News


లాభాల ఓపెనింగ్‌కు ఛాన్స్‌?!

Friday 27th December 2019
Markets_main1577416944.png-30461

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 40 పాయిం‍ట్లు ప్లస్‌ 
గురువారం యూఎస్‌ మార్కెట్ల రికార్డ్‌

దేశీ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాలతో(గ్యాపప్‌) ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 40 పాయింట్ల లాభంతో 12,234 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్లలో ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. క్రిస్మస్‌ సెలవుల తదుపరి గురువారం​ప్రారంభమైన అమెరికా స్టాక్‌ మార్కెట్లు మరోసారి సరికొత్త గరిష్టాల వద్ద ముగిశాయి. కాగా.. క్రితం రోజు డిసెంబర్‌ డెరివేటివ్‌ సిరీస్‌ ముగింపు నేపథ్యంలో బుల్‌ ఆఫ్‌లోడింగ్‌ జరగడంతో వరుసగా మూడో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు అమ్మకాలతో డీలాపడ్డాయి. గురువారం సెన్సెక్స్‌ 297 పాయింట్లు పతనమై 41164 వద్ద నిలవగా, నిఫ్టీ 88 పాయింట్లు క్షీణించి 12127 వద్ద స్థిరపడింది. కాగా.. గురువారం డాలరుతో మారకంలో రూపాయి 4 పైసలు నీరసించి 71.31 వద్ద ముగిసింది.

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు మరోసారి బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 12,090 పాయింట్ల వద్ద, తదుపరి 12,053 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 12,192 వద్ద, ఆపై 12,258 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 31869 పాయింట్ల వద్ద, తదుపరి 31740 వద్ద సపోర్ట్‌ లభించవచ్చని, ఇదే విధంగా తొలుత 32220 పాయింట్ల వద్ద, తదుపరి 32443 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని అంచనా వేశారు. 

అమ్మకాలవైపు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 504 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 120 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. బుధవారం క్రిస్మస్‌ సందర్భంగా మార్కెట్లకు సెలవుకాగా.. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 114 కోట్లు, దేశీ ఫండ్స్‌ రూ. 345 కోట్ల విలువైన స్టాక్స్‌ చొప్పున విక్రయించిన విషయం విదితమే.



You may be interested

వామ్మో.. ఏటీఎం!?

Friday 27th December 2019

భద్రతపై ఆర్‌బీఐ ఆదేశాలు బేఖాతరు... లైట్‌ తీసుకుంటున్న బ్యాంకులు సాఫ్ట్‌వేర్ అప్‌డేషన్‌కు దగ్గరపడుతున్న డెడ్‌లైన్‌ పూర్తి స్థాయిలో అమలు కాని పరిస్థితి న్యూఢిల్లీ: ఏటీఎంలలో భద్రత లోపాలు అనేకసార్లు బైటపడుతున్నప్పటికీ బ్యాంకులు తగు చర్యలు తీసుకోవడం లేదు. ఈ విషయంలో బ్యాంకింగ్‌ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశాలను కూడా అంతగా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఏటీఎంలలో విండోస్‌ 7 సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకోవడం మొదలుకుని యాంటీ స్కిమ్మింగ్‌ కార్డ్‌ రీడర్లు ఇన్‌స్టాల్‌

ఇన్‌ఫ్రాలో మంచి అవకాశాలు

Friday 27th December 2019

గత ఏడాది కాలంలో మౌలిక రంగానికి చెందిన చాలా స్టాక్స్‌ గణనీయంగా దిద్దుబాటుకు గురయ్యాయి. 2024 నాటికి మౌలిక సదుపాయాల కోసం రూ.100 లక్షల కోట్లు వెచ్చించాలన్నది కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక. దీంతో మౌలిక రంగం 2020లో పెట్టుబడుల పరంగా మంచి అవకాశాలనిస్తుందని బ్రోకరేజీ, ఫైనాన్షియల్‌ సేవల సంస్థ ప్రభుదాస్ లీలాధర్‌ తెలిపింది. ‘‘2019-20 ఆర్థిక సంవత్సరం ద్వితీయ భాగంలో ఆర్డర్ల​రాక పుంజుకుంటుంది. రోడ్లు, ఇరిగేషన్‌, ఫ్యాక్టరీలు, బిల్డింగ్‌, రైల్వేస్‌,

Most from this category