News


భారీ నష్టాలతో ఓపెనింగ్‌ నేడు?!

Monday 24th February 2020
Markets_main1582514879.png-32028

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 141 పాయింట్లు పతనం
నేడు నిఫ్టీకి 12051 వద్ద సపోర్ట్‌
భారీ నష్ఠాలలో యూఎస్‌ ఇండెక్సుల ఫ్యూచర్స్‌

నేడు(సోమవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం  8.30  ప్రాంతం‍లో 141 పాయింట్లు పతనమై 11,940 వద్ద ట్రేడవుతోంది. మహాశివరాత్రి పర్వదినం​సందర్భంగా శుక్రవారం దేశీ స్టాక్‌ మార్కెట్లకు సెలవుకాగా.. గురువారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫిబ్రవరి ఫ్యూచర్‌ 12,081 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. రోజురోజుకీ పెరుగుతున్న కరోనా వైరస్‌ ప్రభావం వారాంతాన అమెరికా స్టాక్‌ మార్కెట్లను దెబ్బ తీసింది. ఇప్పటికే టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌ క్యూ1(జనవరి-మార్చి) ఫలితాలు నీరసించనున్నట్లు అంచనా వేయగా.. తాజాగా పానీయాల దిగ్గజం కోక కోలా.. క్యూ1లో అమ్మకాలు క్షీణించనున్నట్లు ప్రకటించింది. దీంతో మార్కెట్లు 1-2 శాతం మధ్య వెనకడుగు వేశాయి. ఇక గురువారం రోజంతా హెచ్చుతగ్గుల మధ్య కదిలిన దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 153 పాయింట్లు క్షీణించి 41,170 వద్ద నిలవగా.. నిఫ్టీ 45 పాయింట్ల వెనకడుగుతో 12,081 వద్ద స్థిరపడింది. బుధవారం నాలుగు రోజుల వరుస నష్టాలకు చెక్‌ పెడుతూ హైజంప్‌ చేసిన మార్కెట్లు ఒక్క రోజులోనే తోకముడవడం గమనార్హమని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. కాగా.. ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య పెరుగుతుండంతో అమెరికా స్టాక్‌ ఇండెక్సుల ఫ్యూచర్స్‌ భారీ నష్టాలకు లోనయ్యాయి. ముడి చమురు ధరలు దాదాపు 3 శాతం నీరసించాయి. దీంతో నేడు దేశీ మార్కెట్లు నష్టాల మధ్యే కదలవచ్చని నిపుణులు భావిస్తున్నారు. 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 12,051 పాయింట్ల వద్ద, తదుపరి 12,021 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు  పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 12,131 వద్ద, ఆపై 12,182 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌  నిఫ్టీకి తొలుత 30,735 పాయింట్ల వద్ద, తదుపరి 30,527 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 31,118  పాయింట్ల వద్ద, తదుపరి 31,293 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

ఎఫ్‌పీఐల పెట్టుబడులు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1495 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 700 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి.  మహాశివరాత్రి పర్వదినం​సందర్భంగా శుక్రవారం దేశీ స్టాక్‌ మార్కెట్లకు సెలవుకాగా.. బుధవారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 191 కోట్ల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.... దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 590 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. You may be interested

స్థిరమైన రాబడులు ఆశిస్తుంటే..

Monday 24th February 2020

కోటక్‌ ‍స్టాండర్డ్‌ మల్టీక్యాప్‌ ఫండ్‌ రెండేళ్లుగా స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులతో కొనసాగుతుండడాన్ని చూస్తున్నాం. కొన్ని రోజులు ర్యాలీ చేయడం, కొన్ని రోజులు నష్టాల పాలు కావడం సాధారణంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఇటువంటి పరిస్థితులను సమర్థంగా నెగ్గుకొచ్చే మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలు ఇన్వెస్టర్లకు దీర్ఘకాలంలో మెరుగైన రాబడులను ఇవ్వగలుగుతాయి. ముఖ్యంగా గత రెండేళ్లుగా లార్జ్‌క్యాప్‌లో నాణ్యమైన స్టాక్స్‌ అద్భుత రాబడులను ఇచ్చాయి. స్మాల్‌, మిడ్‌క్యాప్‌ నేలచూపులు చూశాయి. లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే

ఈఎల్‌ఎస్‌ఎస్‌, పీపీఎఫ్‌, ఎఫ్‌డీ.. వీటిల్లో మీ చాయిస్‌?

Monday 24th February 2020

పన్ను ఆదా చేసుకునేందుకు మరో నెలరోజులే వ్యవధి మిగిలి ఉంది. ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. పన్ను ఆదా కోసం బీమా వైపు చూడకుండా.. ఇతర పెట్టుబడి విధానాలను పరిశీలించినట్టయితే... ఈక్విటీలతో కూడిన ఈఎల్‌ఎస్‌ఎస్‌, పీపీఎఫ్‌, బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నవి. అవగాహన విస్తృతం కావడంతో పన్ను ఆదా చేసే ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ ఫండ్స్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌) గత కొన్ని సంవత్సరాలుగా

Most from this category