News


లాభాల ఓపెనింగ్‌ చాన్స్‌ నేడు?!

Tuesday 4th February 2020
Markets_main1580786817.png-31483

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 35 పాయింట్లు ప్లస్‌
సోమవారం యూఎస్‌ మార్కెట్లు అప్‌
అటూఇటుగా ఆసియా మార్కెట్లు

నేడు(మంగళవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 35 పాయింట్లు పుంజుకుని 11,745 వద్ద ట్రేడవుతోంది. శనివారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫిబ్రవరి ఫ్యూచర్‌ 11,710 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కాగా..  కరోనా వైరస్‌ భయాల నుంచి బయటపడిన అమెరికా మార్కెట్లు సోమవారం 0.5 శాతం పుంజుకోగా.. బడ్జెట్‌ నష్టాల నుంచి తేరుకున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు సైతం లాభాలతో ముగిశాయి. ప్రస్తుతం ఆసియాలో మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నాయి. సోమవారం సెన్సెక్స్‌ 137 పాయింట్లు పుంజుకుని 39,872 వద్ద నిలవగా.. నిఫ్టీ 46 పాయింట్లు బలపడి 11,708 వద్ద స్థిరపడింది. అయితే దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు మరోసారి హెచ్చుతగ్గుల మధ్య కదిలే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,632 పాయింట్ల వద్ద, తదుపరి 11,555 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు  పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 11,767 వద్ద, ఆపై 11,826 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 29,722 పాయింట్ల వద్ద, తదుపరి 29,421 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 30,215 పాయింట్ల వద్ద, తదుపరి 30,407 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

డీఐఐల పెట్టుబడులు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1200 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) దాదాపు రూ. 1287 కోట్లు ఇన్వెస్ట్‌ చేశాయి. కాగా..  శనివారం ఎఫ్‌పీఐలు రూ. 1200 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌ కేవలం‍ రూ. 37 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. 



You may be interested

లిథియం బ్యాటరీల సరఫరాలో బీపీసీఎల్‌

Tuesday 4th February 2020

కైనెటిక్‌, ఐఐటీ మద్రాస్‌లతో జట్టు చెన్నై: ప్రభుత్వ రంగ చమురు తయారీ దిగ్గజం బీపీసీఎల్ తాజాగా ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల కోసం లిథియం అయాన్ బ్యాటరీల సరఫరా కార్యకలాపాలు ప్రారంభించింది. ఇందుకోసం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్‌, ఐఐటీ మద్రాస్‌ (సాంకేతిక సహకారం)తో జట్టు కట్టింది. తొలి దశలో కొచి, లక్నోలోని తమ రిటైల్ అవుట్‌లెట్స్‌లో లిథియం అయాన్ బ్యాటరీలను అందుబాటులోకి తెచ్చింది.

టీసీఎస్‌కు రూ.10,650 కోట్ల కాంట్రాక్ట్‌

Tuesday 4th February 2020

డబ్ల్యూబీఏ నుంచి పదేళ్ల కాంట్రాక్టు  న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) భారీ కాంట్రాక్ట్‌ను సాధించింది. ఫార్మా కంపెనీ వాల్‌గ్రీన్స్‌ బూట్స్‌ అలయెన్స్‌(డబ్ల్యూబీఏ) నుంచి ఈ కాంట్రాక్ట్‌ను పొందామని టీసీఎస్‌ తెలిపింది. ఈ కాంట్రాక్ట్‌ కాలపరిమితి పదేళ్లని పేర్కొంది. కాంట్రాక్టులో భాగంగా డబ్ల్యూబీఏకు అవసరమైన ఐటీ సర్వీసులను అందిస్తామని వివరించింది. వేగంగా విస్తరిస్తున్న వ్యాపార అవసరాలను సమర్థవంతంగా అందిపుచ్చుకునేందుకు టీసీఎస్‌తో భాగస్వా‍మ్యం ఉపకరించగలదని డబ్ల్యూబీఏ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, గ్లోబల్‌

Most from this category