News


నిఫ్టీ మద్దతు 12,095, నిరోధం 12,171

Friday 7th February 2020
Markets_main1581045522.png-31584

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 10 పాయింట్లు మైనస్‌
గురువారం యూఎస్‌ మార్కెట్ల రికార్డ్‌
నేలచూపుల్లో ఆసియా మార్కెట్లు

నేడు(శుక్రవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు కొంతమేర నీరసంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 10 పాయింట్లు క్షీణించి 12,121 వద్ద ట్రేడవుతోంది. గురువారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫిబ్రవరి ఫ్యూచర్‌ 12,131 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కాగా..  గురువారం వరుసగా నాలుగో రోజు అమెరికా స్టాక్‌  మార్కెట్లు జోరందుకున్నాయి. వెరసి  ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ సరికొత్త రికార్డుల వద్ద ముగిశాయి. ఈ బాటలో దేశీ స్టాక్‌ మార్కెట్లు సైతం గురువారం వరుసగా నాలుగో రోజు లాభాలతో నిలిచాయి. సెన్సెక్స్‌ 163 పాయింట్లు పెరిగి 41,306 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 49 పాయింట్లు పుంజుకుని 12,138 వద్ద ముగిసింది. కాగా.. ప్రస్తుతం ఆసియాలో చైనా, జపాన్‌, హాంకాంగ్‌, కొరియా మార్కెట్లు ప్రతికూలంగా కదులుతున్నాయి. నాలుగు రోజులపాటు ర్యాలీ బాటలో సాగిన దేశీ స్టాక్‌ మార్కెట్లలో నేడు ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇచ్చే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. దీంతో కొంతమేర హెచ్చుతగ్గులు నమోదుకావచ్చని పేర్కొంటున్నారు.

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 12,095 పాయింట్ల వద్ద, తదుపరి 12,052 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు  పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 12,171 వద్ద, ఆపై 12,204 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 30,991 పాయింట్ల వద్ద, తదుపరి 30,677 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 31,544 పాయింట్ల వద్ద, తదుపరి 31,784 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో గురువారం​విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 560 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకోగా..  దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 304 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 249 కోట్లు, డీఐఐలు రూ. 263 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. మంగళవారం సైతం ఎఫ్‌పీఐలు రూ. 366 కోట్లు, దేశీ ఫండ్స్‌ రూ. 602 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.   



You may be interested

నేడు క్యూ3 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు

Friday 7th February 2020

బ్రిటానియా ఇండస్ట్రీస్, కార్పోరేషన్‌ బ్యాంక్, ఇమామి, 3ఐ ఇన్ఫోటెక్, 63 హనిమూన్‌ టెక్నాలజీస్, ఏసీసీ, ఏడీఎఫ్‌ ఫుడ్స్, ఆల్కేమ్‌ ల్యాబ్స్, ఆశోకా బిల్డ్‌కాన్,  అబాట్‌ ఇండియా, ఎన్‌సీసీ, ఎన్‌టీపీసీ, కంటైనర్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా, స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌, వర్లఫూల్‌ ఆఫ్‌ ఇండియా, వోల్టాస్‌, ఒబెరాయ్‌ రియల్టీ, కేర్‌ రేటింగ్స్‌, ఫ్యూచర్‌ సప్లై చైన్‌ సొల్యూషన్స్‌, ఐనాక్స్, ఎక్సెల్‌ ఇండస్ట్రీస్‌, వెంకీస్‌, మహానగర్‌ గ్యాస్‌, అపెక్స్‌ ప్రోజన్‌ ఫుడ్స్‌,

హీరో మోటొకార్ప్‌ డివిడెండ్‌ రూ.65

Friday 7th February 2020

  హీరో మోటొకార్ప్ లాభం రూ.905 కోట్లు  17 శాతం వృద్ధి  న్యూఢిల్లీ: టూవీలర్‌ దిగ్గజం హీరో మోటొకార్ప్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో 17 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) క్యూ3లో రూ.773 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ3లో రూ.905 కోట్లకు పెరిగిందని హీరో మోటొకార్ప్‌ సీఎఫ్‌ఓ నిరంజన్‌ గుప్తా తెలిపారు. కార్యకలాపాల ఆదాయం మాత్రం రూ.7,937 కోట్ల నుంచి రూ.7,075

Most from this category