News


నిఫ్టీ మద్దతు 11,847 పాయింట్లు

Wednesday 5th February 2020
Markets_main1580873085.png-31513

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 30 పాయింట్లు మైనస్‌
మంగళవారం యూఎస్‌ మార్కెట్ల రికార్డ్‌
లాభాల్లో ఆసియా మార్కెట్లు

నేడు(బుధవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 30 పాయింట్లు క్షీణించి 11,937 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫిబ్రవరి ఫ్యూచర్‌ 11,967 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కాగా..  కరోనా వైరస్‌ భయాల నుంచి సోమవారం బయటపడిన అమెరికా మార్కెట్లు మంగళవారం మరింత జోరందుకున్నాయి. 1.5-2 శాతం మధ్య ఎగశాయి. నాస్‌డాక్‌ సరికొత్త గరిష్టం వద్ద ముగిసింది. ఇక బడ్జెట్‌ నష్టాల నుంచి తేరుకున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు సైతం భారీ లాభాలతో దూకుడు చూపాయి.సెన్సెక్స్‌ ఇంట్రాడే గరిష్టం 40,789 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం 272 పాయింట్లు జమ చేసుకుని 11,980 వద్ద స్థిరపడింది. ప్రస్తుతం ఆసియాలోనూ మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. అయితే రెండు రోజుల్లో సెన్సెక్స్‌ 1054 పాయింట్లు జంప్‌చేయడంతో నేడు ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇచ్చే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,847 పాయింట్ల వద్ద, తదుపరి 11,714 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు  పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 12,049 వద్ద, ఆపై 12,119 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 30,320 పాయింట్ల వద్ద, తదుపరి 29,954 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 30,915 పాయింట్ల వద్ద, తదుపరి 31,143 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

డీఐఐల పెట్టుబడులు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 366 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 602 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. కాగా.. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 1200 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. డీఐఐలు దాదాపు రూ. 1287 కోట్లు ఇన్వెస్ట్‌ చేశాయి.



You may be interested

సంశయం వద్దు... పెట్టుబడులు పెట్టు!

Wednesday 5th February 2020

 పారిశ్రామిక రంగానికి ఆర్థికమంత్రి విజ్ఞప్తి న్యూఢిల్లీ: ఆర్థికాభివృద్ధికి పెట్టుబడులు పెట్టాలని, ఈ విషయంలో ఎటువంటి సంశయాలకూ తావివ్వవద్దని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పారిశ్రామిక రంగానికి విజ్ఞప్తి చేశారు. 2020-21 వార్షిక బడ్జెట్‌పై సీఐఐ మంగళవారం ఇక్కడ నిర్వహించిన ఒక చర్చాగోష్టిలో ఆమె ప్రసంగించారు. పారిశ్రామిక రంగం పురోగతికి ప్రభుత్వం తగిన అన్ని చర్యలూ తీసుకుంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.  కేవలం ప్రభుత్వ వ్యయాలే వృద్ధికి తోడ్పాటును అందిస్తాయని తాను భావించడం

వృద్ధి లక్ష్య సాధన కష్టమే: మూడీస్‌

Wednesday 5th February 2020

న్యూఢిల్లీ: భారత్‌ వృద్ధి లక్ష్య సాధన కొంత కష్టమేనని అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం- మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. 2019-20లో 4.9 శాతం వాస్తవ వృద్ధి రేటు నమోదయ్యే వీలుందని, 2020-21లో ఈ రేటు 5.5 శాతానికి పెరగవచ్చని అంచనావేసింది. భారత్‌ ఆర్థిక వ్యవస్థ వృద్ధి సాధనకు ప్రధానంగా సంస్థాగత సవాళ్లను ఎదుర్కొనాల్సి ఉంటుందని పేర్కొంది. తాజా సీతారామన్‌ ఆర్థిక బడ్జెట్‌ ప్రకారం- 2020-21లో భారత్‌

Most from this category