News


నేడు భారీ గ్యాప్‌డౌన్‌తో ఓపెనింగ్‌!

Monday 9th March 2020
Markets_main1583736127.png-32358

ప్రపంచ మార్కెట్లలో కరోనా సునామీ
301 పాయింట్లు కుప్పకూలిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 
శుక్రవారం యూఎస్‌ మార్కెట్‌ 1 శాతం మైనస్‌
ఆసియా మార్కెట్లలోనూ అమ్మకాల జోరు

నేడు(సోమవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల(గ్యాప్‌ డౌన్‌)తో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 301 పాయింట్లు పడిపోయి 10,627 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 10,928 పాయింట్ల  వద్ద ముగిసింది. ఇక్కడి  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కరోనా భయాలతో వారాంతాన(6న) అమెరికా స్టాక్‌ మార్కెట్లు మరోసారి నష్టాలతో ముగిశాయి. డోజోన్స్‌ 256 పాయింట్లు(1 శాతం) క్షీణించి 25,865 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 52 పాయింట్లు(1.7 శాతం) నీరసించి 2,972 వద్ద స్థిరపడింది. నాస్‌డాక్‌ మరింత అధికంగా 163 పాయింట్లు(1.9 శాతం) కోల్పోయి 8,576 వద్ద ముగిసింది. ఓవైపు కోరలు చాస్తున్న కరోనా వైరస్‌.. మరోపక్క యస్‌ బ్యాంక్‌ బోర్డు రద్దు వంటి ప్రతికూల వార్తలతో వారాంతాన దేశీ స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. తొలి నుంచీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడటంతో చివరివరకూ అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. సెన్సెక్స్‌ 894 పాయింట్లు పడిపోయి 37,577 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం 280 పాయింట్లు కోల్పోయి 10,990 వద్ద నిలిచింది. తద్వారా 11,000 పాయింట్ల మార్క్‌ దిగువన స్థిరపడింది. కాగా. ప్రస్తుతం ఆసియాలో ప్రధాన మార్కెట్లన్నీ భారీ నష్టాలతో కదులుతున్నాయి. దీంతో నేడు మరోసారి దేశీ స్టాక్‌ మార్కెట్లు భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొనే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 10,800 పాయింట్ల వద్ద, తదుపరి 10,756 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 11,157 పాయింట్ల వద్ద, ఆపై 11,206 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 27,623 పాయింట్ల వద్ద, తదుపరి 27,530 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 28,021 పాయింట్ల వద్ద, తదుపరి 28,208 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు. 

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 3,595 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌ (డీఐఐలు) రూ. 2,544 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 2,477 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌ రూ. 2,511 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.  



You may be interested

చమురు- 2 రోజుల్లో 40 శాతం ఆవిరి

Monday 9th March 2020

ఇంట్రాడేలో 30 శాతం కుప్పకూలిన ధరలు ఉత్పత్తిలో కోతలకు రష్యా వెనకడుగు 8 డాలర్ల డిస్కౌంట్‌ ప్రకటించిన సౌదీ అరేబియా ఏడేళ్ల గరిష్టానికి బంగారం ధరలు  ప్రపంచ చమురు దేశాలకు షాక్‌నిస్తూ సౌదీ అరేబియా ధరలలో భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. దీంతో నేటి(ఆదివారం అర్ధరాత్రి) ట్రేడింగ్‌లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. 1991 తదుపరి ఒక్క రోజులోనే 30 శాతం పతనమయ్యాయి. వెరసి గల్ఫ్‌ వార్‌ తదుపరి భారీ స్థాయిలో నష్టపోయాయి. ప్రస్తుతం లండన్‌ మార్కెట్లో

బంగారం ధర @1700డాలర్లు

Monday 9th March 2020

అంతర్జాతీయ మార్కెట్లో ఎనిదేళ్ల తరువాత బంగారం ధర తొలిసారి 1700డాలర్లను అందుకుంది. ప్రపంచదేశాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి మరింత ఉధృతి కావడం, క్రూడాయిల్‌ ధరల అనూహ్య పతనం,  ఈక్విటీ మార్కెట్లలో భారీ పతనంతో ఇన్వెస్టర్లు సంక్షోభ సమయాల్లో రక్షణాత్మక సాధనంగా భావించే బంగారంలో పెట్టుబడులకు మొగ్గుచూపారు. ఫలితంగా బంగారం ధరలకు అంతర్జాతీయ మార్కెట్లలో భారీగా డిమాండ్‌ నెలకొంది. ఆసియా మార్కెట్లో నేటి ఉదయం ఔన్స్‌ బంగారం ధర మునుపటి ముగింపుతో

Most from this category