News


నిఫ్టీ నిరోధం 12,123

Tuesday 7th January 2020
Markets_main1578367195.png-30713

 నేడు లాభాల ఓపెనింగ్‌ చాన్స్‌!


పశ్చిమాసియాలో తలెత్తిన ఉద్రిక్తతల కారణంగా రెండు రోజులపాటు పతన బాటలో సాగిన దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు(మంగళవారం) లాభాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 68 పాయింట్లు ఎగసి 12,111 వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజు ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,043 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. ఇరాక్‌ విమానాశ్రయంపై అమెరికా మిలటరీ దాడులు నిర్వహించి, ఇరాన్‌, ఇరాక్‌ సైనికాధికారులను కాల్చివేయడంతో గత వారం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో సోమవారం సైతం దేశీ స్టాక్‌ మార్కెట్లు అమ్మకాలతో కుదేలయ్యాయి. సెన్సెక్స్‌ 788 పాయింట్లు పడిపోయి 41,677 వద్ద నిలవగా.. నిఫ్టీ 234 పాయింట్లు కోల్పోయి 11,993 వద్ద స్థిరపడింది. అయితే టెక్నాలజీ కౌంటర్లకు డిమాండ్‌ కనిపించడంతో సోమవారం యూఎస్‌ మార్కెట్లు 0.2-0.6 శాతం మధ్య పుంజుకున్నాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లు సైతం కొనుగోళ్లతో కళకళలాడుతున్నాయి. జపాన్‌ 1.5 శాతం బలపడగా.. కొరియా, సింగపూర్‌, హాంకాంగ్‌, థాయ్‌లాండ్‌, ఇండొనేసియా, చైనా 1-0.2 శాతం మధ్య లాభపడ్డాయి. కాగా.. తైవాన్‌ 1 శాతం నష్టంతో ట్రేడవుతోంది.

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,918 పాయింట్ల వద్ద, తదుపరి 11,844 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 12,123 వద్ద, ఆపై 12,254 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 30,967 పాయింట్ల వద్ద, తదుపరి 30,697 వద్ద సపోర్ట్‌   లభించవచ్చని, ఇదే విధంగా తొలుత 31,711 పాయింట్ల వద్ద, తదుపరి 32,184 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని అంచనా వేశారు. 

స్వల్ప అమ్మకాలు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 104 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 24 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. కాగా.. వారాంతాన ఎఫ్‌పీఐలు రూ. 1263 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు రూ. 1029 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన సంగతి తెలిసిందే.



You may be interested

అమెజాన్ ఇండియాతో ఫ్యూచర్‌ గ్రూప్ ఒప్పందాలు

Tuesday 7th January 2020

ఆన్‌లైన్‌లో భారీగా కార్యకలాపాల విస్తరణ     న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాతో ఫ్యూచర్ గ్రూప్ సంస్థలు దీర్ఘకాలిక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అమెజాన్ షాపింగ్‌ పోర్టల్ ద్వారా తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు ఫ్యూచర్ గ్రూప్ సంస్థలకు ఇవి ఉపయోగపడనున్నాయి. ఈ ఒప్పందాల ప్రకారం ఫ్యూచర్ రిటైల్‌ (ఎఫ్‌ఆర్‌ఎల్‌) స్టోర్స్‌కు అమెజాన్ అధీకృత ఆన్‌లైన్ సేల్స్ చానల్‌గా ఉండనుంది. ఆన్‌లైన్‌లో వచ్చే ఆర్డర్ల.. ప్యాకింగ్, పికప్‌ కోసం ఎఫ్‌ఆర్‌ఎల్ తమ రిటైల్

టాటా-మిస్త్రీ కేసులో ఆర్‌వోసీకి చుక్కెదురు

Tuesday 7th January 2020

గత తీర్పును సవరించేందుకు నిరాకరించిన ఎన్‌సీఎల్‌ఏటీ న్యూఢిల్లీ: టాటా-మిస్త్రీ కేసులో తీర్పును సవరించాలంటూ నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ)లో పిటీషన్ వేసిన రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌వోసీ)కి చుక్కెదురైంది. ఆర్‌వోసీ పిటీషన్‌ను ఎన్‌సీఎల్‌ఏటీ తోసిపుచ్చింది. గతంలో ఇచ్చిన తీర్పును సవరించేందుకు తగిన కారణాలేమీ లేవని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెడితే.. సైరస్‌ మిస్త్రీని టాటా గ్రూప్ చైర్మన్‌గా పునఃనియమించాలంటూ డిసెంబర్ 18న ఇచ్చిన తీర్పులో ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశించింది. టాటా

Most from this category