STOCKS

News


నేడు భారీ నష్టాలతో ప్రారంభం?!

Monday 27th January 2020
Markets_main1580095169.png-31220

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 108 పాయింట్లు పతనం
ఇతర దేశాలకూ పాకుతున్న కరోనా వైరస్‌ 
2 శాతం క్షీణించిన ముడిచమురు ధరలు

నేడు(సోమవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల(గ్యాప్‌ డౌన్‌)తో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 108 పాయింట్లు పతనమై 12,163  వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,271 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి  తెలిసిందే. చైనాను వణికిస్తున్న కరోనా వైరస్‌ తాజాగా ఇల్లినాయిస్‌లో ఒక వ్యక్తికి సోకినట్లు వెల్లడికావడంతో వారాంతాన అమెరికా స్టాక్‌ మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. అమ్మకాలు ఊపందుకోవడంతో డోడోన్స్‌ ఇండెక్స్‌ తొలుత 300 పాయింట్లు పతనమైంది. తదుపరి కొంతమేర కోలుకుంది. చివరికి శుక్రవారం డోజోన్స్‌ 170 పాయింట్లు(0.6 శాతం) నీరసించి 28,990 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 30 పాయింట్లు(0.9 శాతం) తక్కువగా 3,295 వద్ద స్థిరపడింది. నాస్‌డాక్‌ 76 పాయింట్లు(0.8 శాతం) క్షీణించి 9,141 వద్ద ముగిసింది. అయితే శుక్రవారం వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు బలపడ్డాయి. తొలుత బలహీనంగా ప్రారంభమైనప్పటికీ వెనువెంటనే జోరందుకున్నాయి. సెన్సెక్స్‌ 227 పాయింట్లు ఎగసి 41,613 వద్ద నిలవగా.. నిఫ్టీ 68 పాయింట్లు లాభపడి 12,248 వద్ద స్థిరపడింది. బడ్జెట్‌పై ఇన్వెస్టర్ల అంచనాలకుతోడు, ట్రేడర్ల షార్ట్‌ కవరింగ్‌ జత కలవడంతో మార్కెట్లు లాభపడినట్లు విశ్లేషకులు తెలియజేశారు. కాగా.. చైనాలో తలెత్తిన కరోనా వైరస్‌ ఇతర దేశాలకూ పాకుతున్న వార్తలతో ఇటు ఆసియాలో జపాన్‌ మార్కెట్లు 2 శాతం డీలాపడగా.. అటు ముడిచమురు ధరలు సైతం​ తాజాగా 2 శాతం పతనమయ్యాయి. ఇతర ఆసియా మార్కెట్లకు సెలవు. దీంతో నేడు దేశీయంగానూ అమ్మకాలు ఊపందుకునే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 12,175 పాయింట్ల వద్ద, తదుపరి 12,101 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు  పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 12,297 వద్ద, ఆపై 12,346 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 30,955 పాయింట్ల వద్ద, తదుపరి 30,669 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 31,452 పాయింట్ల వద్ద, తదుపరి 31,662 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

కొనుగోళ్లవైపు యూటర్న్‌
నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 659 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 418 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేశాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 1352 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్ రూ. 984 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.  



You may be interested

దీర్ఘకాలంలో మోస్తరు రాబడులనిచ్చే ఫండ్‌

Monday 27th January 2020

టాటా లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ మార్కెట్ల ర్యాలీలో లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ పాత్ర అన్ని సమయాల్లోనూ ఉంటుంది. పైగా లార్జ్‌క్యాప్‌ విభాగంలో రిస్క్‌ కొంచెం తక్కువగా ఉంటుంది. ఇక మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో రిస్క్‌ ఎక్కువగా ఉన్నా కానీ, దీర్ఘకాలానికి రాబడులు కూడా అధికంగానే ఉంటాయి. ఈ రెండు విభాగాల్లోనూ ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడులపై సంపద సృష్టించే విధంగా టాటా లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ పనిచేస్తుంటుంది. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌

ఇలా చనిపోతే బీమా పరిహారం రాదు

Monday 27th January 2020

అన్నిటికీ కాదు.. కొన్నిటికే పరిహారం టర్మ్‌ పాలసీల్లో కొన్నిటికి మినహాయింపు అనారోగ్యకర అలవాట్లను దాచిపెడితే నష్టపోవాల్సిందే మద్యం మోతాదు మించే వారికి తిరస్కరణలు ప్రమాదకర రైడర్లు, విన్యాసాల వారికీ రిస్కే ప్రత్యేక రైడర్లు ఉంటే పరిహారం కష్టమే పాలసీ తీసుకునే ముందే అన్నీ తెలుసుకోవాలి బీమా పాలసీ ఉన్న వారు మరణానికి గురైతే బీమా కంపెనీలు పరిహారం చెల్లించడం అన్నది సహజమే. బీమా పాలసీ తీసుకునేదే అందుకు కదా..! అయితే, ఏ కారణంతో మరణించినా జీవిత బీమా పరిహారం వస్తుందని

Most from this category