News


నేడు సానుకూల ఓపెనింగ్‌ ?!

Friday 31st January 2020
Markets_main1580440844.png-31351

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 36 పాయింట్లు ప్లస్‌
లాభా‍ల్లో అమెరికా, ఆసియా మార్కెట్లు

నేడు(శుక్రవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 36 పాయింట్లు పుంజుకుని 12,082  వద్ద ట్రేడవుతోంది. గురువారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫిబ్రవరి ఫ్యూచర్‌ 12,046 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ తాజాగా జపాన్‌కు చేరడంతో గురువారం ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు డీలాపడ్డాయి. దీనికితోడు కరోనాపై ప్రపంచ అత్యయిక పరిస్థితిని ప్రకటించనున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) పేర్కొనడంతో సెంటిమెంటు బలహీనపడింది. ఫలితంగా జనవరి డెరివేటివ్‌ సిరీస్‌ చివరి రోజు గురువారం దేశీ స్టాక్‌ మార్కెట్లు బోర్లాపడ్డాయి. సెన్సెక్స్‌ 285 పాయింట్లు పతనమైంది. 41,000 పాయింట్ల దిగువన 40,914 వద్ద ముగిసింది. ఇదేవిధంగా నిఫ్టీ 94 పాయింట్లు కోల్పోయి 12,036 వద్ద స్థిరపడింది. అయితే గురువారం అమెరికా మార్కెట్లు నష్టాల నుంచి బయటపడగా.. ప్రస్తుతం ఆసియాలోనూ పలు మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. కరోనా వైరస్‌ను చైనా సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నట్లు గురువారం​ రాత్రి WHO పేర్కొనడం‍తో ఒక్కసారిగా ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు విశ్లేషకులు తెలియజేశారు. శనివారం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రకటించనున్న నేపథ్యంలో నేడు ఆర్థిక సర్వే వెలువడనుంది. దీంతో నేడు దేశీ మార్కెట్లు హుషారుగా కదిలే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,981 పాయింట్ల వద్ద, తదుపరి 11,926 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు  పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 12,121 వద్ద, ఆపై 12,205 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 30,476 పాయింట్ల వద్ద, తదుపరి 30,305 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 30,864 పాయింట్ల వద్ద, తదుపరి 31,081 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 962 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 292 కోట్లు ఇన్వెస్ట్‌ చేశాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 1014 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 1521 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన విషయం విదితమే.



You may be interested

ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టాలి

Friday 31st January 2020

బ్యాంకింగ్‌-ఎన్‌బీఎఫ్‌సీ రంగం డిమాండ్‌ మొండిబాకీల సమస్యల నుంచి ఇప్పుడిప్పుడే కొంత గాడిలోకి వస్తున్న బ్యాంకింగ్‌ రంగం రానున్న బడ్జెట్‌లో భారీస్థాయి ఆశలేవీ పెట్టుకోలేదు. ఎందుకంటే ఇప్పటికే మూలధన నిధులను అందించడం, బలహీన బ్యాంకులను విలీనం చేయడం తదితర చర్యలతో ప్రభుత్వం తన ప్రాధాన్యతలను చెప్పకనేచెప్పింది. అయితే, ఎన్‌పీఏ భయాలతో కార్పొరేట్‌ రంగానికి రుణాలను ఇచ్చేందుకు ఇప్పటికీ బ్యాంకులు జంకుతున్నాయి. ఈ తరుణంలో బడ్జెట్‌లో బ్యాంకులు ఏం కోరుకుంటున్నాయి? ఈ రంగంలో నిపుణులు

బజాజ్‌ ఆటో లాభం రూ.1,322 కోట్లు

Friday 31st January 2020

(అప్‌డేటెడ్‌...) 8 శాతం వృద్ధి  రూ.7,640 కోట్లకు పెరిగిన ఆదాయం  న్యూఢిల్లీ: టూవీలర్‌ దిగ్గజం, బజాజ్‌ ఆటో నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో 8 శాతం పెరిగింది. గత క్యూ3లో రూ.1,221 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.1,322 కోట్లకు పెరిగిందని బజాజ్‌ ఆటో తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ.7,436 కోట్ల నుంచి 2 శాతం వృద్ధితో రూ.7,640 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ముడి పదార్థాల

Most from this category