News


గ్యాప్‌ డౌన్‌ ఓపెనింగ్‌?!

Tuesday 31st December 2019
Markets_main1577762689.png-30542

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 38 పాయింట్లు డౌన్‌ 

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు(మంగళవారం) నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 38 పాయింట్ల నష్టంతో 12,289 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ స్టాక్‌ మార్కెట్లలో ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. సోమవారం స్వల్ప ఒడిదొడుకుల మధ్య దేశీ స్టాక్‌ మార్కెట్లు అటూఇటుగా ముగిశాయి. సెన్సెక్స్‌ 17 పాయింట్ల స్వల్ప నష్టంతో 41,558 వద్ద నిలవగా.. నిఫ్టీ 10 పాయింట్లు పుంజుకుని 12,256 వద్ద స్థిరపడింది. కాగా.. ఇటీవల సరికొత్త రికార్డుల ర్యాలీ చేస్తున్న అమెరికా స్టాక్‌ మార్కెట్లు 0.7 శాతం నష్టంతో ముగిశాయి. ప్రస్తుతం ఆసియాలోనూ బలహీన ట్రెండ్‌ కనిపిస్తోంది. హాంకాంగ్‌, తైవాన్‌, చైనా 0.5-0.2 శాతం మధ్య నీరసించగా.. ఇతర మార్కెట్లకు సెలవు. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ స్వల్ప వెనకడుగుతో 96.68కు చేరగా.. యూరో 1.121 వద్ద కదులుతోంది. డాలరుతో మారకంలో జపనీస్‌ యెన్‌ 108.73ను తాకింది. చమురు ధరలు స్వల్ప వెనకడుగు వేశాయి. లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ బ్యారల్‌ 66.57 డాలర్ల వద్ద, నైమెక్స్ క్రూడ్‌ బ్యారల్‌ 61.57 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఇక న్యూయార్క్‌ కామెక్స్‌లో పసిడి ఔన్స్‌ 0.33 శాతం పుంజుకుని 1520 డాలర్లను అధిగమించింది.

స్వల్ప అమ్మకాలు 
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 130.5 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 201 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. గత శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 81 కోట్లు, డీఐఐలు రూ. 126 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.



You may be interested

పాన్‌ ఆధార్‌ లింకింగ్‌ గడువు తేదీ పొడగింపు

Tuesday 31st December 2019

- వచ్చే ఏడాది మార్చి చివరి తేది న్యూఢిల్లీ: పాన్‌ కార్డుతో ఆధార్‌ నెంబర్‌ అనుసంధానాకి గడువు తేదీని పొడగించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ప్రకటించింది. వచ్చే ఏడాది (2020) మార్చి 31 వరకు గడువు తేదీని పొడగించినట్లు వివరించింది. గతంలో ఈ ఏడాది డిసెంబర్‌ 31 చివరి తేదీగా ప్రకటించిన బోర్డ్‌.. తాజాగా మరోసారి తాజా చర్య తీసుకుంది. 

అక్టోబర్‌లోనూ కొనసాగిన జియో జోరు

Tuesday 31st December 2019

- 91 లక్షల నూతన చందాదారులు న్యూఢిల్లీ: ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ జియో.. సబ్‌స్క్రైబర్ల సంఖ్యను  గణనీయంగా పెంచుకుంటోంది. అనతికాలంలోనే భారతీ ఎయిర్‌టెల్‌ను వెనక్కు నెట్టి రెండో స్థాన్నాన్ని కైవసం చేసుకున్న ఈ సంస్థ.. అదే జోరును కొనసాగిస్తూ, వాయు వేగంతో దూసుకుపోతోంది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ తాజాగా ప్రకటించిన సమాచారం ప్రకారం.. ఈ ఏడాది అక్టోబర్‌లో నూతనంగా 91 లక్షల చందాదారులు జతకావడంతో సంస్థ మొత్తం

Most from this category