News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 57 పాయింట్లు డౌన్‌

Monday 6th January 2020
Markets_main1578280665.png-30687

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 57 పాయింట్లు మైనస్‌

ఇరాన్‌, అమెరికా మధ్య చెలరేగిన ఉద్రిక్తతల నేపథ్యంలో సోమవారం దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 57 పాయింట్ల నష్టంతో 12,203 పాయింట్ల  వద్ద  కదులుతోంది. క్రితం రోజు ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,260 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. ఇరాక్‌ విమానాశ్రయంపై అమెరికా మిలటరీ దాడులు నిర్వహించి, ఇరాన్‌, ఇరాక్‌ సైనికాధికారులను కాల్చివేయడంతో గత వారం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో వారాంతాన ఇటు దేశీ స్టాక్‌ మార్కెట్లు, అటు అమెరికా ఇండెక్సులు నష్టాలతో ముగిశాయి. శుక్రవారం సెన్సెక్స్‌ 162 పాయింట్లు నీరసించి 41,465 వద్ద నిలవగా.. నిఫ్టీ 55 పాయింట్లు క్షీణించి 12,227 వద్ద స్థిరపడింది. ఇక యూఎస్‌ మార్కెట్లు 0.8 శాతం వెనకడుగు వేశాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లలోనూ అమ్మకాలదే పైచేయిగా కనిపిస్తోంది. జపాన్‌ 2 శాతం పతనంకాగా.. తైవాన్‌, కొరియా, ఇండొనేసియా, హాంకాంగ్‌, థాయ్‌లాండ్‌, సింగపూర్‌ 1.2-0.6 శాతం మధ్య క్షీణించాయి. చైనా మాత్రమే(0.25 శాతం) లాభంతో ట్రేడవుతోంది.

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 12,190 పాయింట్ల వద్ద, తదుపరి 12,154 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 12,264 వద్ద, ఆపై 12,302 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 31,910 పాయింట్ల వద్ద, తదుపరి 31,750 వద్ద సపోర్ట్‌   లభించవచ్చని, ఇదే విధంగా తొలుత 32,279 పాయింట్ల వద్ద, తదుపరి 32,489 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని అంచనా వేశారు. 

పెట్టుబడుల బాట
నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1263 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1029 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. ఇక గురువారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 689 కోట్లు, డీఐఐలు రూ. 64 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.You may be interested

చైర్మన్‌ హోదా అక్కర్లేదు!!

Monday 6th January 2020

టాటా గ్రూప్‌లో అసలే పదవిపైనా ఆసక్తి లేదు మైనారిటీ షేర్‌హోల్డర్ల హక్కుల రక్షణే లక్ష్యం సైరస్ మిస్త్రీ స్పష్టీకరణ ముంబై: టాటా సన్స్ చైర్మన్‌గా పునఃనియమించాలంటూ నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ .. తనకు ఆ హోదాపై ఆసక్తేమీ లేదని సైరస్ మిస్త్రీ స్పష్టం చేశారు. అసలు టాటా గ్రూప్‌లో ఏ పదవీ తనకు అక్కర్లేదని ఆయన పేర్కొన్నారు. సంస్థ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు

బడ్జెట్లో పీఎస్‌బీలకు నిధులు కేటాయింపులు ఉండకపోవచ్చు

Monday 6th January 2020

న్యూఢిల్లీ: రానున్న 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ప్రభుత్వరంగ బ్యాంకులకు (పీఎస్‌బీలు) నిధుల కేటాయింపును ప్రకటించకపోవచ్చని, బదులుగా మొండి బకాయిలు (ఎన్‌పీఏలు) వసూలుకు, మార్కెట్ల నుంచి నిధుల సమీకరణ దిశగా వాటిని ప్రోత్సహించొచ్చని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. అలాగే, ప్రభుత్వరంగ బ్యాంకులు తమకు అనుబంధ కంపెనీల్లో, జాయింట్‌ వెంచర్లలో ఉన్న వాటాల విక్రయం ద్వారా నిధులు సమీకరించొచ్చని ఆ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు కొన్నింటికి బీమా, మ్యూచువల్‌

Most from this category