News


నిఫ్టీ మద్దతు12,153 పాయింట్లు

Thursday 13th February 2020
Markets_main1581563673.png-31735

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 11 పాయింట్లు మైనస్‌
బుధవారం యూఎస్‌ మార్కెట్ల రికార్డ్స్‌

నేడు(గురువారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు కొంతమేర ప్రతికూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 11 పాయింట్లు నీరసించి 12,216 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫిబ్రవరి ఫ్యూచర్‌ 12,227 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. వరుసగా మూడో రోజు బుధవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు సరికొత్త రికార్డుల వద్ద ముగిశాయి. డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ 1-0.6 శాతం మధ్య బలపడ్డాయి. అయితే అమెరికా ఇండెక్సుల ఫ్యూచర్స్‌ వెనకడుగులో ఉన్నాయి. ఆసియాలో ప్రస్తుతం చైనా మినహా మిగిలిన మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. కాగా.. విదేశీ సానుకూల సంకేతాలతో వరుసగా మూడో రోజు బుధవారం దేశీ స్టాక్‌ మార్కెట్లు దూకుడు చూపాయి. సానుకూల ప్రపం‍చ సంకేతాలతో హుషారుగా ప్రారంభమైన మార్కెట్లు తదుపరి మరింత జోరందుకున్నాయి. తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఏదశలోనూ వెనుదిరిగి చూడలేదు. సెన్సెక్స్‌ 350 పాయింట్లు జంప్‌చేసి 41,566 వద్ద నిలవగా.. నిఫ్టీ 93 పాయింట్లు పెరిగి 12,201 వద్ద స్థిరపడింది. వెరసి రెండు వారాల గరిష్టానికి చేరాయి. దీంతో నేడు ట్రేడర్లు కొంతమేర లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇచ్చే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 12,153 పాయింట్ల వద్ద, తదుపరి 12,105 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు  పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 12,241 వద్ద, ఆపై 12,280 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 31,398 పాయింట్ల వద్ద, తదుపరి 31,303 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 31,588 పాయింట్ల వద్ద, తదుపరి 31,684 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

డీఐఐల పెట్టుబడులు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 49 కోట్లు,  దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 339 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేశాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 209 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. డీఐఐలు రూ. 345 కోట్లవరకూ ఇన్వెస్ట్‌ చేశాయి. ఇక సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 184 కోట్లు, దేశీ ఫండ్స్‌ దాదాపు రూ. 736 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.



You may be interested

పరిశ్రమలు వెనక్కి...!

Thursday 13th February 2020

యథా‘మైనస్‌’లోకి పారిశ్రామిక ఉత్పత్తి డిసెంబర్‌లో 0.3 శాతం క్షీణత తయారీ, విద్యుత్‌ రంగాల ప్రధానపాత్ర ఆరేళ్ల గరిష్టస్థాయికి రిటైల్‌ ధరల మంట న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రతికూల పరిస్థితుల నుంచి బయట పడలేదనడానికి స్పష్టమైన గణాంకాలు బుధవారం వెలువడ్డాయి. పారిశ్రామిక ఉత్పత్తి నవంబర్‌లో మైనస్‌లోకి జారిపోతే... రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆరేళ్ల గరిష్టానికి చేరింది. ఆర్థిక, విధాన నిర్ణేతలకు ఆందోళన కలిగిస్తున్న అంశాలివి. 2020-21 బడ్జెట్‌పై జరిగిన చర్చకు మంగళవారం లోక్‌సభలో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌

8.3 శాతం క్షీణించనున్న వాహన ఉత్పత్తులు!

Wednesday 12th February 2020

పిచ్‌ అంచనా చైనా దేశాన్ని ఆర్థికంగా కుదిపేసిన కరోనావైరస్‌ భారత వాహన రంగంపై  ప్రభావాన్ని చూపనుంది. కరోనా వైరస్‌ కారణంగా మన దేశంలో  వాహన రంగంలోఉత్పత్తులు పడిపోయే అవకాశం ఉందని పిచ్‌ అంచనా వేసింది. గతేడాది 13.2 శాతంగా ఉన్న ఉత్పత్తి ఈ ఏడాది 8.3 శాతానికి క్షీణించవచ్చని తెలిపింది. ముఖ్యంగా భారత్‌లో తయారయ్యే వాహనాలకు  విడిభాగాలు అధికంగా చైనా నుంచే సరఫరా అవుతుండడమే ఇందుకు కారణమని తెలిపింది. చైనాలో కరోనా

Most from this category