STOCKS

News


గ్యాప్‌ డౌన్‌ ఓపెనింగ్‌ నేడు

Tuesday 21st January 2020
Markets_main1579576731.png-31063

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 66 పాయింట్లు డౌన్‌

నేడు(మంగళవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాల(గ్యాప్‌ డౌన్‌)తో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 66 పాయింట్లు పతనమై 12,200 వద్ద ట్రేడవుతోంది. సోమవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,266 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) తాజాగా ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలను తగ్గించింది. వర్ధమాన దేశాలలో ఇండియా ఆర్థిక వృద్ధి సైతం మరింత నీరసించనున్నట్లు తాజా అంచనాలలో పేర్కొంది. దీంతో ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఫలితంగా నేడు మరోసారి దేశీ స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా.. సోమవారం దేశీ స్టాక్‌ మార్కెట్లు తొలుత హుషారుగా ప్రారంభమైనప్పటికీ తదుపరి అమ్మకాలు పెరగడంతో పతనంతో ముగిశాయి. సెన్సెక్స్‌ 416 పాయింట్లు కోల్పోయి 41,529 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 128 పాయింట్లు క్షీణించి 12,224 వద్ద స్థిరపడింది. అయితే తొలుత కొనుగోళ్ల మద్దతు లభించడంతో 42,274 వద్ద సెన్సెక్స్‌, 12,430 వద్ద నిఫ్టీ చరిత్రాత్మక గరిష్టాలను తాకాయి. 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 12,151 పాయింట్ల వద్ద, తదుపరి 12,077 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 12,364 వద్ద, ఆపై 12,504 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 31,780 పాయింట్ల వద్ద, తదుపరి 31,479 వద్ద సపోర్ట్‌ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 31,653 పాయింట్ల వద్ద, తదుపరి 32,225 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

డీఐఐల భారీ అమ్మకాలు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) సైలెంట్‌ అయ్యారు. కేవలం రూ. 6 కోట్లను ఇన్వెస్ట్‌ చేశారు. అయితే దేశీ ఫండ్స్‌(డీఐఐలు) దాదాపు రూ. 1420 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం గమనార్హం! ఇక శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 264 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు రూ. 500 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన సంగతి తెలిసిందే. You may be interested

నేడు క్యూ3 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు

Tuesday 21st January 2020

జీ ఎంటర్‌టైన్మెంట్‌, హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ,  హావెల్స్‌ ఇండియా, పాలీక్యాబ్‌ ఇండియా, న్యూజెన్‌ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌, ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌, గ్రాన్యూల్స్‌ ఇండియా, తేజాస్‌ నెట్‌వర్క్స్‌, గుజరాత్‌ ఇన్వెస్టా కంపెనీలు నేడు తమ ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసిక ఫలితాలు విడుదల చేయనున్నాయి. 

బడ్జెట్‌ పత్రాల ముద్రణ ప్రారంభం

Tuesday 21st January 2020

సంప్రదాయ హల్వా రుచులతో కీలక ఘట్టానికి శ్రీకారం ఫిబ్రవరి 1న లోక్‌సభలో ఫైనాన్స్‌ బిల్లు న్యూఢిల్లీ: సాంప్రదాయక హల్వా రుచుల ఆస్వాదనతో వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-2021) బడ్జెట్‌ పత్రాల ముద్రణ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, ఆర్థిక శాఖ సీనియర్‌ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 1వ తేదీన సీతారామన్‌ 2020-21 ఫైనాన్స్‌ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.  నరేంద్రమోదీ రెండవసారి ప్రధానిగా అధికార పగ్గాలు

Most from this category