News


నేడు మరోసారి నష్టాల ఓపెనింగ్‌!

Thursday 27th February 2020
Markets_main1582774543.png-32126

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 27 పాయింట్లు మైనస్‌
నేడు నిఫ్టీకి 11,618 వద్ద తొలి సపోర్ట్‌!
వరుసగా ఐదో రోజు ఎస్‌అండ్‌పీ డీలా  

నేడు(గురువారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30  ప్రాంతం‍లో 27 పాయింట్లు క్షీణించి 11,671 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫిబ్రవరి ఫ్యూచర్‌ 12,698 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కరోనా ధాటికి అమెరికా సైతం అప్రమత్తతను ప్రకటించవలసిన పరిస్థితులు తలెత్తడంతో బుధవారం మరోసారి ప్రపంచ మార్కెట్లకు షాక్‌ తగిలింది. పలు దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ అమెరికాలోనూ విస్తరించే అవకాశమున్నట్లు వ్యాధుల నివారణ, నియంత్రణ కేంద్రం(సీడీసీ) హెచ్చరించడంతో డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ వరుసగా ఐదో రోజు డీలాపడ్డాయి. ప్రస్తుతం ఆసియాలోనూ జపాన్‌, కొరియా నష్టాలతో కదులుతున్నాయి. దీంతో నేడు మరోసారి దేశీ స్టాక్‌ మార్కెట్లు నేలచూపులతో కదిలే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. కరోనా ఆందోళనలతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలహీనపడటంతో బుధవారం సెన్సెక్స్‌ 392 పాయింట్లు పతనమై 39,889 వద్ద నిలవగా.. 119 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 11,679 వద్ద స్థిరపడింది. 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,618 పాయింట్ల వద్ద, తదుపరి 11,557 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు  పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 11,761 పాయింట్ల వద్ద, ఆపై 11,844 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌  నిఫ్టీకి తొలుత 30,121 పాయింట్ల వద్ద, తదుపరి 29,934 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 30,504  పాయింట్ల వద్ద, తదుపరి 30,701 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 3337 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 2786 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 2315 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. డీఐఐలు రూ. 1565 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 1161 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 516 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 



You may be interested

170 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్‌ ప్రారంభం

Thursday 27th February 2020

11650 దిగువన మొదలైన నిఫ్టీ మార్కెట్లో కొనసాగుతున్న కరోనా భయాలు అంతర్జాతీయ మార్కెట్‌ నుంచి బలహీన సంకేతాలను అందిపుచ్చుకున్న మార్కెట్‌ గురువారం మరోసారి నష్టంతో మొదలైంది. సెన్సెక్స్‌ 170 పాయింట్ల నష్టంతో 39718 పాయింట్ల వద్ద, నిఫ్టీ 46 పాయింట్లను కొల్పోయి 11632 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కరోనా వైరస్‌ వ్యాధి భయాలు ఈక్విటీ మార్కెట్లను ఇంకా వెంటాడుతుండటంతో నిన్న రాత్రి అమెరికా మార్కెట్లతో పాటు, నేడు ఆసియా మార్కెట్లు సైతం నష్టాలను

టమాటా, ఉల్లి ధరలు పడిపోతే వెంటనే చర్యలు

Thursday 27th February 2020

ధరల పతనంపై అప్రమత్తం చేసేందుకు వెబ్‌సైట్‌ ఆవిష్కరించిన కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్‌కౌర్‌ బాదల్‌ న్యూఢిల్లీ: టమాటా, ఉల్లిపాయలు, ఆలుగడ్డల ధరలు ఉన్నట్టుండి పతనమైతే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసేందుకు రూపొందించిన పోర్టల్‌ (వెబ్‌సైట్‌)ను కేంద్ర ఆహార శుద్ధి శాఖా మంత్రి హర్‌సిమ్రత్‌కౌర్‌ బాదల్‌ బుధవారం ఢిల్లీలో ఆవిష్కరించారు. ‘‘ప్రజలు అధికంగా వినియోగించే ఈ మూడు కూరగాయల టోకు ధరలను ఈ పోర్టల్‌ తెలియజేస్తుంది. అధిక సరఫరా కారణంగా ధరలు పడిపోతే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తుంది.

Most from this category