News


మార్కెట్లు నేడు నేలచూపులతో!

Wednesday 4th March 2020
Markets_main1583292671.png-32254

0.5 శాతం వడ్డీ రేటు తగ్గించిన ఫెడ్‌
మంగళవారం యూఎస్‌ మార్కెట్లు డౌన్‌
ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 41 పాయింట్లు మైనస్‌
నేడు నిఫ్టీకి 11,190 వద్ద తొలి సపోర్ట్‌!

నేడు(బుధవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30   ప్రాంతం‍లో 41 పాయింట్లు తక్కువగా 11,280 వద్ద ట్రేడవుతోంది. సోమవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 11,321 పాయింట్ల  వద్ద ముగిసింది. ఇక్కడి  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఆర్థిక వృద్ధి దెబ్బతినకుండా చూసే బాటలో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ తాజాగా 0.5 శాతం వడ్డీ రేటును తగ్గించింది. అయినప్పటికీ మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు 3 శాతం పతనంతో ముగిశాయి. సోమవారం 7 రోజుల పతనం నుంచి బౌన్స్‌బ్యాక్‌ అయిన అమెరికా స్టాక్‌ మార్కెట్లు తిరిగి నీరసించడంతో నేడు దేశీయంగానూ ఇన్వెస్టర్లు అమ్మకాలకే ఆసక్తి చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏడు రోజుల వరుస పతనానికి చెక్‌ పెడుతూ మంగళవారం దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 480 పాయింట్లు జంప్‌చేసి 38,624 వద్ద ముగిసింది. నిఫ్టీ  సైతం 170 పాయింట్లు జమ చేసుకుని 11,303 వద్ద నిలిచింది. సోమవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు ఏకంగా 5 శాతం జంప్‌చేయడంతో ఇన్వెస్టర్లకు  హుషారొచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,190 పాయింట్ల వద్ద, తదుపరి 11,076 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు   భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు  పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 11,380 పాయింట్ల వద్ద, ఆపై 11,457 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని   తెలియజేశారు. ఇక బ్యాంక్‌  నిఫ్టీకి తొలుత 28,856 పాయింట్ల వద్ద, తదుపరి 28,535 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా  బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 29,392 పాయింట్ల వద్ద, తదుపరి 29,606 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2416 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌ (డీఐఐలు) రూ. 3135 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. సోమవారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 1355 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌ రూ. 1139 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి.



You may be interested

పసిడి పరుగే... పరుగు!

Wednesday 4th March 2020

అంతర్జాతీయంగా 50 డాలర్లకుపైగా పెరుగుదల దేశంలోనూ రూ.1,000కి పైగా అప్‌ రూపాయి ‘బలహీనత’ మరోబలం ఆర్థిక మందగమనం, కరోనా కష్టాల నేపథ్యంలో సరళతర ద్రవ్య విధానాలు అవలంభించడానికి సంబంధించి మీమాంస తగదని అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌- ఫెడ్‌పై అధ్యక్షుడు ట్రంప్‌ సోమవారంనాటి విమర్శలు,  ఆయా అంశాల నేపథ్యంలో ఫెడ్‌ వడ్డీరేట్ల తగ్గింపు తప్పదన్న ఊహాగానాలు, ఇందుకు అనుగుణంగా మంగళవారం నిర్ణయం నేపథ్యంలో పసిడి గడచిన రెండు రోజుల్లో తిరిగి భారీగా పెరిగింది. మంగళవారం అమెరికా

కోవిడ్‌పై ఫెడ్‌ అస్త్రం!

Wednesday 4th March 2020

50 బేసిస్‌ పాయిం‍ట్ల కోత కరోనా వైరస్‌ ప్రభావాన్ని నిలువరించేందుకే వాషింగ్టన్‌: యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ అత్యవసరంగా కీలక రేట్లను 50 బేసిస్‌ పాయింట్లు (అర శాతం) తగ్గిస్తూ మంగళవారం నిర్ణయాన్ని ప్రకటించింది. కరోనా వైరస్‌ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరింత విస్తరిస్తుండడంతో, దీన్నుంచి అమెరికా ఆర్థిక వ్యవస్థకు మద్దుతుగా నిలిచేందుకు రేట్లను 1-1.25 శాతం స్థాయికి తగ్గించాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం తర్వాత ఫెడ్‌

Most from this category