News


నిఫ్టీ మద్దతులు 12,002, 11,958

Tuesday 18th February 2020
Markets_main1581996510.png-31876

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 62 పాయింట్లు పతనం
 సోమవారం యూఎస్‌ మార్కెట్లు డీలా

నేడు(మంగళవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు నేలచూపుల(గ్యాప్‌ డౌన్‌)తో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం  8.30 ప్రాంతం‍లో 62 పాయింట్లు క్షీణించి 12,017 వద్ద ట్రేడవుతోంది. సోమవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫిబ్రవరి ఫ్యూచర్‌ 12,079 పాయింట్ల వద్ద  ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌, జీడీపీ అంచనాలలో మూడీస్‌ కోత కలగలసి సోమవారం దేశీ స్టాక్‌ మార్కెట్లను దెబ్బతీశాయి. ఫలితంగా వరుసగా మూడో రోజు నష్టాలతో నిలిచాయి. సెన్సెక్స్‌ 202 పాయింట్లు క్షీణించి 41,056 వద్ద నిలవగా.. నిఫ్టీ 68 పాయింట్లు తక్కువగా 12,046 వద్ద ముగిసింది. కరోనా రోజురోజుకీ వేగంగా విస్తరిస్తున్న కారణంగా ఆసియా మార్కెట్లు బలహీనంగా కదులుతున్నాయి. కరోనా ప్రభావంతో అమ్మకాలు తగ్గనున్నట్లు ఐఫోన్ల దిగ్గజం యాపిల్‌ తాజాగా పేర్కొనడంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. టెలికం కంపెనీలు ఏజీఆర్‌ బకాయిలను చెల్లిస్తున్నప్పటికీ ప్రభుత్వ బ్యాంకింగ్‌ రంగంలో మొండి రుణాలపై ఆందోళనలు నెలకొన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ఇటీవల పీఎస్‌యూ బ్యాంక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తున్నట్లు తెలియజేశారు. కాగా.. నేడు దేశీయంగా మార్కెట్లు నష్టాల మధ్య కదలవచ్చని అంచనా వేస్తున్నారు. 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 12,002 పాయింట్ల వద్ద, తదుపరి 11,958 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు  భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు  పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 12,125 వద్ద, ఆపై 12,203 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక  బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 30,541 పాయింట్ల వద్ద, తదుపరి 30,402 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత  30,909 పాయింట్ల వద్ద, తదుపరి 31,137 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

అమ్మకాల వైపు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 374 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 154 కోట్లు చొప్పున  పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. వారాంతాన ఎఫ్‌పీఐలు రూ. 705 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. డీఐఐలు దాదాపు రూ. 220 కోట్లను ఇన్వెస్ట చేసిన విషయం విదితమే.



You may be interested

ఎన్‌సీఎల్‌ఏటీ మరెన్నో అంశాలను పట్టించుకోలేదు!

Tuesday 18th February 2020

సుప్రీంకోర్టులో సైరస్‌ మిస్త్రీ క్రాస్‌ అప్పీల్‌ ముంబై: నేషనల్‌ కంపెనీ లా అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) డిసెంబర్‌ 18న తనకు అనుకూలంగా రూలింగ్‌ ఇచ్చినా, తన పిటిషన్‌లోని ఎన్నో అంశాలను పట్టించుకోలేదని, తనకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని పేర్కొంటూ సైరెస్‌ మిస్త్రీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన వివాదానికి సంబంధించి అత్యున్నత న్యాయస్థానంలో క్రాస్‌ అప్పీల్‌ వేశారు. మిస్త్రీని టాటా సన్స్‌ చైర్మన్‌గా తిరిగి నియమించాలంటూ ఎన్‌సీఎల్‌ఏటీ ఇచ్చిన

రూ.300 కోట్లతో బీఈ కొత్త ప్లాంటు

Tuesday 18th February 2020

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఔషధ రంగ సంస్థ బయాలాజికల్-ఇ (బీఈ) లిమిటెడ్‌ హైదరాబాద్‌ సమీపంలోని శామీర్‌పేట వద్ద ఉన్న జీనోమ్‌ వ్యాలీ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌లో కొత్త ప్లాంటును ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు ఈ కేంద్రాన్ని సోమవారమిక్కడ ప్రారంభించారు. ఈ సందర్భంగా కంపెనీ రూపొందించిన టైఫాయిడ్‌ కాంజుగేట్‌ వ్యాక్సిన్‌ను ఆయన ఆవిష్కరించారు. 2017 బయో ఆసియా కార్యక్రమం సందర్భంగా ఈ

Most from this category