News


ప్రతికూల ఓపెనింగ్‌!?

Tuesday 24th December 2019
Markets_main1577158228.png-30390

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 18 పాయింట్లు డౌన్‌
దేశీ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం కొంతమేర ప్రతికూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 18 పాయింట్ల నష్టంతో 12,262 పాయింట్ల వద్ద కదులుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. చైనాతో కుదిరిన వాణిజ్య ఒప్పందంపై త్వరలో సంతకాలు చేయనున్నట్లు ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ప్రకటించడంతో సోమవారం మరోసారి అమెరికా స్టాక్‌ మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాల వద్ద ముగిశాయి. అయితే దేశీయంగా గత వారం ఇటు సెన్సెక్స్‌, అటు నిఫ్టీ సరికొత్త గరిష్టాలను అందుకున్న నేపథ్యంలో సోమవారం ట్రేడర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య స్వల్ప నష్టాలతో ముగిసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆసియా స్టాక్‌ మార్కెట్లలో మిశ్రమ ధోరణి నెలకొంది.

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే తొలుత నిఫ్టీకి 12,222 పాయింట్ల వద్ద, తదుపరి 12,180 వద్ద మద్దతు(సపోర్ట్‌) లభించే అవకాశముంది. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే.. తొలుత 12,296 పాయింట్ల వద్ద, ఆపై 12,328 వద్ద నిఫ్టీకి అవరోధాలు(రెసిస్టెన్స్‌) ఎదురయ్యే అవకాశమున్నట్లు సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఈ బాటలో బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 32190 పాయింట్ల వద్ద, తదుపరి 32,040 వద్ద మద్దతు లభించే వీలున్నట్లు అంచనా వేశారు. ఇదే విధంగా 32,496, 32,652 స్థాయిల వద్ద రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని ఊహిస్తున్నారు. సోమవారం డాలరుతో మారకంలో రూపాయి 6 పైసలు నీరసించి 71.18 వద్ద ముగిసింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి 71.15 వద్ద ప్రారంభమైంది. ఆపై 71.11-71.24 మధ్య హెచ్చుతగ్గులు చవిచూసింది. 

ఎఫ్‌పీఐల పెట్టుబడులు
నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) సోమవారం రూ. 1463 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1947 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. కాగా.. శుక్రవారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 339 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు రూ. 285 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ విక్రయించిన విషయం విదితమే.You may be interested

మొబైల్స్ దే మెజారిటీ వాటా

Tuesday 24th December 2019

ఆన్‌లైన్‌ షాపింగ్‌పై నీల్సన్‌ సర్వే తొలిసారి కస్టమర్లు 56 శాతం హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: భారత్‌లో ఈ-కామర్స్‌ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇద్దరు వినియోగదార్లలో ఒకరు తొలిసారిగా ఆన్‌లైన్‌ వేదికగా వస్తువులను కొనుగోలు చేస్తున్నవారే. ఈ ఏడాది మే-జూలైతో పోలిస్తే ఆగస్టు-అక్టోబరులో మొత్తం కస్టమర్లలో వీరి శాతం అత్యధికంగా 56 శాతానికి చేరుకుందని నీల్సన్‌ నివేదిక చెబుతోంది. 10 లక్షలకుపైగా జనాభా కలిగిన 52 నగరాల్లోని 1,90,000 మంది ఆన్‌లైన్‌ కస్టమర్ల షాపింగ్‌

యస్‌ బ్యాంకు.. నిధుల సమీకరణతోనే సానుకూలత

Tuesday 24th December 2019

యూరోపియన్‌ సంస్థలు యస్‌ బ్యాంకులో బిలియన్‌ డాలర్ల పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నట్టు వార్తలు రాగా, ఇది సఫలం అయితే బ్యాంకు ఊపిరి పీల్చుకున్నట్టేనని ఈల్డ్‌ మ్యాగ్జిమైజర్‌ వ్యవస్థాపకుడు యోగేష్‌ మెహతా పేర్కొన్నారు. పలు అంశాలపై ఆయన ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.   యస్‌ బ్యాంకు యస్‌ బ్యాంకు టైర్‌-1, టైర్‌-2 నిధుల కొరతను ఎదుర్కొంటోంది. అలాగే, మూలధన నిధులు కూడా బ్యాంకుకు ఇప్పుడు చాలా కీలకంగా మారాయి. నిధుల అవసరం ఎంతో

Most from this category