News


నిఫ్టీ మద్దతు 12,078

Tuesday 28th January 2020
Markets_main1580181654.png-31253

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 26 పాయింట్లు మైనస్‌
అమెరికా, ఆసియా మార్కెట్లు పతనం
ఇతర దేశాలకూ పాకుతున్న కరోనా వైరస్‌ 

నేడు(మంగళవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు ప్రతికూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 26 పాయింట్లు నీరసించి 12,094  వద్ద ట్రేడవుతోంది. సోమవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,119 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి  తెలిసిందే. అమెరికాకు జలుబు చేస్తే.. ప్రపంచ మార్కెట్లకు తమ్ములొస్తాయన్నది స్టాక్‌ మార్కెట్లలో పాత సామెత. అయితే ప్రస్తుతం చైనాలోని మారుమూల వుహాన్‌లో పుట్టిన కరోనా వైరస్‌ ప్రపంచ మార్కెట్లను వణికిస్తోంది. దీంతో సోమవారం అమెరికా మార్కెట్లు 1.5-2 శాతం మధ్య క్షీణించగా.. ప్రస్తుతం ఆసియాలోనూ మార్కెట్లు పతనబాటలో సాగుతున్నాయి. ఇక సోమవారం దేశీయంగానూ ఆందోళనకులోనైన ఇన్వెస్టర్లు తొలి నుంచీ అమ్మకాలకు ఎగబడ్డారు. ఫలితంగా మార్కెట్లు రోజంతా నష్టాలమధ్యే కదిలాయి. సెన్సెక్స్‌ 458 పాయింట్లు పతనమై 41,155 వద్ద నిలవగా.. నిఫ్టీ 129 పాయింట్లు కోల్పోయి 12,119 వద్ద ముగిసింది. వెరసి నేడు కూడా మార్కెట్లు అధిక శాతం నేలచూపులతోనే కదిలే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 12,078 పాయింట్ల వద్ద, తదుపరి 12,038 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు  పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 12,188 వద్ద, ఆపై 12,257 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 30,688 పాయింట్ల వద్ద, తదుపరి 30,539 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 31,107 పాయింట్ల వద్ద, తదుపరి 31,376 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 439 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఇక దేశీ ఫండ్స్‌(డీఐఐలు) నామమాత్రంగా రూ. 10.5 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. అయితే వారాంతాన ఎఫ్‌పీఐలు రూ. 659 కోట్లు, డీఐఐలు రూ. 418 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేసిన విషయం విదితమే.  



You may be interested

నేడు క్యూ3 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు

Tuesday 28th January 2020

మారుతి సజుకీ, సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ సెల్యూషన్స్‌, సెంచురీ టెక్స్‌టైల్స్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కుమ్మిన్స్‌ ఇండియా, కెమో ఫార్మా ల్యాబ్స్‌, ఇన్ఫీబీమ్‌ అవెన్యూస్‌, జేకే లక్ష్మీ సిమెంట్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్స్‌ సర్వీసెస​, మణప్పురం ఫైనాన్స్‌, మెస్టేక్‌, రామ్‌కో సిస్టమ్స్‌లతో పాటు సుమారు 65 కంపెనీలు నేడు తమ మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. 

భారత్‌-బ్రెజిల్‌ వాణిజ్య పటిష్టతకు చర్యలు: గోయెల్‌

Tuesday 28th January 2020

రెండు దేశాల అధికారుల విందు సమావేశంలో ప్రసంగం బిజినెస్‌ లీడర్స్‌ ఫోరమ్‌ పునర్‌వ్యవస్థీకరణకు ప్రతిపాదన న్యూఢిల్లీ: భారత్‌ - బ్రెజిల్‌ మధ్య వాణిజ్య పటిష్టతకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్‌ గోయెల్‌ సూచించారు. రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ఇండియా-బ్రెజిల్‌ బిజినెస్‌ లీడర్స్‌ ఫోరమ్‌ పునర్‌వ్యవస్థీకరణ, ఫోరమ్‌ క్రియాశీలతకు చర్యలు అవసరమని బ్రెజిల్‌కు సూచించారు. బ్రెజిల్‌ అధ్యక్షుడు బొల్సనారో సమక్షంలో ఇరు

Most from this category