News


ప్రతికూల ఓపెనింగ్‌ నేడు!

Friday 24th January 2020
Markets_main1579836156.png-31153

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 15 పాయింట్లు మైనస్‌

నేడు(శుక్రవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు కొంతమేర ప్రతికూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 15 పాయింట్లు తక్కువగా 12,185  వద్ద ట్రేడవుతోంది. గురువారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,200 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి  తెలిసిందే. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) చైనాలో వైరస్‌ వ్యాపిస్తున్న పరిస్థితులు ఎమర్జెన్సీ కిందకురావని తాజాగా పేర్కొంది. మరోవైపు ఇప్పటికే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలను తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరుసగా నాలుగో రోజు చమురు ధరలు డీలాపడగా.. గురువారం యూఎస్‌ మార్కెట్లు అటూఇటుగా ముగిశాయి. ఆటో రంగ దిగ్గజం టెస్లా 100 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువను అందుకోవడం విశేషం! ప్రస్తుతం ఆసియా మార్కెట్లలోనూ అమ్మకాదే పైచేయిగా కనిపిస్తోంది. కాగా.. గురువారం దేశీ స్టాక్‌ మార్కెట్లలో వరుస నష్టాలకు చెక్‌ పడింది. మూడు రోజుల అమ్మకాలకు బ్రేక్‌వేస్తూ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో మార్కెట్లు ప్రస్తావించదగ్గ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 271 పాయింట్లు ఎగసి 41,386 వద్ద నిలవగా.. నిఫ్టీ 73 పాయింట్లు పుంజుకుని 12,180 వద్ద స్థిరపడింది. బడ్జెట్‌పై ఇన్వెస్టర్ల అంచనాలకుతోడు, ట్రేడర్ల షార్ట్‌ కవరింగ్‌జత కలవడంతో మార్కెట్లు లాభపడినట్లు విశ్లేషకులు తెలియజేశారు. కాగా.. ప్రపంచ మార్కెట్ల బలహీనతల నేపథ్యంలో నేడు తిరిగి స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య మార్కెట్లు కన్సాలిడేట్‌ కావచ్చని భావిస్తున్నారు.

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 12,120 పాయింట్ల వద్ద, తదుపరి 12,060 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు  పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 12,215 వద్ద, ఆపై 12,249 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 30,721 పాయింట్ల వద్ద, తదుపరి 30,438 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 31,187 పాయింట్ల వద్ద, తదుపరి 31,370 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

ఎఫ్‌పీఐల యూటర్న్‌
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) కొనుగోళ్లకు దిగారు. రూ. 1352 కోట్లను ఇన్వెస్ట్‌ చేశారు. అయితే దేశీ ఫండ్స్‌(డీఐఐలు) అమ్మకాలు కొనసాగిస్తూ రూ. 984 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. కాగా.. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 176 కోట్లు, డీఐఐలు రూ. 326 కోట్లు విలువైన స్టాక్స్‌ విక్రయించిన విషయం విదితమే. 



You may be interested

నేడు క్యూ3 ఫలితాలను ప్రకటించనున్న కొన్ని ప్రధాన కంపెనీలు

Friday 24th January 2020

ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఆవాస్‌ ఫైనాన్స్‌, అగ్రో టెక్‌(ఇండియా), ఆల్‌సెక్‌ టెక్నాలజీస్‌, అతుల్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఇండియా బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, మంగళం డగ్ర్స్‌ అండ్‌ ఆర్గానిక్స్‌, ఓరియంటల్‌ హోటల్స్‌, ప్రేస్టేజ్‌ ఎస్టేట్స్‌ ప్రాజెక్ట్స్‌, టెక్‌ ఇండియా నిర్మన్‌ కంపెనీలు నేడు తమ మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. 

2024 నాటికి 69 శాతం పనులు ఆటోమేషనే

Friday 24th January 2020

గార్ట్‌నర్‌ సంస్థ అంచనా బెంగళూరు: ప్రస్తుతం మేనేజర్ల స్థాయిల్లో జరుగుతు‍న్న పనుల్లో 69 శాతం 2024 నాటికి ఆటోమేషన్‌ (యంత్రాలు) అవుతాయని అంతర్జాతీయ పరిశోధనా సంస్థ ‘గార్ట్‌నర్‌’ అధ్యయనం పేర్కొంది. వర్చువల్‌ పర్సనల్‌ అసిస్టెన్స్‌, చాట్‌బాట్స్‌ వంటి అత్యాధునిక టెక్నాలజీలు మేనేజర్లపై పని భారం తగ్గించనున్నాయని తెలిపింది. మేనేజర్‌ పాత్ర నాలుగేళ్ల కాలంలో పూర్తిగా మారిపోబోతుందని పేర్కొంది. ‘‘ప్రస్తుతం మేనేజర్లు పత్రాలను నింపడం, తాజా సమాచారాన్ని పొందుపరచడం, పనులను ఆమోదించడం వంటి

Most from this category