News


నేడు నిఫ్టీకి 10,247 వద్ద సపోర్ట్‌!

Wednesday 11th March 2020
Markets_main1583896413.png-32394

అటూఇటుగా ప్రపంచ మార్కెట్లు
ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 47 పాయింట్లు మైనస్‌ 
మంగళవారం యూఎస్‌ మార్కెట్లు హైజంప్‌
ప్రస్తుతం నేలచూపులో ఆసియా మార్కెట్లు

నేడు(బుధవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి నేలచూపులతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 47 పాయింట్లు క్షీణించి 10,400 వద్ద ట్రేడవుతోంది. హోలీ పండుగ సందర్భంగా మంగళవారం దేశీ స్టాక్‌ మార్కెట్లకు సెలవుకాగా.. సోమవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 10,447 పాయింట్ల  వద్ద ముగిసింది. ఇక్కడి  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. సోమవారంంనాటి భారీ పతనాల నుంచి మంగళవారం అమెరికా, యూరోపియన్‌ మార్కెట్లు రికవర్‌ అయ్యాయి. ప్రధానంగా అమెరికన్‌ ఇండెక్సులు డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ 5 శాతం చొప్పున జంప్‌ చేశాయి. అయితే యూరోపియన్‌ మార్కెట్లు చివర్లో నీరసించగా.. ప్రస్తుతం ఆసియాలో మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నాయి. దీంతో నేడు దేశీయంగానూ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదలవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ‍ట్రేడర్ల షార్ట్‌ కవరింగ్‌ కారణంగా కొంతమేర మార్కెట్లు నిలదొక్కుకునే అవకాశం సైతం ఉన్నట్లు తెలియజేశారు.

సోమవారం బోర్లా
చాలా కాలం తరువాత సోమవారం దేశీ స్టాక్‌ మార్కెట్లు ఒక్కసారిగా బేర్‌మన్నాయి. ఇన్వెస్టర్ల గుండె గుభేల్‌మంది. ఓవైపు కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థలు మందగమనంలోకి జారుకోవచ్చన్న ఆందోళనలు కొనసాగుతుండగా.. తాజాగా చమురు ధరల సంక్షోభం తలెత్తింది. దీంతో సెన్సెక్స్‌ 1942 పాయింట్లు దిగజారి 35,635 వద్ద స్ఢిరపడింది. ఇక నిఫ్టీ 538 పాయింట్లకు నీళ్లొదులుకుని 10,451 వద్ద ముగిసింది. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ(కేపిటలైజేషన్‌)కు రూ. 7 లక్షల కోట్లమేర చిల్లు పడింది

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 10,247 పాయింట్ల వద్ద, తదుపరి 10,042 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 10,704 పాయింట్ల వద్ద, ఆపై 10,956 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 25,893 పాయింట్ల వద్ద, తదుపరి 25,324 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 27,062 పాయింట్ల వద్ద, తదుపరి 27,661 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు. 

ఎఫ్‌పీఐల భారీ విక్రయాలు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 6,596 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌ (డీఐఐలు) రూ. 4,975 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. 2017 నవంబర్‌ 3 తదుపరి ఒకే రోజు ఎఫ్‌పీఐలు ఈ స్థాయిలో అమ్మకాలు చేపట్టడం మళ్లీ ఇప్పుడే! కాగా.. వారాంతాన ఎఫ్‌పీఐలు రూ. 3,595 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. డీఐఐలు రూ. 2,544 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ(మార్చి) నెలలో ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు రూ. 17,316 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించడం గమనార్హం! 



You may be interested

టీసీఎస్‌ మధ్యంతర డివిడెండ్‌ రూ.12

Wednesday 11th March 2020

న్యూఢిల్లీ: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 1 ముఖ విలువ గల ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.12 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నది. ఈ మేరకు డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని టీసీఎస్‌ వెల్లడించింది. ఈ నెల 20లోపు తమ షేర్లను హోల్డ్‌ చేసిన వాటాదారులకు ఈ నెల 24న ఈ డివిడెండ్‌ను చెల్లిస్తామని వివరించింది. 

క్రూడ్‌ ధరల తగ్గుదల భారత్‌కు మంచిదే!

Tuesday 10th March 2020

  కోవిడ్‌-19(కరోనా వైరస్‌) వ్యాప్తితో ప్రపంచ దేశాల స్టాక్‌ మార్కెట్లు పతనమవుతుండడంతో ఆయా దేశాలు ఆర్థిక వ్యస్థలు చిన్నాభిన్నమవుతున్నాయి.ఫలితంగా చాలా ఉత్పత్తులకు డిమాండ్‌లేక ధరలు పడిపోతున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌కు డిమాండ్‌ తక్కువగా ఉండి ఉత్పత్తి పెరగడంతో ధరలు దిగివస్తున్నాయి. ఈ పరిమాణం భారత ఆర్థిక వ్యవస్థకు, స్టాక్‌ మార్కెట్‌కు అనుకూలించే అంశమని నిపుణులు చెబుతున్నారు. సెన్సెక్స్‌, క్రూడ్‌ ఆయిల్‌ రెండు ఒకటి పెరిగితే మరోకటి తగ్గుతూ  వ్యతిరేఖ

Most from this category