ఎగువన

Most from this category