News


పతనంతో ప్రారంభం?

Wednesday 8th January 2020
Markets_main1578453393.png-30742

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 114 పాయింట్లు డౌన్‌
యూఎస్‌ సైనిక స్థావరాలపై ఇరాన్‌ దాడులు

ఇరాక్‌లోని అమెరికన్‌ సైనిక స్థావరాలు లక్ష్యంగా ఇరాన్‌ మిస్సైళ్లతో దాడి చేసినట్లు వెలువడిన వార్తలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలకు తెరతీశాయి. దీంతో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ బుధవారం ఉదయం 8.20 ప్రాంతం‍లో 114 పాయింట్లు పడిపోయి 11,942 వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజు ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,106 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. ఇరాక్‌ విమానాశ్రయంపై అమెరికా మిలటరీ దాడులు నిర్వహించి, ఇరాన్‌, ఇరాక్‌ సైనికాధికారులను కాల్చివేయడంతో ఇందుకు ప్రతిగా ఇరాన్‌ దాడులకు దిగింది. దీంతో పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు అలుముకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో సంక్షోభ సమయాల్లో రక్షణాత్మక పెట్టుబడిగా భావించే పసిడి తాజాగా ఔన్స్‌ ధర 1600 డాలర్లను తాకినట్లు తెలియజేశారు. కాగా.. మంగళవారం ట్రేడర్ల షార్ట్‌ కవరింగ్‌ నేపథ్యంలో రెండు రోజుల వరుస నష్టాలకు చెక్‌ పడింది. సెన్సెక్స్‌ 193 పాయింట్లు ఎగసి 40,869 వద్ద నిలవగా.. నిఫ్టీ సైతం 60 పాయింట్లు బలపడి 12,053 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. మంగళవారం యూఎస్‌ మార్కెట్లు 0.2 శాతం చొప్పున నీరసించాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లు సైతం అమ్మకాలతో 2-0.6 శాతం మధ్య బలహీనపడ్డాయి. తైవాన్‌ మాత్రమే(0.2 శాతం) బలపడి ట్రేడవుతోంది.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 682 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 311 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. ఇక సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 104 కోట్లు, డీఐఐలు రూ. 24 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే.



You may be interested

బెంగళూరును దాటేసిన భాగ్యనగరం!

Wednesday 8th January 2020

ఆఫీస్‌ స్పేస్‌ లావాదేవీల్లో హైదరాబాద్‌ టాప్‌ హెచ్‌2లో 89 లక్షల చ.అ. లావాదేవీలు; 7,933 గృహాల విక్రయం నైట్‌ఫ్రాంక్‌ ఇండియా 12వ నివేదికలో వెల్లడి హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌లో ఆఫీస్‌ స్పేస్‌ క్రయవిక్రయాలు టాప్‌ గేర్‌లో సాగుతున్నాయి. 2019 జులై – డిసెంబర్‌ (హెచ్‌2) మధ్య కాలంలో దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే భాగ్యనగరంలోనే అత్యధిక లావాదేవీలు జరిగాయి. గతేడాది హెచ్‌2లో బెంగళూరులో 70 లక్షల చ.అ.కు సంబంధించిన లావాదేవీలు జరగ్గా..

14 శాతం తగ్గనున్న కేబుల్‌, డీటీహెచ్‌ బిల్లు

Tuesday 7th January 2020

కేబుల్‌, బ్రాడ్‌కాస్టింగ్‌ సేవలకు సంబంధించి ట్రాయ్‌ నూతన మార్గదర్శకాలతో డీటీహెచ్‌/ కేబుల్‌ టీవీ నెలవారీ బిల్లుల భారం 14 శాతం వరకు ప్రస్తుత స్థాయి నుంచి తగ్గుతుందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. టారిఫ్‌లకు సంబంధించి నూతన నియంత్రపరమైన కార్యాచరణను ట్రాయ్‌ గత వారమే ప్రకటించింది. దీంతో తక్కువ సబ్‌స్క్రిప్షన్‌కే టీవీ యూజర్లు మరిన్ని చానళ్లను వీక్షించే అవకాశం రానుంది. వచ్చే మార్చి 1 నుంచి ట్రాయ్‌ నూతన ఆదేశాలు

Most from this category