STOCKS

News


అమెరికా దాడులు...ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ డౌన్‌

Friday 3rd January 2020
Markets_main1578021432.png-30630

 ఇరాక్‌ విమానాశ్రయంపై అమెరికా మిలటరీ దాడులు నిర్వహించి, ఇరాన్‌, ఇరాక్‌ సైనికాధికారులను కాల్చివేయడంతో హఠాత్తుగా ఆసియా స్టాక్‌ సూచీలు పడిపోయిన నేపథ్యంలో నేడు(శుక్రవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు నీరసంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ దాదాపు 40పాయింట్ల నష్టంతో 12,300 పాయింట్ల  వద్ద కదులుతోంది. క్రితం రోజు ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,339 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కొత్త ఏడాది వరుసగా రెండో రోజు గురువారం  సెన్సెక్స్‌ 321 పాయింట్లు జంప్‌చేసి 41627 వద్ద నిలవగా.. నిఫ్టీ 100 పాయింట్లు ఎగసి 12,283 వద్ద ముగిసింది. వెరసి సెన్సెక్స్‌ ఇంట్రాడే గరిష్టానికి చేరువలో స్థిరపడగా.. నిఫ్టీ క్లోజింగ్‌లో గరిష్ట రికార్డ్‌ నెలకొల్పింది. ఇరాక్‌పై అమెరికా వైమానికదాడుల నేపథ్యంలో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు తెలియజేశారు.

అమెరికా రికార్డ్‌
ఈ నెల రెండో వారంలో చైనాతో వాణిజ్య వివాద పరిష్కార ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్లు అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ పేర్కొన్న నేపథ్యంలో అమెరికా స్టాక్‌ మార్కెట్లు గురువారం సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. దీనికితోడు 2018 తదుపరి చైనా పీపుల్స్‌ బ్యాంక్‌ వరుసగా 8వసారి బ్యాంకుల రిజర్వు నిల్వల శాతాన్ని తగ్గించడంతో చైనా ఆర్థిక వ్యవస్థ బలపడనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఫలితంగా నాస్‌డాక్‌, డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ 1.35-0.85 శాతం మధ్య లాభపడ్డాయి. యూరొపియన్‌ మార్కెట్లు సైతం 1 శాతం స్థాయిలో ఎగశాయి. అయితే తాజా దాడుల నేపథ్యంలో అమెరికా స్టాక్‌ ఫ్యూచర్లు శుక్రవారం ఉదయం భారీగా క్షీణించాయి. అలాగే ఆసియా స్టాక్‌ మార్కెట్లు దిగువకు జారుకున్నాయి.  

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 12,222 పాయింట్ల వద్ద, తదుపరి 12,161 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు  పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 12,316 వద్ద, ఆపై 12,350 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 32,222 పాయింట్ల వద్ద, తదుపరి 32,000 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని, ఇదే విధంగా తొలుత 32,566 పాయింట్ల వద్ద, తదుపరి 32,688 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని అంచనా వేశారు. 

పెట్టుబడుల బాట
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 689 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 64 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేశాయి. బుధవారం ఎఫ్‌పీఐలు స్వల్పంగా రూ. 59 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. డీఐఐలు రూ. 208 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.You may be interested

మిస్త్రీ కేసులో సుప్రీం కోర్టుకు టాటా సన్స్‌

Friday 3rd January 2020

న్యూఢిల్లీ: ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తిరిగి తీసుకోవాలంటూ నేషనల్‌ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ టాటా సన్స్‌ .. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎన్‌సీఎల్‌ఏటీ ఉత్తర్వులను కొట్టివేయాలని కోరింది.  చైర్మన్‌గా ఎన్‌ చంద్రశేఖరన్‌ నియామకం చట్టవిరుద్ధమన్న ఆదేశాలను కూడా తిరస్కరించాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు, టాటా సన్స్‌ను ప్రైవేట్ సంస్థగా మార్చడంలో తమ పాత్రను తప్పుపడుతూ ఇచ్చిన ఉత్తర్వులను సవరించాల్సిందిగా కోరుతూ

అనంతపురంలో 30 ఎకరాల్లో లాజిస్టిక్‌ పార్క్‌

Friday 3rd January 2020

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ముంబైకి చెందిన గ్రేడ్‌–ఏ ఇండస్ట్రియల్, లాజిస్టిక్‌ పార్క్స్‌ డెవలపర్‌ ఇండోస్పేస్‌ ఆంధ్రప్రదేశ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతపురంలో 30 ఎకరాల్లో  భారీ లాజిస్టిక్‌ పార్క్‌ను ఏర్పాటు చేయనుంది. ఇది బెంగళూరు – హైదరాబాద్‌ జాతీయ రహదారి–44కు సమీపంలో ఉండటంతో పాటూ కృష్ణపట్నం నౌకాశ్రయానికి కనెక్టివిటీతో ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇండోస్పేస్‌ను సింగపూర్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ ఎవర్‌స్టోన్‌ గ్రూప్‌ ప్రమోట్‌

Most from this category