News


నేడు నిఫ్టీకి 12067 వద్ద సపోర్ట్‌

Thursday 20th February 2020
Markets_main1582169204.png-31948

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 46 పాయింట్లు మైనస్‌
బుధవారం యూఎస్‌ మార్కెట్ల రికార్డ్స్‌

నేడు(గురువారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ  ఉదయం  8.30  ప్రాంతం‍లో 46 పాయింట్లు క్షీణించి 12,102 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫిబ్రవరి ఫ్యూచర్‌ 12,148 పాయింట్ల  వద్ద  ముగిసింది.  ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కరోనా భయాల నుంచి బయటపడిన అమెరికా స్టాక్‌ మార్కెట్లు బుధవారం‍ 1-0.5 శాతం మధ్య బలపడ్డాయి. వెరసి ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ మరోసారి సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ మూడేళ్ల గరిష్టానికి చేరగా.. యూరో దాదాపు మూడేళ్ల కనిష్టాన్ని తాకింది. జపనీస్‌ కరెన్సీ యెన్‌ సైతం 9 నెలల కనిష్టం వద్ద కదులుతోంది.​ కాగా.. బుధవారం ఉన్నట్టుండి దేశీయంగానూ ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. తొలి నుంచీ కొనుగోళ్లకు ఎగబడటంతో మార్కెట్లు దూకుడు చూపాయి. ఫలితంగా నాలుగు రోజుల వరుస నష్టాలకు చెక్‌ పడింది. సెన్సెక్స్‌ 429 పాయింట్లు జంప్‌చేసి 41,323 వద్ద నిలవగా.. నిఫ్టీ సైతం 138 పాయింట్లు ఎగసి 12,130 వద్ద ముగిసింది. అయితే నేడు కొంతమేర మార్కెట్లు హెచ్చుతగ్గులను చవిచూడవచ్చని నిపుణులు భావిస్తున్నారు.  దీంతో నేడు దేశీ మార్కెట్లు కన్సాలిడేట్‌ కావచ్చని అంచనా వేస్తున్నారు. 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 12,067 పాయింట్ల వద్ద, తదుపరి 12,008 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు    భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు  పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 12,160 వద్ద, ఆపై 12,193 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక   బ్యాంక్‌  నిఫ్టీకి తొలుత 30,647 పాయింట్ల వద్ద, తదుపరి 30,456 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత   30,988  పాయింట్ల వద్ద, తదుపరి 31,138 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

డీఐఐల పెట్టుబడులు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 191 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 590 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేశాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు స్వల్పంగా రూ. 74 కోట్లు, దేశీ ఫండ్స్‌ రూ. 309 కోట్లు విలువైన  స్టాక్స్‌ విక్రయించిన విషయం  విదితమే.



You may be interested

స్వల్ప నష్టంతో మొదలైన మార్కెట్‌

Thursday 20th February 2020

దేశీయ మార్కెట్‌ గురువారం స్వల్ప నష్టంతో మొదలైంది. సెన్సెక్స్‌ 50 పాయింట్ల నష్టంతో 41273 వద్ద, నిఫ్టీ 20 పాయింట్లను కోల్పోయి 12105.9 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నిన్నటి ట్రేడింగ్‌లో సూచీలు భారీ లాభాల్ని ఆర్జించినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి తాజాగా కోరోనావైరస్‌ భయాలతో ప్రతికూల సంకేతాలు వెలువడుతున్న కారణంగా దేశీయ స్టాక్‌ సూచీలు బలహీనంగా మొదలయ్యాయి.  అలాగే ఈ ఫిబ్రవరి 6-9 తేదీల్లో జరిగిన ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ

2023 నాటికి 90 కోట్ల ఇంటర్నెట్‌ యూజర్లు

Thursday 20th February 2020

సిస్కో నివేదికలో వెల్లడి హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: దేశంలో 2023 నాటికి ఇంటర్నె్‌ట్‌ వినియోగదార్ల సంఖ్య 90.7 కోట్లకు చేరుతుందని, జనాభాలో ఈ సంఖ్య 64 శాతమని సిస్కో తన వార్షిక ఇంటర్నెట్‌ నివేదికలో వెల్లడించింది. 2018లో ఇంటర్నెట్‌ యూజర్ల సంఖ్య 39.8 కోట్లుగా ఉందని తెలిపింది. ఈ సంఖ్య జనాభాలో 29 శాతమని వివరించింది. ‘2018లో 76.3 కోట్ల మొబైల్‌ యూజర్లు ఉంటే, 2023 నాటికి 96.6 కోట్లకు చేరతారు.

Most from this category