News


నేడు లాభాల ఓపెనింగ్‌?

Monday 13th January 2020
Markets_main1578885669.png-30871

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 46 పాయింట్లు ప్లస్‌

వారాంతాన యూఎస్‌ మార్కెట్ల వెనకడుగు
నేడు(సోమవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాల(గ్యాపప్‌)తో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నేటి(13న) ఉదయం  8.30 ప్రాంతం‍లో 46 పాయింట్లు ఎగసి 12,340 వద్ద ట్రేడవుతోంది. వారాంతాన ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,294 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కాగా.. డిసెంబర్‌లో ఉపాధి గణాంకాలు అంచనాలకంటే దిగువన నమోదవడంతో వారాంతాన అమెరికా స్టాక్‌ మార్కెట్లు 0.5-0.3 శాతం మధ్య డీలాపడ్డాయి. అయితే తొలుత ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ ఇండెక్సులు​సరికొత్త గరిష్టాలను తాకాయి. చివర్లో ట్రేడర్లు  లాభాల స్వీకరణకు దిగడంతో వెనకడుగు వేగిశాయి. మరోవైపు దేశీయంగా శుక్రవారం మార్కెట్లు మరోసారి బలపడ్డాయి.సెన్సెక్స్‌ 148 పాయింట్లు బలపడి 41,600కు చేరగా.. నిఫ్టీ 41 పాయింట్లు పుంజుకుని 12,257 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో నిఫ్టీ 12,311 పాయింట్లను తాకింది. తద్వారా 2019 డిసెంబర్‌ 20న సాధించిన 12,293 పాయింట్ల చరిత్రాత్మక ఇంట్రాడే గరిష్టాన్ని అధిగమించింది.

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 12,210 పాయింట్ల వద్ద, తదుపరి 12,162 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు  పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 12,308 వద్ద, ఆపై 12,358 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 31,918 పాయింట్ల వద్ద, తదుపరి 31,739  వద్ద సపోర్ట్‌ లభించవచ్చని అంచనా వేశారు.  ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 32,312 పాయింట్ల వద్ద, తదుపరి 32,526 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 578 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) దాదాపు రూ. 252 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. కాగా.. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 431 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 419 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. 



You may be interested

2024 నాటికి 5 ట్రిలియన్‌ డాలర్లు అసాధ్యమే

Monday 13th January 2020

ఆర్థికవేత్త నాగరాజ్‌ న్యూఢిల్లీ: 2024 నాటికి దేశ జీడీపీని 5 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి (రూ.350 లక్షల కోట్లు) తీసుకెళ్లాలని మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకోగా, దీన్ని ఆచరణ సాధ్యం కాని లక్ష్యంగా ప్రముఖ ఆర్థికవేత్త ఆర్‌ నాగరాజ్‌ పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని 2024 నాటికి సాధించాలంటే జీడీపీ వృద్ధి రేటు ఏటా 9 శాతం ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మన జీడీపీ సుమారు 2.8 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది. ఐదేళ్లలో

సెన్సెక్స్‌కు 41,700–41,810 శ్రేణే అవరోధం

Monday 13th January 2020

అమెరికా–ఇరాన్‌ మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గతవారం ప్రధమార్థంలో పెరిగిన బంగారం, క్రూడ్‌ ధరలు మన ఈక్విటీ, కరెన్సీ మార్కెట్లలో కల్లోలం  సృష్టించాయి. ఇంతలోనే మధ్యప్రాచ్య ఆందోళనలు చల్లారడంతో ఇటు బంగారం, క్రూడ్‌ ధరలు దిగివచ్చాయి. రూపాయి విలువ కూడా గణనీయంగా పుంజుకోవడంతో  తిరిగి స్టాక్‌ సూచీలు ర్యాలీ చేయగలిగాయి. అంతర్జాతీయంగా అనూహ్య పరిణామాలేవీ సంభవించకపోతే, మన మార్కెట్లో ఇక బడ్జెట్‌ అంచనాలు, కార్పొరేట్‌  ఫలితాలకు అనుగుణంగా ఆయా

Most from this category