News


నిఫ్టీ నిరోధం 12,212, 12,255

Wednesday 22nd January 2020
Markets_main1579663572.png-31087

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 48 పాయింట్లు ప్లస్‌

నేడు(బుధవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాల(గ్యాప్‌ అప్‌)తో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 48 పాయింట్లు ఎగసి 12,248 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,200 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలను తగ్గించిన నేపథ్యంలో మంగళవారం తొలి నుంచీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడ్డారు. ఫలితంగా రోజంతా దాదాపు నష్టాల మధ్యే కదిలిన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి ప్రస్తావించగ్గ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 205 పాయింట్లు క్షీణించి 41,324 వద్ద నిలవగా.. నిఫ్టీ 55 పాయింట్ల నష్టంతో 12,170 వద్ద స్థిరపడింది. వర్ధమాన దేశాలలో ఇండియా ఆర్థిక వృద్ధి సైతం మరింత నీరసించనున్నట్లు తాజా అంచనాలలో పేర్కొనడం ప్రభావం చూపినట్లు నిపుణులు తెలియజేశారు. అయితే బడ్జెట్‌పై అంచనాలు పెరగడంతో నేడు దేశీ స్టాక్‌ మార్కెట్లు పుంజుకునే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా.. మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు సైతం 0.5-0.2 శాతం మధ్య వెనకడుగు వేశాయి.

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 12,145 పాయింట్ల వద్ద, తదుపరి 12,120 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 12,212 వద్ద, ఆపై 12,255 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 30,814 పాయింట్ల వద్ద, తదుపరి 30,680 వద్ద సపోర్ట్‌ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 31,126 పాయింట్ల వద్ద, తదుపరి 31,305 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

అమ్మకాల బాట
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) స్వల్పంగా​రూ. 50 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) సైతం​రూ. 308 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం కూడా ఎఫ్‌పీఐలు కేవలం రూ. 6 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 1420 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం గమనార్హం! 



You may be interested

విలీనానికి 3 బీమా సంస్థల బోర్డులు ఆమోదం

Wednesday 22nd January 2020

చెన్నై: ప్రభుత్వ రంగంలోని మూడు సాధారణ బీమా సంస్థల విలీనం చర్యలు ఊపందుకున్నాయి. ఈ ప్రతిపాదనకు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ (ఎన్‌ఐసీ), ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ (ఓఐసీ), యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ (యూఐఐసీ) బోర్డులు ఆమోదముద్ర వేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఓఐసీ, యూఐఐసీ బోర్డులు గత శుక్రవారం ఢిల్లీలో సమావేశం కాగా... ఎన్‌ఐసీ బోర్డు సోమవారం కోల్‌కతాలో భేటీ అయ్యింది. 2018 కేంద్ర బడ్జెట్‌లో ఈ మూడు

బీఓబీ, బీఓఐ, కెనరాబ్యాంక్‌లకు కొత్త చీఫ్‌లు

Wednesday 22nd January 2020

న్యూఢిల్లీ: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ), బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ), కెనరాబ్యాంక్‌లకు కొత్త ఎండీ అండ్‌ సీఈఓలు నియమితులయ్యారు. నియామకపు వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ ఇందుకు సంబంధించిన నియామకాలకు ఆమోదముద్ర వేసింది.  వేర్వేరుగా చూస్తే... బీఓబీ:- సంజయ్‌ చంద్ర ఎండీ అండ్‌ సీఈఓగా నియమితులయ్యారు. ప్రస్తుతం సంజయ్‌ చంద్ర బ్యాంకింగ్‌ దిగ్గజం- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ ఇన్‌చార్జ్‌గా

Most from this category