News


నేడు గ్యాప్‌ డౌన్‌ ఓపెనింగ్‌?!

Wednesday 26th February 2020
Markets_main1582687219.png-32096

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 89 పాయింట్లు మైనస్‌
నేడు నిఫ్టీకి 11,757 వద్ద తొలి సపోర్ట్‌!
యూఎస్‌ మార్కెట్లు 3 శాతం పతనం 

నేడు(బుధవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30  ప్రాంతం‍లో 89 పాయింట్లు పతనమై 11,745 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫిబ్రవరి ఫ్యూచర్‌ 12,834 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాలలో రోజురోజుకీ విస్తరిస్తున్న కరోనా వైరస్‌ అమెరికాలో కాలుమోపకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ వ్యాధుల నియం‍త్రణ, నివారణ కేంద్రం(సీడీసీ) తాజాగా హెచ్చరించడంతో మంగళవారం మరోసారి అంతర్జాతీయంగా స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. అమెరికా స్టాక్‌ మార్కెట్లు సైతం దెబ్బతిన్నాయి. డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ 3 శాతం చొప్పున పతనమయ్యాయి. ఇక రోజంతా ఆటుపోట్ల మధ్య కదిలిన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 82 పాయింట్లు క్షీణించి 40,281 వద్ద నిలవగా.. 31 పాయింట్లు తగ్గిన నిఫ్టీ 11,798 వద్ద స్థిరపడింది. కరోనా వైరస్‌ ఆందోళనలు, ఫిబ్రవరి డెరివేటివ్‌ సిరీస్‌ ముగింపు మధ్య మార్కెట్లు పలుమార్లు ఒడిదొడుకులను ఎదుర్కొన్నట్లు నిపుణులు తెలియజేశారు. కరోనా ఆందోళనలతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో నేడు కూడా మార్కెట్లు మరోసారి నేలచూపులతో కదిలే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,757 పాయింట్ల వద్ద, తదుపరి 11,717 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు  పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 11,861 పాయింట్ల వద్ద, ఆపై 11,923 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌  నిఫ్టీకి తొలుత 30,305 పాయింట్ల వద్ద, తదుపరి 30,177 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 30,586  పాయింట్ల వద్ద, తదుపరి 30,739 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2315 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1565 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 1161 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 516 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 
 



You may be interested

శ్రీసిటీని సందర్శించిన ఈఎంసీ బృందం

Wednesday 26th February 2020

వరదయ్యపాళెం(చిత్తూరు జిల్లా): ఎలక్ట్రానిక్స్‌ సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఈఎస్‌ఎస్‌సీ) సీఈఓ మహాపాత్ర శ్రీసిటీని సందర్శించారు. ఆయనకు శ్రీసిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి సాదర స్వాగతం పలికారు.  శ్రీసిటీ ప్రగతి, ప్రత్యేకతలను ఆయనకు వివరించారు. ఎలక్ట్రానిక్స్‌ మ్యానుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ (ఈఎంసీ)లో భాగంగా ఇక్కడ ఏర్పాటైన ఎలక్ట్రానిక్స్‌ సెక్టార్‌ పరిశ్రమల గురించి  మహాపాత్ర తెలుసుకున్నారు.  సువిశాల పారిశ్రామికవాడలో ప్రపంచశ్రేణి మౌలిక వసతుతో  పాటు వేలాది ఉద్యోగాలు రావడానికి కృషి

మారిషస్‌ ఇన్వెస్టర్లు.. ఎఫ్‌పీఐగా నమోదుకు అర్హులే

Wednesday 26th February 2020

నిబంధనల ప్రకారం పర్యవేక్షణ మరింత పెరుగుతుంది.  స్పష్టం చేసిన సెబీ  న్యూఢిల్లీ: మారిషస్‌ నుంచి పెట్టుబడులు పెట్టే విదేశీ ఇన్వెస్టర్లు.. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్‌(ఎఫ్‌పీఐ)గా నమోదు చేసుకోవడానికి అర్హులేనని మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ స్పష్టం చేసింది. అయితే అంతర్జాతీయ నిబంధనల ప్రకారం వారిపై పర్యవేక్షణ పెరుగుతుందని వివరించింది. మారిషస్‌ దేశాన్ని ఫైనాన్షియల్‌ యాక్షన్‌​ టాస్క్‌ఫోర్స్‌(ఎఫ్‌ఏటీఎఫ్‌-మనీ లాండరింగ్‌ను నిరోధించే ప్రమాణాలను రూపొందించే ప్రభుత్వ విభాగం) గ్రే లిస్ట్‌లో ఉంచిన నేపథ్యంలో సెబీ ఈ

Most from this category