News


నేడు గ్యాపప్‌ ఓపెనింగ్‌?!

Tuesday 11th February 2020
Markets_main1581391525.png-31674

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 51 పాయింట్లు ప్లస్‌
సోమవారం యూఎస్‌ మార్కెట్ల రికార్డ్స్‌

నేడు(మంగళవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాల(గ్యాపప్‌)తో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 51 పాయింట్లు ఎగసి 12,100 వద్ద ట్రేడవుతోంది. సోమవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫిబ్రవరి ఫ్యూచర్‌ 12,049 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌ ఆందోళనల నుంచి బయటపడిన ఇన్వెస్టర్లు కంపెనీల ఫలితాలపై దృష్టిపెట్టడంతో సోమవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు తిరిగి జోరందుకున్నాయి. డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ 1-0.7 శాతం మధ్య బలపడ్డాయి. తద్వారా ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ మళ్లీ సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. కాగా.. కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించవచ్చన్న ఆందోళనలతో సోమవారం దేశీయంగా అమ్మకాలదే పైచేయిగా నిలిచింది. వెరసి వరుసగా రెండో రోజు మార్కెట్లు డీలాపడ్డాయి. సెన్సెక్స్‌ 162 పాయింట్లు క్షీణించి 40,980 వద్ద నిలవగా.. నిఫ్టీ 67 పాయింట్ల వెనకడుగుతో 12,031 వద్ద ముగిసింది. ప్రపంచ మార్కెట్లు పుంజుకోవడంతో నేడు దేశీ స్టాక్‌ మార్కెట్లలోనూ సానుకూల ట్రెండ్‌ కనిపించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో నేడు మార్కెట్లు హుషారుగా కదిలే వీలున్నట్లు భావిస్తున్నారు.

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,980 పాయింట్ల వద్ద, తదుపరి 11,929 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు  పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 12,093 వద్ద, ఆపై 12,155 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 30,927 పాయింట్ల వద్ద, తదుపరి 30,796 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 31,219 పాయింట్ల వద్ద, తదుపరి 31,380 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

అటూఇటుగా..
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 184 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) దాదాపు రూ. 736 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. వారాంతాన ఎఫ్‌పీఐలు స్వల్పంగా రూ. 162 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 179 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన విషయం విదితమే.You may be interested

ఇసుజు కార్ల పరిశ్రమలో అదనపు ఉత్పత్తులు ప్రారంభం

Tuesday 11th February 2020

రూ. 400కోట్లతో ప్రెస్‌షాప్, ఇంజన్‌ అసెంబ్లీ యూనిట్లు ఏర్పాటు వరదయ్యపాళెం(చిత్తూరు జిల్లా): శ్రీసిటీలోని జపనీస్‌ యుటిలిటీ వాహన తయారీదారు ఇసుజు మోటార్స్‌ ఇండియా పరిశ్రమలో అదనపు ఉత్పత్తుల యూనిట్‌ను సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. కంపెనీ ఆవరణలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జపాన్‌ కాన్సుల్‌ జనరల్‌ కొజిరో యఖియామా, ఇసుజు మోటార్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ టోరూ నకాటా, మిట్సుబిషి కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్, సీఈఓ ఇవారో టోయిడి శ్రీసిటీ మేనేజింగ్‌

విదేశీ సైట్లలో కొంటే ఇక బాదుడే..

Tuesday 11th February 2020

(అప్‌డేటెడ్‌..!) ప్రీపెయిడ్‌ కస్టమ్స్‌ డ్యూటీ, ట్యాక్స్‌ విధింపు ప్రతిపాదన సుంకాల ఎగవేతను అరికట్టేందుకే దాదాపు 50 శాతం పెరగనున్న భారం న్యూఢిల్లీ: విదేశీ ఈ-కామర్స్‌ సైట్లలో జరిపే కొనుగోళ్లు ఇకపై భారం కానున్నాయి. ఈ షాపింగ్‌ పోర్టల్స్‌లో లావాదేవీల్లో సుంకాలు, పన్నుల ఎగవేత ఉదంతాలు చోటు చేసుకుంటుండటంపై కేంద్రం మరింతగా దృష్టి సారించడమే ఇందుకు కారణం. సీమాంతర లావాదేవీలపై ప్రీ–పెయిడ్‌ విధానంలో కస్టమ్స్‌ సుంకాలు, పన్నులను వడ్డించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ విధానం అమల్లోకి

Most from this category