News


భారీ గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌?!

Thursday 9th January 2020
Markets_main1578540374.png-30776

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 120 పాయింట్లు అప్‌

నేడు(గురువారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల(గ్యాపప్‌)తో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ బుధవారం ఉదయం  8.40 ప్రాంతం‍లో 120 పాయింట్లు జంప్‌చేసి 12,186 వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజు ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,065 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ను  ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. ఇరాక్‌లోని అమెరికన్‌ సైనిక స్థావరాల లక్ష్యంగా ఇరాన్‌ మిస్సైళ్లతో దాడి చేసినప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదంటూ అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ స్పష్టం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు తెలియజేశారు. అమెరికా, ఇరాన్‌ పరస్పర దాడులకు దిగే పరిస్థితులు కనిపించకపోవడంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు తగ్గినట్లు అభిప్రాయపడ్డారు. కాగా.. బుధవారం తొలుత 400 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌ చివరికి కోలుకుంది. 52 పాయింట్ల స్వల్ప  నష్టంతో 40,818 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 28 పాయింట్లు బలహీనపడి 12,025 వద్ద ముగిసింది. ఇక బుధవారం యూఎస్‌ మార్కెట్లు 0.7 శాతం చొప్పున ఎగశాయి. నాస్‌డాక్‌ సరికొత్త గరిష్టాన్ని అందుకుంది.

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,955 పాయింట్ల వద్ద, తదుపరి 11,884 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు  పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 12,070 వద్ద, ఆపై 12115 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 31,032 పాయింట్ల వద్ద, తదుపరి 30,689 వద్ద సపోర్ట్‌    లభించవచ్చని, ఇదే విధంగా తొలుత 31,584 పాయింట్ల వద్ద, తదుపరి 32,794 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని అంచనా వేశారు. 

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 516 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా..  దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 748 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 682 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. డీఐఐలు రూ. 311 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు  చేసిన సంగతి తెలిసిందే.



You may be interested

బ్యాంక్‌ సేవలపై  భారత్ బంద్ ప్రభావం 

Thursday 9th January 2020

వాహన ప్లాంట్లపై సమ్మె ప్రభావం పాక్షికం  న్యూఢిల్లీ/ముంబై/చెన్నై:  న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పది కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా నిర్వహించిన భారత్‌ బంద్... బ్యాంక్‌ల సేవలపై బాగానే ప్రభావం చూపించింది. వాహన కంపెనీల ప్లాంట్లపై సమ్మె ప్రభాం పాక్షికంగానే  ఉంది. ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎమ్‌ఎస్‌, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ తదితర పది కార్మిక సంఘాలు నిర్వహించిన ఈ సమ్మెకు పలు బ్యాంక్‌ సంఘాలు కూడా మద్దతు ఇచ్చాయి.  ఆర్‌బీఐ కార్యలయాల్లోనూ

మారుతీ సుజుకీ ఉత్పత్తిలో పెరుగుదల

Thursday 9th January 2020

- డిసెంబర్‌లో 7.88 శాతం వృద్ధి న్యూఢిల్లీ: దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ).. గతేడాది డిసెంబర్‌ నెలలో తన వాహనాల ఉత్పత్తిని పెంచింది. గత నెలలో మొత్తం వాహనాల ఉత్పత్తి 1,15,949 యూనిట్లుగా నమోదైనట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. అంతక్రితం ఏడాది (2018) డిసెంబర్‌ నెలలోని 1,07,478 యూనిట్ల ఉత్పత్తితో పోల్చితే ఈసారి 7.88 శాతం వృద్ధి చెందినట్లు వివరించింది. గతేడాదిలో డిమాండ్‌

Most from this category