News


టెల్కోల ఎఫెక్ట్‌...వీక్‌ ఓపెనింగ్‌?

Friday 17th January 2020
Markets_main1579231175.png-30975

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 21 పాయింట్లు మైనస్‌

సుప్రీం కోర్టు టెలికాం కంపెనీల ఏజీఆర్‌ చెల్లింపులపై పిటీషన్‌ కొట్టివేయడంతో ఆ షేర్లతో పాటు, ఆయా కంపెనీలకు రుణాలిచ్చిన బ్యాంకులపై ప్రతికూల ప్రభావం పడనున్న నేపథ్యంలో  నేడు(శుక్రవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు కొంతమేర ప్రతికూలం(నెగిటివ్‌)గా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 21 పాయింట్లు క్షీణించి 12,349 వద్ద ట్రేడవుతోంది. గురువారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,370 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. చైనాతో వాణిజ్య వివాద పరిష్కారంలో భాగంగా ప్రాథమిక దశ డీల్‌ కుదుర్చుకున్న నేపథ్యంలో గురువారం వరుసగా రెండో రోజు అమెరికా స్టాక్‌ మార్కెట్లు రికార్డు గరిష్టాల వద్ద ముగిశాయి. టెక్‌ దిగ్గజాల అండతో ఎస్‌అండ్‌పీ-500 ఇండెక్స్‌ మార్కెట్‌ చరిత్రలో తొలిసారి 3,300 పాయింట్ల మార్క్‌ను తాకింది. ఇక ప్రస్తుతం  ఆసియా స్టాక్‌ మార్కెట్లలోనూ సానుకూల ధోరణి కనిపిస్తోంది. కాగా.. గురువారం దేశీ స్టాక్‌ మార్కెట్లు ఆద్యంతం ఒడిదొడుకుల మధ్య కదిలి చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 60 పాయింట్లు బలపడి 41,932 వద్ద నిలవగా.. నిఫ్టీ 13 పాయింట్లు పుంజుకుని 12,356 వద్ద స్థిరపడింది. బడ్జెట్‌ నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని, దీంతో నేడు కూడా మార్కెట్లు స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కన్సాలిడేట్‌ కావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 12,318 పాయింట్ల వద్ద, తదుపరి 12,280 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు      పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 12,391 వద్ద, ఆపై 12,427 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 31,701 పాయింట్ల వద్ద, తదుపరి 31,549  వద్ద సపోర్ట్‌     లభించవచ్చని అంచనా వేశారు.  ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 31,998 పాయింట్ల వద్ద, తదుపరి 32,142 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

అమ్మకాలవైపు..
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 395 కోట్లు,  దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 185 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 279 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేయగా..డీఐఐలు రూ. 648 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన సంగతి తెలిసిందే.  



You may be interested

సైయంట్‌ లాభం రూ.108 కోట్లు

Friday 17th January 2020

హైదరాబాద్‌: డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3) ఆర్థిక ఫలితాల్లో సైయంట్‌ మిశ్రమ ఫలితాలు సాధించింది. నికరలాభం గణనీయంగా పెరిగినా... మొత్తం ఆదాయంలో మాత్రం క్షీణత నమోదయింది. క్యూ3 కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో రూ.108 కోట్ల లాభాన్ని ఆర్జించింది. క్యూ2లో నికరలాభం రూ.98.5 కోట్లుండగా, గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లాభం రూ.92 కోట్లుగా ఉంది. లాభాల్లో క్యూ2తో పోలిస్తే 10 శాతం, గతేడాది క్యూ3తో పోలిస్తే 17.6 శాతం

సుప్రీం తీర్పుతో ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ పరిస్థితి ఏంటి?

Friday 17th January 2020

సుప్రీం తీర్పు ప్రభావం టెలికం రంగ కంపెనీలైన భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా షేర్లపై శుక్రవారం నాటి ట్రేడింగ్‌ సెషన్‌లో చూపిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌)పై గతేడాది అక్టోబర్‌ 24న ఇచ్చిన తీర్పును తిరిగి సమీక్షించాలని కోరుతూ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా, టాటా టెలీసర్వీసెస్‌ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. దీని తాలూకూ ప్రకంపనలు టెలికం కంపెనీలపై తీవ్రంగానే ఉంటాయని, ముఖ్యంగా

Most from this category